విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు | - | Sakshi
Sakshi News home page

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు

Dec 20 2025 7:06 AM | Updated on Dec 20 2025 7:06 AM

విద్య

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు

నూతన ఆవిష్కరణలతో

అబ్బురపరిచిన విద్యార్థులు

చోడవరం: విద్యార్థులు తమ ఆధునిక పరిజ్ఞానంతో అందర్నీ ఆలోచింపజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో ఎలాంటి మార్పులు చేపడితే మంచి ఫలితాలు వస్తాయో నమూనాలు రూపొందించి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. పలు ప్రదర్శనలు అందర్నీ ఔరా.. అనిపించాయి. జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన చోడవరం జెడ్పీ బాలికల హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు ప్రారంభించారు. జిల్లాలో 24 మండలాల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన సుమారు 86 ప్రదర్శనలు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. ఏడు విభాగాల్లో ఈ నమూనాలు రూపొందించారు. చోడవరం, అనకాపల్లి, నర్సీప ట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో అన్ని మండలాల నుంచి ఎంపికై న వైజ్ఞానిక నమూనాలు ఇక్కడ ప్రదర్శించారు. ఆధునిక వ్యవసాయం, సోలార్‌ విద్యుత్‌ వినియోగంతో లాభాలు, వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి వినియోగించడం, ప్లాస్టిక్‌ బదులుగా సముద్రంలో మొక్కల నుంచి ప్లాస్టిక్‌ మాదిరిగా వస్తువుల తయారీ, నేటి వాతావరణంలో మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం, చెత్త నుంచి సంపద తయారీ, విద్యుత్‌కి బ దులుగా కో జనరేషన్‌ తయారీ, కంప్యూటర్‌తో, డ్రో న్లతో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తే రైతుకు మేలు జరుగుతుందనే అంశాలతోపాటు అనేక నమూనాలు ఇక్కడ ప్రదర్శించారు. విద్యార్థుల మేధస్సుకు సైన్సు ఉపాధ్యాయుల ఆలోచన తోడు చేసి ఒకదానిని మించి మరొకటి ఉండేలా ఆలోచింపజేసే వైజ్ఞానిక న మూనాలు విద్యార్థులు తయారు చేశారు. తెలుగుతోపాటు ఇంగ్లిషు భాషలో విద్యార్థులు ఆయా ప్రాజెక్టు ల గురించి వివరించారు. విజేతలకు జిల్లా ఉప విద్యాశాఖాధికారి అప్పారావు బహుమతులు అందజేశారు.

విజేతలు వీరే..

జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు ఉత్త మ నమూనాలుగా న్యాయనిర్ణేతలు ప్రకటించారు. కోడూరు జెడ్పీ హైస్కూల్‌ (సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌), హరిపాలెం జెడ్పీ హైస్కూల్‌ (వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ టు ప్లాస్టిక్‌ ), సబ్బవరం గవర్నమెంటు హైస్కూల్‌ (గ్రీన్‌ ఎనర్జీ), రావికమతం జెడ్పీ హైస్కూల్‌ (ఎమర్జింగ్‌ టెక్నాలజీ), జి.అగ్రహారం జెడ్పీ హైస్కూల్‌ (రిక్రియేషనల్‌ మ్యాథమెటిక్స్‌ మోడలింగ్‌), చోడవరం జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌ (హెల్త్‌ అండ్‌ హైజనిక్‌ ), తిమ్మపాలెం జెడ్పీ హైస్కూల్‌ (వాటర్‌ కన్జర్వేషన్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తమ నమూనాలుగా నిలిచాయి. అదేవిధంగా వ్యక్తిగత ప్రతిభ చూపిన వారిలో యు.హరీష్‌ (జె.నాయుడుపాలెం జెడ్పీ హైస్కూల్‌ రోలుగుంట), పి.హేమశ్రీ (మల్లునాయుడుపాలెం జెడ్పీ హై స్కూల్‌), బి.కె.వి.గోవిందరావు (తుమ్మపాల జెడ్పీ హైస్కూల్‌), ఎస్‌.సోమేష్‌ (తిరువూరు జెడ్పీ హైస్కూల్‌) నిలిచారు.

బయో ప్లాస్టిక్‌

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల వాతావరణం కలుషితమై ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున బయో ప్లాస్టిక్‌ తయారీ అంశంపై ఈ ప్రాజెక్టును తయారుచేశాం. దేశంలో 7,500 పొడవైన సముద్ర తీరం ఉన్నందున సముద్రంలో లభ్యమయ్యే మొక్కలతో బయోప్లాస్టిక్‌ ఏవిధంగా తయారు చేయవచ్చు అన్నదే ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ టు ప్లాస్టిక్‌ ప్రాజెక్టు ఉద్దేశం.

– సాత్విక, కుషాల్‌, రేవంత్‌, జెడ్పీ హైస్కూల్‌, హరిపాలెం, అచ్యుతాపురం మండలం

ఏది మంచి ఆహారం..

మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. జంక్‌ ఫుడ్స్‌ కాకుండా నేచురల్‌ సీడ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాము. ఎలాంటి ఫుడ్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి లాభభాలు ఉంటాయి అనే అంశంపై నమూనా తయారు చేశాం.

– ఆర్‌.లేఖన, పి.వాత్సల్య, జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌, చోడవరం

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు1
1/3

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు2
2/3

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు3
3/3

విద్యా దీపాలు.. విజ్ఞాన కాంతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement