సీజీఆర్‌ఎఫ్‌తో విద్యుత్ సమస్యల పరిష్కారం
తాంసి: విద్యుత్ వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే సీజీ ఆర్‌ఎఫ్ (విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక) అని చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల వినియోగదారులతో భీంపూర్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి చైర్మ న్‌తో పాటు సభ్యులు హాజరయ్యారు. ఎని మిది ఫిర్యాదులు రాగా వాటిపై సంబంధిత ఏఈలను వివరణ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వేదికకు జిల్లా అధి కారులు గైర్హాజరు కావడంపై అసహనం వ్య క్తం చేశారు. కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజా గౌడ్, డీఈ హరికృష్ణ, ఏ డీఏ శ్రావణ్‌కుమార్, ఏఈలు తిరుపతిరెడ్డి, మనోజ్, శ్రీనివాస్‌తదితరులు పాల్గొన్నారు.


