పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రామచంద్రపురం సమీపంలో
పూర్వ విద్యార్దులు కలుసుకున్న దృశ్యం
మాడుగుల రూరల్: ముఫ్ఫై తొమ్మిదేళ్ల క్రితం మాడుగుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు మాడుగుల సమీపంలో గల రామచంద్రపురం వద్ద ఆదివారం కలుసుకున్నారు. 1985–86 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా ఒక చోట ఆత్మీయంగా కలుసుకొంటున్నారు. అప్పట్లో 85 మంది విద్యార్దినీ, విద్యార్దులు చదువుకోనగా, ఆదివారం 40 మంది ఒకే చోట కలుసుకోని తమ చిన్న నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. వీరి సమావేశానికి కృషి చేసిన వారిలో వడ్దాది శాంతేశ్వరావు, దంగేటి ప్రసాదు, కాళ్ల బాలకృష్ట, కోడూరు వెంకటరమణ, ద్వారపూడి కొండాజీ, బి.వి.జగన్నాథరావు ఉన్నారు.


