recounting marks
-
‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 7 వరకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఈ నెల ఏడో తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ .500, రీ–వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ కోసం పాఠశాల లాగిన్‌తో పాటు వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించినట్టు తెలిపారు. -
డీఎడ్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. 39,778 మంది పరీక్ష రాయగా... 32,973 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే, పాఠశాల విద్య కమిషనర్ ఆమోదం పొందని 14 మైనారిటీ, 52 కొత్త డీఎడ్ కళాశాలలకు చెందిన 3,875 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం www.bseap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


