
AP Elections Political Latest Updates Telugu..
7:11 PM, జనవరి 6, 2024
చంద్రబాబు మాయలు అన్నీ ఇన్నీ కావయ్యా.!
- 2014లో పాయకరావుపేటలో గెలిచిన వంగలపూడి అనితను 2019లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చాడు బాబు
- కొవ్వూరు నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చాడు
- చంద్రగిరిలో ఓడిన చంద్రబాబు కుప్పంకు పారిపోయాడు
- కోడెలను నరసరావు పేట నుంచి సత్తెనపల్లికి మార్చాడు
- ఇక గంటా అయితే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు
- ఇన్ని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారంటూ YSRCP మీద ఏడుస్తున్నాడు
5:06 PM, జనవరి 6, 2024
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు: సజ్జల రామకృష్ణారెడ్డి
- బ్రదర్ అనిల్‌ను టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశాం..
- ఇప్పుడు పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నారు
- వైఎస్సార్‌సీపీ తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వివేకాను బరిలోకి తెచ్చింది
- వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయి
- కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది
- ఇష్యూను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు
- షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
- షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదు
- షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారు
- సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్ అనిల్ వెళ్లారు
- ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు
- టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్ కలవడం ఇవన్నీ అందులో బాగమే
- వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి
- టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయి
- కాంగ్రెస్ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్ చనిపోయారు
- ఆయన చనిపోయాక.. పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
- విజయమ్మకు పోటీగా పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ బరిలో దించింది
- YSRCP అభ్యర్థిగా విజయమ్మకు 70శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకాకు 20శాతం ఓట్లు కూడా రాలేదు
- కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు
- చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడు
- సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయి
- అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు
- కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
- ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు
- కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకో, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు
- ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలే
- రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు?
- కుటుంబం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YSRCPని పెట్టలేదు
- ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయి
3:15 PM, జనవరి 6, 2024
ఏపీని చంద్రబాబు సర్వనాశనం చేశారు: ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్
- కరోనా కష్టకాలంలో బాబు, టీడీపీ నాయకులు ఎక్కడికెళ్లారు
- 2014లో బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
- బీసీలను పూర్తిస్థాయిలో చంద్రబాబు మోసం చేశారు
2:41 PM, జనవరి 6, 2024
అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట
- విశాఖ నార్త్ నియోజకవర్గం సామాజిక సాధికార యాత్రలో వైవీ సుబ్బారెడ్డి
- నాడు నేడు ద్వారా విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
- చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
- సీఎం జగన్ పాలనలో దేశంలో ఎక్కడా జరగని విధంగా సామాజిక న్యాయం జరుగుతుంది.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా వివరిస్తున్నాం
2:25 PM, జనవరి 6, 2024
సీఎం జగన్ పేదల పక్షపాతి.. మాజీ మంత్రి ఆళ్ల నాని
- ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం
- చంద్రబాబు హయాంలో అంతా దోపిడీయే
- నేడు సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక చాటపర్రులో రూ. 58 కోట్ల అభివృద్ధి
- గత ప్రభుత్వం, ప్రభుత్వానికి మధ్య తేడా తేడా గమనించండి.
- ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన ప్రతి హామీ సీఎం జగన్ నెరవేర్చారు
- టీడీపీ, జనసేనలు కుట్రలు
- సీఎం జగన్ వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ, నేతలు విమర్శలు చేస్తున్నారు
- సీఎం జగన్‌కు అందరూ అండగా ఉండాలి
11:07AM, జనవరి 6, 2024
ఏపీ బీజేపీలో తొలగని అయోమయం
- పొత్తులా.. ఒంటరిగానా తేల్చుకోలేకపోతున్న ఏపీ బీజేపీ
- రెండు రోజుల సమావేశాల్లో తేలని పొత్తుల అంశం
- టీడీపీతో గత అనుభవాలను గుర్తు చేసిన మరికొందరు నేతలు
- జనసేన వైఖరిపైనా సమావేశాల్లో ప్రస్తావన
- ప్రతీ ఒక్కరి అభిప్రాయం రహస్యంగా సేకరణ
- అగ్రనేతల రాష్ట్ర పర్యటన లోపే పొత్తులపై తేల్చాలన్న మెజార్టీ నేతలు
- అందరి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్న నాయకత్వం
- అధిష్టాన నిర్ణయమే పైనల్ అంటూ ప్రకటనలు
8:10 AM, జనవరి 6, 2024
ఓటర్ల జాబితాపై టీడీపీ అక్రమాలు
- ఓటర్ల జాబితాలో కొత్త కుట్రకు తెరతీసిన టీడీపీ
- ఓటర్ల జాబితాలోని ప్రజల నంబర్లు తీసుకుని వారికి మెసేజ్‌లు
- మెసేజ్‌లు పెడుతూ ఓటీపీలు అడుగుతున్న పచ్చ బ్యాచ్ నేతలు
- మెసేజ్‌లపై పచ్చ నేతలను ప్రశ్నిస్తున్న ప్రజలు
"ఓటర్ల జాబితాతో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ"
— YSR Congress Party (@YSRCParty) January 5, 2024
ఓటర్ల జాబితాతో కొత్త కుట్రకు @JaiTDP తెరతీసింది. ఓటర్ల జాబితా తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళి వారి నంబర్లకు మెసేజ్‌లు పంపుతూ అనంతరం వారికి వచ్చిన ఓటీపీలు అడుగుతున్నారు ఆ పార్టీ నాయకులు. తిరుపతి జీవకోనలో ఇలాంటి కార్యక్ర… pic.twitter.com/qTkZjF6v5C
7:10 AM, జనవరి 6, 2024
టీడీపీకి కేశినేని గుడ్‌బై..
- చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
- టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు ప్రకటన
- త్వరలోనే టీడీపీ, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించిన కేశినేని
- టీడీపీలో రాజకీయంగా రసవత్తరం.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG
7:00 AM, జనవరి 6, 2024
ఏం చేశాడని బాబు పిలిస్తే రావాలి!
- రా.. కదలిరా అని చంద్రబాబు పిలవగానే జనం ఎందుకు రావాలి?
- టీడీపీ అధినేతపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు
- పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టిన గతి పట్టకూడదు
- బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు
- చంద్రబాబు, పవన్ లకు పిచ్చిమాటలు మాట్లాడే అవలక్షణం ఉంది
- జగన్ 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, సచివాలయాలు, స్కూల్స్ కట్టించారు
- లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి
- చంద్రబాబు లేకపోతే రాష్ట్ర ప్రజలు అసలు విమానాలే ఎక్కనట్లు మాట్లాడుతున్నారు
- అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు.. అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారు
- బిగ్ బజారులో వాటాలు ఉన్న చంద్రబాబు నిత్యావసర వస్తువులను ఎందుకు అధికంగా అమ్ముతున్నారు
- ప్రజలను తాగుబోతులను చేసేలా చంద్రబాబు మాటలు ఉన్నాయి
- బీసీలకు ఏం చేశావని చంద్రబాబుకు ఓట్లు వేయాలి?
- ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారా?
- చంద్రబాబుకు ఆయన ఇంట్లో, బంధువుల్లోనూ వ్యతిరేకమే
- ఎన్టీఆర్ కుటుంబం నుండి తోడపుట్టిన సోదరులు, అక్క, వారి పిల్లలు అందరూ వ్యతిరేకమే
- అలాంటి వ్యక్తి ఎదుటివారి గురించి ఎలా మాట్లాడతారు?
- రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోని కాపీ కొట్ఠం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ
- 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు
- అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?
- కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అప్పట్లో తునిలో మీటింగ్ పెట్టారు
- చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను అమలు చేయమనే కాపులు ఉద్యమం చేశారు
- మరి ఇప్పటికీ పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?
- తనకు కులం లేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
- అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు మా పార్టీ వీడుతున్నారు
- జగన్‌ని నమ్మిన వారంతా పార్టీలోనే ఉన్నారు
- జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారు
- షర్మిళ ఒక రాజకీయ నాయకురాలు
- ఆమె ఏపీకి వస్తే మాకేం ఇబ్బంది ఉంటుంది?
- వైసీపిని జగన్ ప్రారంభించారు
- ఆయన్ను చూసే షర్మిళ ఐనా, నేనైనా ఇంకొందరైనా పార్టీలో చేరాం
- కొందరు వదిలేది పోయినంత మాత్రాన ఏం జరుగుతుంది?
- జగన్ బొమ్మ లేకుండా కాపు రామచంద్రారెడ్డి గెలవలేరు
6:50 AM, జనవరి 6, 2024
కనిగిరిలో రా.. కదలి రా అట్టర్ ఫ్లాప్
- ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి(ప్రకాశం) నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ
- కనిగిరిలో రా.. కదలి రా పేరుతో చంద్రబాబు నాయుడు సభ
- భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీ శ్రేణులు.. చివరకు నిరాశ
- ఊహించిన రీతిలో.. సభ ఫ్లాప్
- షాక్ తిన్న టీడీపీ నేతలు
- చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే వెళ్లిపోయిన జనం
- ఖాళీ కుర్చీలకే చంద్రబాబు ప్రసంగం
- ప్రసంగంలోనూ తన స్టయిల్‌లో గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు
- గతంలో కంటే ఘోరమైన హామీలు ఇచ్చిన బాబు
- టీడీపీ-జనసేన కలిసినా కూడా జనం తిరస్కరణ
6:40 AM, జనవరి 6, 2024
బాబు గ్యారెంటీ ఇవ్వాల్సింది వాళ్లకు!
- సొంత పార్టీ నేతల్ని కూడా మోసం చేయగల ఘనుడు చంద్రబాబు
- విజయవాడ ఎంపీ కేశినేని నానినే అందుకు ఉదాహరణ
- డబ్బు ఉన్న వ్యక్తులే తన నాయకులు అని చంద్రబాబు నిరూపించారు
- చంద్రబాబును నమ్మి వెంట నడిచిన కేశినేని నానిని మోసం చేశారు
- వ్యక్తిత్వం గల వారిని నాయకులను చేసిన లీడర్ జగన్ మోహన్ రెడ్డి
- ప్రజలకు కాదు ముందు లోకేష్‌కి.. టీడీపీ నాయకుల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ ఇవ్వాలి
- చంద్రబాబుపై దేవినేని అవినాష్ సెటైర్లు