తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా వెంకటరావు
అనకాపల్లి జిల్లా అఖిల గాండ్ల తెలికుల
సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం
అనకాపల్లి: అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా గండేపల్లి వెంకటరావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక రింగ్‌రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలిశెట్టి నూకేశ్వరరావు, కోశాధికారిగా రాజపూడి కోటేశ్వరావు, మరో 20 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గండేపల్లి వెంకటరావు చెప్పారు. అంతకుముందు సంఘం జిల్లా వనభోజన కార్యక్రమం జరిగింది.


