breaking news
ae
-
సౌజన్య కేసు.. పోలీసుల కస్టడీలో సాధిక్ డ్రామాలు!
సాక్షి,కాకినాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు, ఆయన అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సర్పవరం పోలీసులు నిందితుడు సాధిక్ ఖాన్‌ను సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీసుల కస్టడీలో సాధిక్ ఖాన్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలు, సైనైడ్ విక్రయించిన వ్యక్తుల సాక్ష్యాలను చూపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విచారణలో పూర్తిస్థాయి వాస్తవాలు రాబట్టేందుకు, సాధిక్‌ను మరోసారి వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు స్థానిక కోర్టులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఈ నూకరాజు అల్లుడు కొవ్వురి జగదీశ్వర రెడ్డి మృతిపై ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్లో సాధిక్ ఖాన్‌పై కేసు నమోదైంది.సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే సాధిక్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జగదీశ్వర రెడ్డికి కొబ్బరి నీళ్లలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి తర్వాత నూకరాజు కూతురు సౌజన్యను వేధించడం, కుటుంబంపై బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనపై సర్పవరం పీఎస్‌లోనూ కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇదీ చదవండి : సాధిక్ ఖాన్ మా మమ్మీనీ కొట్టేవాడు చాలా భయం వేసేది -
అంతా సౌజన్యే చేసింది!
కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడకు చెందిన షేక్ సాధిక్ ఖాన్ ఈ నేరానికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు వరుసగా రెండవరోజూ ఎప్పటిలాగే ‘తనకేం తెలియదు, తన తప్పేంలేదు’ అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ‘తప్పంతా జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యదే’ అంటూ ఆమెపై నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడు రోజుల విచారణ నిమిత్తం సాధిక్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మొదటిరోజు మంగళవారం విచారణలో 60 ప్రశ్నలు సంధించిన పోలీసులు, బుధవారం రెండోరోజూ పలు కీలకమైన అంశాలపై 70 ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సీఐ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో న్యాయవాది సమక్షంలో సాధిక్‌ను ప్రశ్నించారు. జగదీశ్వరరెడ్డి హత్యకుగాను సాధిక్‌కు సైనేడ్ ఎలా వచ్చిందనే కోణంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు సర్పవరం స్టేషన్‌కు రప్పించి సాధిక్ సమక్షంలో విచారించారు. ఈ క్రమంలో ఒకరు సైనేడ్ ఇచ్చిన విషయం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఉదయం విచారణలో అదనపు ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సౌజన్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్య, అందుకు వినియోగించిన రసాయనాలు, నూకరాజు కుటుంబానికి వేధింపులు, వారి ఆస్తులపై కన్ను, నకిలీ సర్టిఫికెట్లతో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహణ తదితర అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సాధిక్ విచారణ కోసం మొదటి నుంచీ సేకరించిన ఆధారాలు, సూసైడ్ నోట్లలోని అంశాల ఆధారంగా సుమారు 200 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేసుకున్న పోలీసులు ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. -
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్‌ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్‌ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్‌ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్‌ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్‌లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్‌కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్‌రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్‌కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్‌గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్‌ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్‌రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్‌కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్‌కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు -
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్‌ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్‌ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్‌పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్‌ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! -
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్‌రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్‌రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్‌రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్‌స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్‌రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్‌ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్‌ఖాన్‌ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్‌ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్‌కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్‌ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్‌కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
‘సాధిఖ్ ఖాన్ మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది’
సాక్షి,కాకినాడ: తన కుటుంబాన్ని నాశనం చేసి.. తనను అనాథను చేసిన సాధిక్ ఖాన్‌కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు. ‘రైఫిల్ షూటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాను. మూడో తరగతి నుంచి సాధిక్తో పరిచయం ఉంది. గతంలో మా స్కూల్లో పనిచేసేవాడు. స్కూల్ నుంచి తీసేసారని తన అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ నాకు భయంగా ఉంది. సాధిక్కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి’అని ఆవేదన వ్యక్తం చేశాడు. 👉ఇదీ చదవండి: బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు: లేఖలో సౌజన్య -
ఏఈ నూకరాజు కేసులో నిజానిజాలు తేలాల్సి ఉంది.. సాధిక్ ఖాన్ అరెస్టుపై ఎస్పీ
కాకినాడ: ఏపీలో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు.ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన అనంతరం నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తనను కనిపెట్టకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా పక్కనబెట్టాడు.ఈ క్రమంలోనే అతను ఐదు రాష్ట్రాల వ్యాప్తంగా పరారీలో ఉన్నాడని, చివరకు నిఘా వర్గాల సాయంతో మీరట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. మృతుడు నూకరాజు రాసిన సూసైడ్ నోట్‌తో పాటు ఆయన భార్య సౌజన్య రాసిన లేఖ ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సౌజన్య తన లేఖలో సాధిక్ ఖాన్ గురించి స్పష్టంగా ప్రస్తావించిందని పేర్కొన్నారు. సౌజన్య, సాధిక్ ఖాన్ కొంతకాలంగా కలిసే ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే నూకరాజు మృతిపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం సాధిక్ ఖాన్‌ను కాకినాడ తరలిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నందున నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. -
మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
అసలేం జరిగింది!
కాకినాడ: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్‌లపై దృష్టినూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వా«దీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్‌లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.కర్ణాటకకు పారిపోయిననిందితుడు!నిందితుడు సాధిక్ ఖాన్‌పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్‌ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.మూడో రోజూ లభించని ఆచూకీకంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ బుధవారానికి మూడు రోజులవుతున్నా లభించలేదు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం రెండో పట్టణ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాలర్లు బోట్లపై తిరుగుతూ గాలిస్తున్నారు. అయితే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. కాగా.. ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.డబ్బున్న పిల్లల తల్లులే టార్గెట్!కాకినాడ రూరల్: సాధిక్ ఖాన్ వృత్తి రైఫిల్ షూటింగ్ కోచింగ్ అయినా, శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే అతడి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్ చేశాడని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్ అకాడమీ పేరిట సాధిక్ ఖాన్ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకు ముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనతో అతడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధిక్ ఖాన్ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారణ చేసి, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరో వైపు రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు నివాసంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. సౌజన్యది ప్రేమ వివాహం నూకరాజు కుమార్తె సౌజన్య, జగదీశ్వరరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ రెడ్డి కుమారుడు. కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి కాకినాడలోనే భార్య, కుమారుడితో నివాసం ఉండేవారు. ఆయన గత జూలై 2న మృతి చెందారు. కాగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి కలిసి ఆదివారం ఉదయమే కాకినాడ అశోక్ నగర్లో నివాసం నుంచి బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం పలుమార్లు సాధిక్ ఖాన్ ఆ అపార్టుమెంట్ వద్ద కంగారుగా తిరుగుతూ కనిపించాడన్నారు. -
కలకలం రేపుతున్న నూకంరాజు లెటర్.. పోలీసుల అరా
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం.. దానికి కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాయడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పిఠాపురంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నూకరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి వక్రించింది. కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో విషాదం అలుముకుంది. దాని నుంచి తేరుకుని కుమార్తెకు జగదీశ్వరరావుతో పెళ్లి చేయగా, పండంటి మనువడు కార్తికేయరెడ్డి పుట్టడంతో వారింట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను అల్లుడిని మనువడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కొడుకు చనిపోయిన లోటును మర్చిపోయి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలోకి షేక్ సాధిక్‌ఖాన్ అనే వ్యక్తి వేధింపులు అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత జూలైలో అల్లుడు చనిపోవడం, షేక్ షాధిక్ఖాన్ వేధింపులు రోజురోజుకూ రెట్టింపు కావడంతో కుటుంబం అంతా ప్రతి రోజూ నరకం అనుభవించేదని బంధువులు అంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో (పంచాయతీరాజ్ ఏఈగా) ఉంటూ కంటికి రెప్పలా చూసుకునే కన్న కూతురికి ఎదురైన వేధింపుల నుంచి ఆమెను కాపాడలేని నిస్సాయస్థితిలో సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న భయంతో తండ్రిగా నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనువడు కార్తికేయరెడ్డి బలవన్మరణానికి తెగించేలా చేసిందంటున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకిన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతు కావడం.. ఆయన మనువడికి మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా సూసైడ్ నోట్లు ఉన్నాయా! నూకరాజుతో పాటు ఆయన కుమార్తె, భార్య సైతం తాము చనిపోతున్నట్లు దానికి కారణాలను తెలుపుతూ మరో రెండు సూసైడ్ నోట్లు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవి బయటపడలేదంటున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లెటర్లు రాసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వారు రాసినట్లు చెబుతున్న సూసైడ్నోట్లు బయటపడలేదు. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దిగ్భ్రాంతిలో పిఠాపురం పిఠాపురంలో పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను పిఠాపురంలో సహచర ఉద్యోగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జీరి్ణంచుకోలేక పోతున్నారు. అందరితో కలుపుగోరుతనంగా ఉంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా పేరున్న నూకరాజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియడంతో పిఠాపురంలో నేతలు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 12 ఏళ్లుగా ఒకేచోట అదీ పిఠాపురంలో ఆయన పని చేస్తున్నారంటే ఆయన మంచితనమే ఇక్కడ ఇంతకాలం పనిచేసేలా చేసిందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. పిఠాపురంలో పోలీసుల విచారణ పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఆత్మహత్యకు సూసైడ్ నోట్లో రాసిన కారణంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పని చేసేటప్పుడు ఎలా ఉండేవారు, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో సహచర ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు తీసుకున్నారు.గంటన్నరకు పైగా ఈతకొట్టి..కారులో ఊరికి వెళుతున్నామని బయలుదేరాం. చుట్టాలింటికి అనుకున్నాను. కానీ రాజమహేంద్రవరం బ్రిడ్జిపై కారు ఆపి అందరం దిగాం. నేను చూస్తుండగానే మా తాత, అమ్మమ్మ గోదావరిలోకి దూకేశారు. వారి వెనుక మా అమ్మ నా చేయి పట్టుకుని దూకేసింది. కానీ నేను బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని ఉండిపోయాను. కానీ కొంతసేపటికి చేయిజారి పోయి గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రావడం వల్ల సుమారు గంటన్నరకు పైగా కిలోమీటరు దూరం వరకు ఈత కొడుతూ పైకి తేలాను. ఇంతలో ఒక బోటు వచ్చి, నన్ను కాపాడిందని మృత్యుంజయుడిగా బయటపడిన కార్తికేయరెడ్డి చెబుతున్న మాటలు విన్న వారిని కలిచివేశాయి. -
గోదావరిలో దూకిన AE కుటుంబం.. అసలేం జరిగింది?
-
ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ
పెద్దపల్లి రూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని మున్సిపల్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) కల్లెపల్లి సతీశ్‌కుమార్ మంగళవారం తన ఇంట్లో బత్తుల శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. శ్మశానవాటికలు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లు రూ.12,28,748 కాంట్రాక్టర్‌కు విడుదల చేసేందుకు సతీశ్ రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పినా.. ఇవ్వాల్సిందేనని చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వారి సూచన మేరకు రూ.2 లక్షలను మంగళవారం కాంట్రాక్టర్ బత్తుల శ్రీనివాస్ పట్టణ శివారు రంగంపల్లిలోని ఏఈ సతీశ్ ఇంట్లో ఇస్తుండగా డీఎస్పీ మహేందర్‌రెడ్డి సారథ్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోదాల్లో లెక్కతేలని రూ.32 లక్షలు.. సతీశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కగా.. అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కతేలని రూ.32,31,900 విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ డబ్బు భూమి అమ్మగా వచ్చిందని ఏఈ చెబుతున్నారని, అందుకు ఆధారాలు సమరి్పంచి తిరిగి పొందొచ్చని డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోనూ రికార్డులను పరిశీలించారు. సతీశ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు డీఎస్పీ వివరించారు. -
మంచం కింద నోట్ల కట్టలు!
సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ఏసీబీ వలకు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ చిక్కారు. ఏఈ సతీష్ రూ.2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్‌ను సతీష్ లంచం డిమాండ్ చేశాడు. అంతపెద్ద మొత్తం అడిగేసరికి కంగుతిన్న కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఇవాళ (మంగళవారం) ముందస్తు ప్లాన్ ప్రకారం సతీష్‌కు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లిలోని ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఏఈ సతీష్ ఇంట్లో మంచం కింద భారీగా డబ్బు కట్టలు లభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు సోదాల్లో 32 లక్షల నగదును గుర్తించారు. ఏఈ సతీష్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు
సనత్‌నగర్: విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు. డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్ ఇన్స్పెక్టర్కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు చెందిన కూకట్పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు. (చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!) -
కాలువలో దూకిన ఏఈ కుటుంబం.. భార్య, కుమార్తె మృతి
తుమకూరు (బెంగుళూరు): నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీర్ కుటుంబం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యం కాగా ఇంజినీర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈఘటన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా సాగరహళ్లి గేట్ వద్ద చోటు చేసుకుంది. కే.బీ.క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేష్(55) తుమకూరు నగరంలోని రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్య మమత(46), కుమార్తె శుభ(25)తో కలిసి గురువారం సాయంత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కారు నిలిపి ముగ్గురూ హేమావతి కాలువలో దూకారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించగా మృతులను మమత, శుభగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే రమేష్ కూడా కాలువలోకి దూకినట్లు తెలుసుకొని గాలింపు చేపట్టారు. -
అవినీతి చేయాలని బెదిరిస్తున్నారు
-
నగరపాలక సంస్థలో వసూల్ రాజా..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ప్రతి పనికీ ఓ రేటు విధించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో అతిడిని విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లుగా నగరంలోని ఓ లాడ్జీలో ఉంటూ అవినీతి దందాను కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. గతేడాది జూలై 22న, అక్టోబర్ ఒకటిన ¯ðనెల్లూరు నగరం 25వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, ఇందిరమ్మ కొత్తకాలనీ, కనుపర్తిపాడు ఎస్సీ, బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు మూడు వర్క్ఆర్డర్లు సురేంద్రరెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశారు. కాలపరిమితి ముగియడంతో నీటి సరఫరా తాలూకా రూ.2,63,250 బిల్లు అతడికి రావాల్సి ఉంది. దీంతో ఆయన అదే ఏడాది డిసెంబర్లో పలుమార్లు ఎంబుక్‌ల్లో పనులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్సప్లై, రోడ్స్ విభాగం ఏఈ బీఎస్ ఆంజనేయులరాజును కోరారు. ఏఈ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. సురేంద్రరెడ్డి గతేడాది డిసెంబర్ 27న దుబాయిలో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఏఈని వివిధ ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు కుక్కలగుంటలోని కలరా హౌస్‌లోని వెహికల్స్ డిపో విభాగానికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సురేంద్రరెడ్డి దుబాయి నుంచి తిరిగి వచ్చి బిల్లుల విషయమై ఏఈని కలిసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడినుంచి ఏఈని వేరే విభాగానికి మార్చాడని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన బాధితుడు ఏఈని కలిసి బిల్లుల విషయమై మాట్లాడాడు. ఎంబుక్‌లు అతని వద్దనే.. ఏఈ వేరే విభాగానికి మారినా సురేంద్రరెడ్డి పనులకు సంబంధించిన ఎంబుక్స్ అతని వద్దనే ఉన్నాయి. పనులు తాలూకా వివరాలను ఎంబుక్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు ఏఈ పంపాల్సి ఉంది. అందుకు గానూ రూ.30 వేలు ఇవ్వాలని ఏఈ సురేంద్రరెడ్డిని డిమాండ్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నానని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. ఈనెల రెండో తేదీన సురేంద్రరెడ్డి మరోమారు ఏఈని కలిసి ప్రాధేయపడ్డాడు. అయినా అతను కనికరించకపోగా రూ.30 వేలు ఇస్తేనే ఎంబుక్‌లను ఉన్నతాధికారులకు పంపుతానని తేల్చిచెప్పాడు. నాలుగైదురోజుల్లో నగదు ఇస్తానని చెప్పి బాధితుడు అక్కడినుంచి వచ్చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అదేరోజు నెల్లూరు ఏసీబీ డీఎస్సీ సీహెచ్‌డీ శాంతోను కలిసి ఏఈపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు, ఏఈతో మాట్లాడిన ఆడియో సంభాషణలకు సంబంధించిన సీడీలను డీఎస్పీకి అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు రూ.30 వేలు ఇస్తానని ఏఈకి తెలిపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత గురువారం ఉదయం ఏఈ (కలరా హాస్‌లోని తన కార్యాలయంలో) రూ.30 వేలు సురేంద్రరెడ్డి వద్ద నుంచి లంచం తాలుకా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఏఈకి రసాయన పరీక్షలు నిర్వహించారు. బీరువాలో ఉన్న ఎంబుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ లంచం తీసుకున్న వైనం ఇదిలా ఉండగా సురేంద్రరెడ్డికి గతంలో రూ.8.40 లక్షలకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎంబుక్‌లో వివరాలు నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపేందుకు ఇదే ఏఈ బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకున్నట్లు ఏబీబీ అధికారులు పేర్కొన్నారు. ఇలా పలువురి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఏఈ ముక్కుపిండి వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎవరి ప్రమేయం ఉంది? అక్రమ వసూళ్లలో తనతోపాటు ఉన్నతాధికారులకు వాటా ఉందని సదరు ఏఈ ఏసీబీ అధికారుల ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధమైయ్యారు. ఓ డీఈ అక్రమ వసూళ్లలో భాగస్తుడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. సదరు డీఈపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తాజాగా పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏఈ అరెస్ట్ అవినీతి ఏఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. మామూళ్ల వెనుక ఉన్నతాధికారుల ప్రమేయంపై అతడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శుక్రవారం ఏఈని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ శాంతో, ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐదున్నరేళ్లుగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బీఎస్ ఆంజనేయులరాజు 2013 జూలైలో నెల్లూరు నగరపాలక సంస్థలో ఏఈగా బాధ్యతల్లో చేరాడు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆయన కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారు. గతంలో వాటర్ సప్లై, రోడ్స్ విభాగంలో పనిచేశారు. ఈక్రమంలోనే పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అతడిపై పలు ఆరోపణలు వినిపించడంతో మూడునెలల క్రితం కలరా హౌస్‌లోని మున్సిపల్ వెహికల్స్ డిపోకు మార్చారు. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్లను బెదిరించి వారి వద్దనుంచి సంతకాలను తీసుకుని డీజిల్ డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఏసీబీ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. కాగా సదరు ఏఈ నగరపాలక సంస్థలో చేరిన నాటినుంచి బృందావనంలోని లాడ్జీలో ఉంటున్నాడు. అనధికార కార్యకలాపాలను లాడ్జీ నుంచే నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు. -
విద్యుత్ ఏఈపై వేటు
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు రూరల్ ఏఈ నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఆయన పని చేసిన బీ రోడ్డు సెక్షన్లో ఉపయోగించిన సామగ్రి, మంజూరైన పనుల వివరాలను పూర్తి స్థాయిలో సంస్థకు తెలుపలేదు. అలాగే ప్రస్తుత ఏఈ చలపతికి సెక్షన్ అప్పగించలేదు. ఈ కారణాలతో నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవరాముడు పేర్కొన్నారు. -
బనగానపల్లె ఏఈ సస్పన్షన్?
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ డోన్ ఆపరేషన్స్ డివిజన్లోని బనగానపల్లె రూరల్ ఏఈగా పనిచేస్తున్న పుల్లయ్యపై సస్పెన్షన వేటు పడినట్లు తెలిసింది. కమర్షియల్ మీటర్లు అమర్చడంలో అవకతవకలు జరిగిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమర్షియల్ టవర్ కనెక్షన్‌కు సీటీ మీటర్‌కు బదులు సాధారణ మీటర్‌ను ఏర్పాటు చేయడంతో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ఇటీవలే డీపీఈ(విజిలెన్స్ స్క్వాడ్) విభాగం అధికారలు తనిఖీలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. గత రెండున్నరేళ్ల నుంచి నెలవారీ బిల్లింగ్ అయిన యూనిట్ల వివరాలు బయటకు తీయడంతో లక్షల యూనిట్లు సంస్థ నష్టపోయినట్లు సమాచారం. ఈ కారణంగా డీపీఈ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏఈ పుల్లయ్యపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏఈకి ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని ఎస్ఈ భార్గవ రాముడు తెలిపారు. -
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
అచ్యుతాపురం(విశాఖపట్నం జిల్లా): ఏసీబీ వలలో అచ్యుతాపురం విద్యుత్‌శాఖ ఏఈ రంగారావు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈని, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెదురువాడ గ్రామానికి చెందిన రవివర్మకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రంగారావు రూ.50 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం పిడుగురాళ్ల (గురజాల) : మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో చిక్కిన ఘటన పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానందం శాంతో మాట్లాడుతూ.. గత వేసవి కాలంలో పట్టణంలో పలు వార్డుల్లో తాగునీరు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ యరగాని ఏసుబాబుకు మూడు వర్క్ ఆర్డర్లు అందించారని చెప్పారు. వాటి ప్రకారం అతనికి రూ.4.20 లక్షల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. వాటికోసం ఎంబుక్స్ రికార్డు చేసేందుకు గత కొన్ని నెలలుగా మున్సిపల్ ఏఈ బాబర్ రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఏసుబాబు ఏసీబీని ఆశ్రయించటంతో మొదటి విడతగా రూ.10 వేలు ఏఈ బాబర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జరిపిన దాడిలో ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఈ రామమునిరెడ్డిని మున్సిపల్ కార్యాలయానికి రావాలని తాను ఫోన్ చేసినా రాలేదని, దీంతో తామే డీఈ గృహానికి వెళ్లామని వివరించారు. ఈ దాడిలో సీఐ వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. కడుపు కాలి ఏసీబీని ఆశ్రయించా - యరగాని ఏసుబాబు, కాంట్రాక్టర్ ఆరు నెలలుగా బిల్లులు చేయక ఇబ్బందులు పెట్టడమే కాక తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక ఏసీబీ అధికారులను సంప్రదించాను. ట్రాక్టర్లకు డీజిల్ బకాయి బిల్లులు ఇవ్వాలని నిత్యం ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఏఈ బాబర్ దృష్టికి తీసుకెళ్లినా కనికరించకుంగా నిర్లక్షంగా వ్యవహరించారు. అందుకే తప్పని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
నేడు ఏఈ పోస్టులకు పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం జరగుతున్న పరీక్షను నగరంలో ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలియజేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
వరంగల్ : సాంఘిక సంక్షేమ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ కలెక్టరేట్లో ఏఈగా పనిచేస్తున్న అజీజ్ ఒక పనికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
హన్మకొండ : బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ తాడ్వారుు పంచాయతీరాజ్ ఏఈ జీపీ.కృష్ణ సోమవారం ఏసీబీకి దొరికాడు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో భాగంగా చిలుకలగుట్ట వద్ద సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఫైనల్ బిల్లు చెల్లించేం దుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వివరాలు వెల్లడించా రు. కాంట్రాక్టర్ మెతుకు తిరుపతిరెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులు చేశాడు. ఈ పనుల ఫైనల్ బిల్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ తాడ్వాయి మండల ఏఈ జీపీ.కృష్ణ రూ.40 వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు ఆయన కోరినవిధంగా హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్-2 తేజస్వీ స్కూల్ సమీపంలోకి సోమవారం సాయంత్రం కాంట్రాక్టర్ వెళ్లి డబ్బులు ఇవ్వగా వలపన్ని పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని కృష్ణను అరెస్ట్ చేశారు. జాతర పనుల్లో సీసీరోడ్డును టెండర్ ద్వారా దక్కించుకొని జనవరిలో పూర్తి చేయగా తనకు ఫైనల్ బిల్లు చెల్లించేందుకు రూ.40వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి తెలిపారు. డబ్బులు ఇచ్చేందుకు డీఈఈ ఇంటికి రావాలని చెప్పాడని, దీంతో అక్కడికి వెళ్లగా బేకరి వద్దకు రావాలని చెప్పగా వెళ్లానని, అక్కడ డీఈఈ కాకుండా తానే డబ్బులు తీసుకున్నాడని వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబ య్య పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబయ్య పాల్గొన్నారు. కక్కుర్తితోనే... ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వారుు పంచాయతీరాజ్ శాఖ ఏఈ కృష్ణ ఓ కాంట్రాక్టర్ నుంచి హన్మకొండలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ టం కలకలం రేపింది. తాడ్వారుులో ఆయన ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు ఇంజనీరింగ్ అధికారి కమీషన్లు కావాలని ఒత్తిడి చేయగా కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రరుుంచా డు. కమీషన్లు ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇప్పుడు అతడు ఏసీబీకి చిక్కడం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
హన్మకొండ: వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాడ్వాయి పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న కృష్ణ ఓ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి హన్మకొండలోని ఏఈ నివాసం సమయంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
-
ముగిసిన ట్రాన్స్‌కో ఏఈ, టీఎస్పిఎస్సీ రాతపరీక్ష
-
ప్రశాంతంగా ముగిసిన ఏఈ రాత పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఏఈ పోస్టుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగింసింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లో ఉన్నటువంటి 206 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 39,092 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 37,489 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
ములుగు: వరంగల్ జిల్లా ములుగు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అబ్బాపూర్ గ్రామంలో ట్రాన్స్ఫారం ఏర్పాటుకు రైతులు డీడీ తీసి నాలుగు నెలలుగా ఏఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని ఏఈ శ్రీనివాస్ చెప్పినట్టు తెలిసింది. దీంతో అబ్బాపూర్‌కు చెందిన రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఓ రైతు ఏఈ శ్రీనివాస్‌కు ములుగులోని ఆయన కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -
ఏఈ పై టీడీపీ నేతల దాడి
వైఎస్సార్ జిల్లాలో దౌర్జన్యం బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జి.ప్రసాద్‌పై టీడీపీకి చెందిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, అతడి అనుచరులు గురువారం దాడి చేశారు. కార్యాలయంలోని కుర్చీ లు, కం ప్యూటర్‌ను ధ్వర సం చేశారు. అడ్డుకోబోయిన డీఈని కూడా తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలిసింది. తాగునీటిఎద్దడి నివారణకు పంచాయతీల ఆమోదం తో ట్యాంకర్లను ఏఈ ఏర్పాటు చేశారు. అయితే, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి తాను చెప్పినవారికే ట్యాంకర్లు కేటాయించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఎంపీపీ, అతని సోదరుడు సుబ్బారెడ్డి, రాజుపాళెం నేత తిరుపతిరెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డిలతోపాటు మరో పది మంది ఏఈతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్ప డ్డారు. ఏఈల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు నిందితులపై కేసు నమోదు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్‌పై టీడీపీ నేతల దాడిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తిరువీధి జయరాములు తీవ్రంగా ఖండించారు. -
కళ్యాణదుర్గం డీఈని నిర్బంధించిన బాధితులు
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. డీఈ శివశంకర్ నాయక్, ఏఈ రంగనాయక్‌లు బిల్లులు ఇవ్వకుండా ప్రజలను తిప్పించుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎమ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు హౌసింగ్ కార్యాలయానికి చేరుకొని డీఈని, ఏఈని నిర్బంధించారు. -
ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ
రంగారెడ్డి (వనస్థలిపురం): వినియోగదారుని నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వనస్థలిపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ, ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక వినియోగదారుని వద్ద బుధవారం 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ ఏఈ అశోక్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 20వేలరూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
మిర్యాలగూడ క్రైం : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ బ్రాంచి కెనాల్ ఏఈ జిసి.మల్లయ్య సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మం డలం తక్కెళ్లపాడుకు చెందిన కాంట్రాక్టర్ బొలిశెట్టి గంగాధర్ నాలుగు నెలల క్రితం గ్రామ పరిధిలోని మైనంవారిగూడెంలో రూ.8 లక్షలు, తాడిచెట్టుతండాలో రూ.6లక్షలు, దొండవారిగూడెం గ్రామ పరిధి సామ్యతండాలో రూ.8 లక్షలతో జాలుకాలువలకు గైడర్వాల్స్ నిర్మించాడు. ఈ పనులను నాలుగు నెలల క్రితం పూర్తిచేశాడు. ఎంబీ రికార్డు చేయాలని నెలరోజులుగా ఐబీ ఏఈ మల్లయ్య చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రూ.1.50 లక్షలు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ స్పష్టం చేశాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గంగాధర్ మూడు రోజుల క్రితం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ముందుగా రూ.50వేలు, మరో రెండురోజుల అనంతరం మిగతా లక్ష రూపాయలు ఇస్తానని గంగాధర్ ఏఈతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఎసీబీ అధికారులు వలపన్ని రాత్రి సమయంలో ఏఈ ఇంటి వద్ద గంగాధర్ రూ 50వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ ఇంటి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనపర్చుకున్నారు.ఐబీ ఏఈ మల్లయ్యపై అవినీతి నిరోదకచట్టం కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాస్, ముత్తులింగం, సిబ్బంది ఉన్నారు. -
ఏసిబికి చిక్కిన ఏఇ, జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్: ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్‌ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రావు ఓ వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తసుకున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పంచాయతీరాజ్‌లో ఏఇ శ్రీహరి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ :నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చీనూర్ పంచాయితీ పరిధిలోని మేజర్‌వాడి ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో మూడుమాసాల క్రితం రూ. 75వేలతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు శ్రీనివాస్ మూడునెలలుగా కాంట్రాక్టరైన టీఆర్ఎస్పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గంపల యాదగిరిని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరికి ఎంబీ రికార్డు చేసేం దుకు రూ. 15 వేలు డిమాండ్ చేశారు. అంతపెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని యాదగిరి పేర్కొనగా చివరికి రూ. 10 వేలకు బేరం కుదిరింది. అనంతరం యాదగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మం డల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో యాదగిరి నుంచి రూ. 10వేలు తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాస్‌ను అక్కడ మాటువేసిఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని హైద్రాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీయస్సీ సంజీవరావు తెలిపారు. ఇన్చార్జి ఏఈగా శ్రీనివాస్ రెండున్నరేళ్లుగా మం డలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనఎల్లారెడ్డి పీఆర్ ఏఈగా రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు తమను సంప్రదించాలని డీయస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ కోరారు. సెల్ నం. 9440446155 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఖుర్షిద్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులు మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి ఇలా దొరికిపోవడం ఈ ప్రాంతంలో మొదటి సారిగా స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకుని పలుగ్రామాల నుంచి నాయకులు, ప్రజలు మండల పరిషత్ కాార్యాలయానికి తరలివచ్చారు. అవినీతి అధికారుల్లో మాత్రం గుండె దడ మొదలైంది.


