సాక్షి,కాకినాడ: తన కుటుంబాన్ని నాశనం చేసి.. తనను అనాథను చేసిన సాధిక్ ఖాన్‌కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు.
‘రైఫిల్ షూటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాను. మూడో తరగతి నుంచి సాధిక్‌తో పరిచయం ఉంది. గతంలో మా స్కూల్లో పనిచేసేవాడు.
స్కూల్ నుంచి తీసేసారని తన అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ నాకు భయంగా ఉంది. సాధిక్‌కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి’అని ఆవేదన వ్యక్తం చేశాడు.


