బొమ్మనహాళ్: ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లు రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పాండురంగస్వామికి తెల్లవారుజామున వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం నిర్వహించారు. పుష్పాలకరణ, ఆకుపూజ, ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, మహామంగహారతి వంటి ప్రత్యేక పూజలు చేపట్టారు. విఠల విఠల... రుక్మిణీ పాండురంగ విఠల అంటూ భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.


