
మాట్లాడుతున్న డైరెక్టర్ వైజీ ప్రసాద్
ఆదిలాబాద్‌టౌన్: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని నాగ్‌పూర్ కేంద్రియ పత్తి పరిశోధన సంస్థ డైరెక్టర్ వైజీ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహించారు. అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగుతో గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గుతుందని తెలిపారు. రానున్న కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ సుధారాణి, కాటన్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వీఎల్ వాగ్మారే, శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధి కారి పుల్లయ్య, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శ్రీధర్‌చౌహన్, రాంప్రసాద్, మురళి, మధుసూదన్‌రావు, కేవీకే కోఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
● కేంద్రియ పత్తి పరిశోధన సంస్థ డైరెక్టర్ వైజీ ప్రసాద్

పత్తిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు