కాలిన గాయాలతో వృద్ధురాలు మృతి
రావికమతం: మేడివాడ శివారు అప్పలమ్మపాలెంలో చలి మంట కాగుతూ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పాచిల చిలుకమ్మ (72) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. చిలుకమ్మ ఆమె అక్క కొడుకు మిరియాల కొండబాబు సంరక్షణలో ఉంటోంది. సోమవారం రాత్రి ఇంటి దగ్గర చలి కోసం మంట కాగుతుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పు అంటుకొని శరీరం కాలిపోయింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను స్థానికులు సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజిహెచ్‌కు తరలించారు. వృద్ధురాలు చిలుకమ్మ విశాఖ పట్నం కేజిహెచ్‌లో చిక్సిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిలుకమ్మ మృతిపై మిరియాల కొండబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.


