లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. డీఎంహెచ్‌వో చాంబర్‌లో మంగళవారం పీసీపీఎన్‌డీటీ సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, కమిటీ సభ్యులు, వైద్యారోగ్య సిబ్బంది ఆల్ట్రాసౌండ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఫారం–ఎఫ్ నమోదు లేని కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం ప ట్టణంలోని వందన, ఆదిలాబాద్ డయాగ్నొస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. ఆదిలాబాద్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో లింగ నిర్ధారణకు సంబంధించిన పోస్ట ర్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందులో అదనపు డీఎంహెచ్‌వో సాధ న, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీమ్ తదితరులున్నారు.


