దివ్యాంగులకు నిరామయ ఆరోగ్య బీమా | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు నిరామయ ఆరోగ్య బీమా

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ కె.శ్రీరాములు

అనకాపల్లి టౌన్‌/నర్సీపట్నం: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులందరికీ నిరామయ ఆరోగ్య బీమా పథకం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రొజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కె. శ్రీరాములు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని 24 మండలాల్లోని అర్హులైన దివ్యాంగుల వివరాలను నిరామయ పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మానసిక వైకల్యం, ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, మల్టిపుల్‌ డిజేబిలిటీ వంటి వైకల్యాలు కలిగిన వారు ప్రయోజనం పొందేందుకు అర్హులని తెలిపారు. ఇందుకోసం జిల్లా జోనల్‌ అధికారిగా సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయ అధికారి బి.రామకృష్ణ నాయుడును నియమించామన్నారు. ఈ నిరామయ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకంలో నమోదు చేసుకున్న అర్హులైన దివ్యాంగులకు ఏడాదికి రూ.లక్ష వరకు వైద్య బీమా సదుపాయం అందుబాటులో ఉంటుందని, వైకల్యానికి సంబంధించిన ఇప్పటికే ఉన్న సమస్యలు చేసే కరెక్టివ్‌ సర్జరీలకు గరిష్టంగా రూ.55 వేల వరకు, ఓపిడి చికిత్సలకు రూ.19 వేల వరకు, వైకల్యం ప్రభావాన్ని తగ్గించేందుకు కొనసాగుతున్న థెరపీలకు రూ.20 వేల వరకు, ఆయుష్‌ చికిత్సలకు రూ.4 వేలు, రవాణా ఖర్చులకు రూ.2 వేల వరకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. అర్హులైన సదరం సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత దివ్యాంగుల గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు, విద్యార్థి బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ కార్డు జెరాక్స్‌లతో వివిధ మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల ప్రత్యేక ఉపా ధ్యాయులను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి దివ్యాంగుడు స్వదినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9885288151 నంబర్‌లో సంపదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement