గోండి వికీపీడీయన్‌కు అరుదైన అవకాశం
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని మత్తడి శంభుగూడకు చెందిన గోండి వికీపీడీయన్ సిడాం వరప్రసాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ద్వారా ప్రచురించిన గ్రంథం తిరుక్కురల్‌ను గోండి భాషలోకి అనువదించడానికి అధికారిక ఆమోదం పొందారు. ఆయన ఇప్పటికే 250 ద్విపదల అనువాదాన్ని 25 అధ్యాయలు కేవలం 15 రోజుల్లో పూర్తి చేశారు. తిరుక్కురల్, ఆదిలాబాద్ మాండలికం గోండి లిపిలో రాబోతున్న సందర్భంగా వరప్రసాద్‌ను బోలి చేతో ఫౌండేషన్ సీఈవో సాయికిరణ్, సభ్యులు ఆత్రం మోతీరాం, ఆత్రం రాజ్‌కుమార్, మడావి రవి సన్మానించారు.


