డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

రాప్తాడు రూరల్‌: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్కేయూతో పాటు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు, యువతతో శనివారం అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లిలో ‘టీ టైమ్‌ విత్‌ స్టూడెంట్స్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, విద్యా సమస్యలు, నిరుద్యోగ యువత ఇబ్బందులు, ఉపాధి అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉన్నత విద్య, పోటీ పరీక్షలు తదితర అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 28న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, నీట్‌ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలు, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, రాప్తాడు వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, ఎస్కేయూ లింగారెడ్డి, అనంతపురం రూరల్‌, రాప్తాడు మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, ఎంపీటీసీలు సోమశేఖర్‌రెడ్డి, సునిల్‌దత్తరెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆనంద్‌, గురుప్రసాద్‌, నాయకులు నారాయణస్వామి, మన్నల చిరంజీవి, రమేష్‌, పెరవళి జయచంద్రారెడ్డి, పూలకుంట భాస్కర్‌రెడ్డి, మన్నీల శేషు, ఎస్సీ సెల్‌ నల్లప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement