అక్రమ రవాణా అరికట్టాలి
నార్నూర్: మహారాష్ట్ర సరిహద్దున అక్రమ రవాణా అరికట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గాదిగూడ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వల న కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున గు డుంబా, గంజాయి వంటివి అక్రమ రవాణా కాకుండా చూడాలన్నారు. అలాగే ప్రజలకు రహదారి భ ద్రతపై అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై బాధ్యతాయూతంగా వ్య వహరించాలని అన్నారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఎస్సై ప్రణయ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


