ఒత్తిడిని జయించేందుకు ధ్యానమే ఆయుధం
ధ్యానంలో విద్యార్థులు, పెద్దలు
నర్సీపట్నం: ఒత్తిడిని జయించేందుకు ధాన్యమే దివ్య ఔషాదమని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీమినీ స్టేడియంలో ఆదివారం హార్ట్‌పుల్‌నెస్ సంస్థ వారు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ధ్యాన తరగతులు ఏర్పాటుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హార్ట్‌పుల్‌నెస్ అవుట్‌రీచ్ రీజినల్ ఇన్‌ఛార్జ్ గోపాలకృష్ణ మాచాలి మాట్లాడుతూ రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మావతి, జెడ్పీటీసీ సకల రమణమ్మ పాల్గొన్నారు.


