సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఈ నెల ఏడో తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ .500, రీ–వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ కోసం పాఠశాల లాగిన్‌తో పాటు వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించినట్టు తెలిపారు.


