ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్‌ కన్ను | Chandrababu Government Is Encroaching Upon Agricultural seed farm lands | Sakshi
Sakshi News home page

ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్‌ కన్ను

Jun 12 2026 5:29 AM | Updated on Jun 12 2026 5:29 AM

Chandrababu Government Is Encroaching Upon Agricultural seed farm lands

చిత్తూరు జిల్లాలో సీడ్‌ ఫామ్‌కు చెందిన 46.69 ఎకరాలు 

సోలార్‌ ప్లాంట్‌కు కేటాయింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూములను అతి చవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయ విత్తన క్షేత్రా­ల భూములపై కన్నుపడింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం మహదేవమంగళం గ్రామంలో సుమారు 436 ఎకరాల్లో బహుళ విత్తనోత్పత్తి క్షేత్రం (సీడ్‌ మల్టీప్లికేషన్‌ ఫామ్‌) ఉంది. ఇక్కడ వరి, వేరుశనగ, జొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు.

ఈ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 46.69 ఎకరాల భూమిని సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మా­ణం కోసం కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఫామ్‌లో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎలాంటి అనుమతుల్లేకుండా ఫామ్‌లోని మట్టిని తవ్వి దొడ్డిదారిన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement