సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జోగి రమేష్.. జాయింట్ కలెక్టర్‌తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.

జోగి రమేష్‌తో ఫోన్‌లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్‌కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు.



