Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates
20:49, అక్టోబర్ 20, 2023
మనసంతా బాబే.!
► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే
► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు?
► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది?
19:49, అక్టోబర్ 20, 2023
రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం
► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు
► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు
19:39, అక్టోబర్ 20, 2023
యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ?
► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు
ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు
ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం?
గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని?
పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య
ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది?
పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు?
అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు
19:19, అక్టోబర్ 20, 2023
ముఖ్యమంత్రి ఆశలకు మంగళం
► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్
► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం
► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే
► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు
► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు
► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి
► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి
► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది
► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం
► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది
► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు
► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు
► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా
► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే
► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా
► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా
18:18, అక్టోబర్ 20, 2023
2 ములాఖత్ లకు ఓకే
►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు
►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు
►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు
►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు
17:20 అక్టోబర్ 20, 2023
నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు
►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా
►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా
►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో
►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా
►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా
►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి
15:10, 20 అక్టోబర్ 20, 2023
హైదరాబాద్:
తెలంగాణలో టీడీపీ ఖాళీ
►బీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి
► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్‌ఎస్: రావుల
►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది
►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు
14:05 అక్టోబర్ 19, 2023
ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా
►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా
►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం
►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
13:55 అక్టోబర్ 19, 2023
టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం
►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్
►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు
►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్
►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ
►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్
► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి
►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం
►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట
►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు
13:34 అక్టోబర్ 19, 2023
స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత!
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్
►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు
►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు..
►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు?
►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు
►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు?
►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా!
► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు
►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే
►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది
నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది.
— YSR Congress Party (@YSRCParty) October 20, 2023
- మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5
13:06 అక్టోబర్ 19, 2023
ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ
►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు
►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు
►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం
►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు
►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు
12:55 అక్టోబర్ 19, 2023
ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్
►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్
►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు
►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి
►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి
►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు
►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ
►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం
►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి
►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి
►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు
►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి
►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి
12:32 అక్టోబర్ 19, 2023
లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి
►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు
►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు
►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు
►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు
►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు
►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి
►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా?
11:22 అక్టోబర్ 19, 2023
క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి
►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా
►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు
►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి
►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి
►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం
►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ
►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు
►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో
► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ
►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు
10:59 అక్టోబర్ 19, 2023
ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ
►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు
సిద్ధార్థ లూథ్రా వాదనలు:
►పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది
►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది
ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు
►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు
►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపాం
--
►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా
► సరేనన్న ధర్మాసనం
► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం
10:49 అక్టోబర్ 19, 2023
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు
► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్‌లో కోరిన లాయర్లు
► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు
►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం
►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన
10:15 అక్టోబర్ 19, 2023
చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం
►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు
►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ
►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు
►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది
►2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్
►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ
►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్
►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ
►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు
►ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల
►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక
►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!!
►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు
►నెట్‌వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ
►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక
►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు
►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి
09:45 అక్టోబర్ 19, 2023
ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ
►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ
►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ
►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం
►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ
►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు
►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు
►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు
►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్
►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు
►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం
►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం
08:55 అక్టోబర్ 19, 2023
బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు
►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది?
చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా?
చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా?
చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం
ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది?
మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు
చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ
►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ
►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు?
►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు?
►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా?
08:36 AM, అక్టోబర్ 20, 2023
తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ
►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
►స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు
►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు
►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్
►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు
►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
08:15 AM, అక్టోబర్ 20, 2023
టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే!
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు
►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు
►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు
►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు
►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
07:43 AM, అక్టోబర్ 20, 2023
సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ
►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ
►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్
► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ
► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్
►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్
►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు
►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు
►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు
► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం
07:30, అక్టోబర్ 19, 2023
అన్నీ నిజాలే చెప్పాలి
► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి
► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి
► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి
► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి
► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి
► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి
► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి
► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి
► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి
► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి
07:10 AM, అక్టోబర్ 20, 2023
చంద్రబాబుకు భద్రతా అనుమానాలు
►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు
►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు
►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు
►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం
►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు
►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి
►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు
►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి
07:10 AM, అక్టోబర్ 20, 2023
వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్
►స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా
►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు
►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు
► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు
►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం
►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు
06:55 AM, అక్టోబర్ 20, 2023
వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు
►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం
►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ
►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు
►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం?
►ఏపీ హైకోర్టులో ఐఆర్‌ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా
►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్
► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్
06:35 AM, అక్టోబర్ 20, 2023
చంద్రబాబు రిమాండ్ @41
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్
► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం
► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్
► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి
►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి
►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు
►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU
— YSR Congress Party (@YSRCParty) October 19, 2023
Comments
Please login to add a commentAdd a comment