డీఎస్సీ అక్రమాలపై మాడుగుల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో మాడుగుల పాత బస్టాండ్‌లో నిరుద్యోగ యువకులు, విద్యార్థులతో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, మాడుగుల ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్ ,పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ముఖ్యనాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.


