మడకశిర: విద్యారంగంలో సంస్కరణలంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏటికేడు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన పాలకులు తాజాగా ఉన్నతవిద్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా.. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వం నేటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు కూడా ఈ విషయంపై స్పష్టత లేదు. త్వరలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారేగానీ... ఎప్పుడు వస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర, పెనుకొండ, ధర్మవరం, బుక్కపట్నం, కదిరి, హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్లులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వేలాది మంది విద్యార్థులు ఏటా బీకాం, బీఏ, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లను ప్రారంభించడంలో విఫలమవుతోంది.
గత ఏడాది కూడా జాప్యం
గత ఏడాది (2025–26 విద్యా సంవత్సరం) కూడా ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో డిగ్రీ కోర్సుల్లో చాలా ఆలస్యంగా చేరాల్సి వచ్చింది. డిగ్రీ తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సిలబస్‌ను పూర్తి చేయడానికి అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కొన్ని కళాశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం ఈసారైనా ప్రభుత్వం సకాలంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు.
నేటికీ విడుదల కాని నోటిఫికేషన్
ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్న
విద్యార్థులు


