అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
బుచ్చెయ్యపేట: ఆర్.శివరాంపురం ఫారెస్ట్ పరిధిలో నీలగిరి చెట్లు అక్రమంగా నరికివేతకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో కలప తరలిపోవడంలో ఫారెస్ట్ అధికారుల ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన వారే కలప తరలిస్తున్నారని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ రేంజర్ సతీష్‌కు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఫారెస్ట్ బీట్ వాచర్ సత్యారావును వివరణ కోరగా అటవీ ప్రాంతంలో గ్రేడింగ్ చేసిన పనులు తప్ప, అమ్మకాలు చేయలేదన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు తెలిపామన్నారు.


