1200 లీటర్ల సారా పులుపు ధ్వంసం
నాతవరం: అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం మండలంలో పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేసే బట్టీలపై ఆకస్మికంగా దాడులు జరిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల పులుపును ధ్వంసం చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ పెడిమి కొండ అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధం చేసిన పులుపును ధ్వంసం చేశామని, నిర్వాహకులు పరారయ్యారని తెలిపారు. సారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసి, మిగిలిన సామాగ్రిని స్టేషన్‌కు తరలించామన్నారు.


