illegal gravel mining
-
సోమిరెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ దోపిడీ
వెంకటాచలం: అక్రమ సంపాదన కోసం పేదల భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ అక్రమంగా తవ్వుతూ వారి కడుపు కొట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడులో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశాన్ని గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి కాకాణి శుక్రవారం పరిశీలించారు. గ్రామస్తులు, మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, కన్నీరు పెట్టుకున్నారు. తమ భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే సీఐ సుబ్బారావు తమపైనే కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను సైతం తవ్వేశారని విలపించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో సహజ వనరుల దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకునే ఈ భూముల్లో గతంలోనే కొందరికి డీ ఫారం పట్టాలు కూడా ఇచ్చారని, 2007లోనే విద్యుత్ సౌకర్యం కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా«దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వేస్తున్నారని «విమర్శించారు. అడ్డుకున్న మహిళలపై కూడా కేసులు పెడతామని సీఐ సుబ్బారావు బెదిరించడం చూస్తే ఎంత అవినీతిలో కూరుకుపోయారో అర్థమవుతుందన్నారు. జిల్లాలో కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. మైనింగ్ శాఖ డీడీ నిద్రలేస్తే అవినీతిలో మునిగి తేలుతున్నాడని ఆరోపించారు. అసలు జిల్లాలో అధికార యంత్రాంగం పనిచేస్తోందా అని నిలదీశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీల నంబర్లు నమోదు చేస్తున్నామని, కలెక్టర్‌తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. టీడీపీ, బీజేపీ సానుభూతిపరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోయి తమతో కలిసి పోరాటానికి వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల వైస్ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. -
తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..
అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్‌కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం.. మా ఇష్టం అన్నట్లు తెల్ల ఖనిజాన్ని తెలుగు తమ్ముళ్లు కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి మంచి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ అండగా.. తెలుగు తమ్ముళ్ల భాగస్వామ్యంతో అక్రమార్కులు భారీగా తెల్లరాయి తవ్వకాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.కనిగిరిరూరల్/పీసీపల్లి: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రూ.లక్షలవిలువైన సహజ వనరులను, ఖనిజ సంపదలను ఇష్టాను సారంగా దోచుకుంటున్నారు. ఆరు మండలాల్లో రెవె న్యూ, ఫారెస్ట్, కొండ పరివాహక శివారు ప్రాంత భూములను అడ్డాగా మార్చుకుని యంత్రాలతో రాత్రుల్లో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్నిచోట్ల కొంత భూమిని లీజు అనుమతి పొంది.. వారికి ఇష్టమొచ్చినంత తవ్వుతుండగా, మరికొన్ని చోట్ల అసలు అనుమతి అనే మాట లేకుండానే అధికార పార్టీ అండే తమకు లైసెన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తెల్లరాయి ఉన్నా.. కనిగిరి ప్రాంతంలో ఉన్న తెల్లరాయి కి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ గ్రేడ్ 1 రకం రాయి లభ్యమవుతుంది. దీంతో కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలకే మైనింగ్ మాఫియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీ ప్రాంతం అధికంగా ఉండటం.. శివారు ప్రాంతం కావడంతో చెన్నై లాంటి ప్రాంతాలకు వైట్‌క్వార్జ్ (తెల్ల రాయిని)ని ఎక్కువగా తరలించే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు స్థానిక టీడీపీ నేతల అండతో ఇక్కడ మకాం వేసి అక్రమ దందా సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులుతెల్లరాయి అక్రమ తవ్వకాల వ్యవహారం అధికారులకు తెలియదంటే పొరపాటే. అధికార పార్టీ నేతల ఒత్తిడి కొంత ఉన్నా.. అక్రమార్జనలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన కొల్లగొట్టిన తెల్ల ఖనిజ ఆదాయంలో అధికారులకు నెలవారీ నజరానాలు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధికారుల సలహాలు, సూచనలతో స్టాక్ పాయింట్లకు, తవ్వకాలకు కొంత భూములను అనుమతి తీసుకుని వాటిని అధికారులకు చూపి స్తూ ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ భూములుగా నిర్ధారణ కాని, హద్దులు తేల్చని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రుళ్లు పొక్లైన్లతో, జేసీబీలతో తవ్వకాలు చేసి అనుమతి పొందిన స్టాక్ పాయింట్ ప్రదేశంలో వేసుకుని తెల్లవారిన తర్వాత తరలిస్తున్నారు. ఇది ఒకరకం దోపిడీ కాగా మరోరకం దోపిడీ అయితే పీసీపల్లి కేంద్రంగా సాగుతోంది. ఇక్కడ అనుమతులుండవు.. అధికారులు రారు.. తమ్ముళ్లదే ఇష్టారాజ్యం. అటవీ, రెవెన్యూ ఇలా ఏ భూముల్లో అయినా రాత్రింబవళ్లు తవ్వకాలు జోరుగా చేస్తుంటారు. ఒక్కో లారీకి 30 నుంచి 40 టన్ను ల ఎగుమతి జరగ్గా.. టన్నుకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని తెలిసింది. వారానికి నాలుగు లారీల చొప్పున తెల్లరాయి తరలిస్తున్నాయి. పీసీపల్లి అడ్డాగా.. పచ్చనేతల చీకటి దందా పీసీపల్లి మండలంలో మైనింగ్ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. మండలంలోని అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ కుమారుడు నేరేడుపల్లి, లక్ష్మక్కపల్లిలో గుంటూరు లింగన్నపాలెం, అడవిలోపల్లి, మెట్లవారిపాలెం, గుంటుపల్లి, తురకపల్లి, మురిగమ్మి గ్రామాల్లో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. మురగమ్మిలో 20 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూములు, నేరేడుపల్లిలో 25 ఎకరాల్లో, గుంటుపల్లిలో 10 ఎకరాల్లో, తురకపల్లిలో 15 ఎకరాల్లో, లక్ష్మక్కపల్లిలో (మాలకొండకు పోయే దారిలో) 20 ఎకరాల్లో, లింగన్నపాలెంలో 5 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూముల్లో నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నేతల అండతో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు.గడిచిన కాలంలో ఒక్క మురగమ్మి ప్రాంతంలోనే మైనింగ్ శాఖ అధికారులు ఐదు సార్లు దాడులు చేసి లారీలను, జేసీబీలను, తెల్లరాయిని పట్టుకున్నారు. అయినా తెల్లరాయి దందాను తమ్ముళ్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పీసీపల్లి నుంచి నెల రోజుల వ్యవధిలో సుమారు ఒక వెయ్యి టన్నుల మేర అక్రమార్కులు గ్రేజింగ్, అటవీ పోరంబోకు భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు అంచనా. అనుమతి (లీజు) పొందిన ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు చూపిస్తూ.. పది శాతం చలానా చెల్లించి.. 100 శాతం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.ఫిర్యాదులు చేస్తేనే కదలికమైనింగ్ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు తెల్లరాయి ఖనిజాల తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఆ వైపు అడుగులు వేసిన దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. నామ్‌కే వాస్తే రెండు నెలలకొకసారి మేమున్నాం అంటూ ఒకటి రెండు కేసులు పెట్టి మమ అనిపిస్తారు. కొంతకాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల శివారు ప్రాంతాల్లో చీర్లదిన్నె, నాగిరెడ్డి కొండల మధ్య ఫారెస్ట్ బీట్ భూముల్లో టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ తవ్వుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అయితే సుమారు 10 టన్నుల రాయి స్టాక్ మాత్రమే దొరకడంతో రూ.1.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిసింది. గత గురువారం రాత్రి మురిగమ్మి కొండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని మైనింగ్, విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ లారీ, జేసీబీ సీజ్ చేశారు. బల్లిపల్లి ప్రాంతంలో తెల్లరాయి తవ్వకం విషయంలో కూటమి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.తెల్లరాయి తవ్వకం ప్రాంతాలు ఇవే..కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి మండలం బల్లిపల్లి, అడ్డరోడ్డు, చీర్లదిన్నె, బాల వెంకటాపురం, వెలిగండ్ల శివారు ప్రాంతాలు, నాగిరెడ్డిపల్లి, పీïÜç³ల్లి మండలంలో గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మురిగమ్మి, పామూరు మండలం మార్కొండాపురం,నాసికాత్రయంబకం తది తర ప్రాంతాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
కూటమి నేతల ఆక్రమ దందా
-
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి జరిమానా
పూసపాటిరేగ: నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కుమారుడు తమ్మునాయుడు అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పూసపాటిరేగలోని సర్వే నంబరు 82–1, 2లో అనుమతి లేకుండా లేఅవుట్‌కు గ్రావెల్ తరలించడంతో ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడటంతో జరిమానా విధించారు. రెల్లివలసలో సర్వే నంబరు 17లో గల నడుపూరు రమేష్‌కు చెందిన వ్యసాయభూమి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా 350 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించడంతో జరిమానా విధించినట్లు విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పూసపాటిరేగలోని లేఅవుట్లో ఉన్న రెండు ట్రాక్టర్లు, జేసీబీ, రోడ్డురోలర్ మొత్తం నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, రాయల్టీ ఇన్స్పెక్టర్లు ఎం.సురేష్‌కుమార్, రాంబాబు, సత్యమూర్తి, సర్వేయర్ తులసి, వీఆర్ఓలు అప్పలనాయుడు, దురగాసి రామకృష్ణ పాల్గొన్నారు. -
తవ్వేస్తున్నారు
ప్రభుత్వ భూమిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు అనుమతి ఓ చోట, తవ్వకాలు మరో చోట గడువు పూర్తయినా ఆగని తవ్వకాలు మామూళ్లమత్తులో రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారులు ఒక్కొక్కరికీ ఒక్కో ప్యాకేజీ అక్రమార్కులు కొందరు సహజవనరులను కొల్లగొడుతున్నారు. గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అనుమతి ఓ చోట పొంది, మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి గడువు పూర్తయినా ఆగలేదు. రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ సహజనవనరులను దోచుకుంటున్న వైనంపై కథనం. బుచ్చిరెడ్డిపాళెం : కొడవలూరు మండలంలో గ్రావెల్దందా మితిమీరింది. యల్లాయపాళెం రెవెన్యూ పరిధిలోని రామాపురంలో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కార్తికేయ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గ్రావెల్ కావాలని జిల్లా మైన్స్ అండ్ జియాలజీ విభాగాన్ని కోరింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స్థానిక తహసీల్దార్ ద్వారా పంపింది. వీటిని పరిశీలించిన జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రావెల్ రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 2016 మే 11వ తేదీన మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ మే 12న సర్వే నంబరు 1034లో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో 4330 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను రెండు నెలల్లో తీసుకోవాల్సిందిగా అనుమతి ఇచ్చారు. జరుగుతోందిలా... సర్వే నంబరు 1034లో నేటికీ దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. అనుమతికి మించి 50వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. గడువు ముగిసి ఎనిమిది రోజులు దాటుతున్నా నేటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. మానిటరింగ్ చేయాల్సిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలుతోంది. సీలింగ్ భూమిలో తవ్వకాలు సర్వే నంబరు 1034లో 11.16 సెంట్లు సీలింగ్ భూమి ఉంది. ఈ భూమిని యల్లాయపాళెం గ్రామస్తుడు పి.రామచంద్రారెడ్డి 1983లో ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దీనిని అప్పటి కోవూరు తహసీల్దార్ టి. పార్థసారధి రెవెన్యూ డివిజనల్ అధికారికి సమాచారం ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాల క్రమేణా కొందరికీ ప్రభుత్వం మంజూరు చేసింది. వారిలో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో తవ్వకాలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్న సంస్థ, సర్వే పరిధిలోలోని మిగతా భూమిలో తవ్వకాలు జరుపుతోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సర్వే నంబరు 1034లో అనుమతికి మించి, అనుమతి లేని భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై స్థానికులు తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. జరుగుతున్న పరిస్థితులను వివరించారు. సర్వే జరుపుతామని తప్పకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ప్యాకేజీ అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ వైపు వెళ్లిన దాఖలాలు లేవు. లోకాయుక్తకు ఫిర్యాదు అనుమతికి మించి, అనుమతి లేని చోట తవ్వకాలు జరగడంపై స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో తహసీల్దార్, మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చనున్నామన్నారు. కళ్ల ముందు అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్‌పై అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ధనానికి గండికొట్టి అక్రమంగా సహజవనరులను దోచుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ జానకిని కోరుతున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అనుమతి మేరకు తవ్వకాలు జరపాలి. స్థానిక వీఆర్వోను సంఘటన స్థలానికి పంపుతాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.


