లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్‌నగర్: ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బల్దియా వార్డు ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా చూడాలన్నారు. అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. లబ్ధి దారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరి గినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ కార్తీక్ పాల్గొన్నారు.


