ప్రేమ, త్యాగం, దయకు ప్రతీక క్రిస్మస్
అనకాపల్లి: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొంటారని, ప్రేమ, దయ, శాంతి మార్గాన్ని ఏసుప్రభువు చూపారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీసెల్ అధ్యక్షుడు పెతకంశెట్టి జోసఫ్ ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించి, కేక్ కట్ చేసి అమర్‌నాథ్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి పార్టీ శ్రేణులకు, పాస్టర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలు, మతాలు సమానంగా జీవిస్తున్నాయన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఏసుక్రీస్తు పశువుల పాకలో అర్ధరాత్రి జన్మించారని, శాంతి, కరుణను ఉద్భోధించారని అన్నారు. అనంతరం పాస్టర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ బి.వరాహ సత్యవతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రమేష్, 80వ వార్డు ఇన్‌ఛార్జ్ కె.ఎం.నాయుడు, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సన్ని జెమ్స్, పాస్టర్లు తిమోతి, ప్రకాష్, బెనర్జీ, సీనియర్ నాయకులు దొండా రాంబాబు, కాండ్రేగుల విష్ణుమూర్తి, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు పాల్గొన్నారు.


