‘చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా?’ | YSRCP Leader Bhumana Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా?’

Aug 25 2026 7:33 PM | Updated on Aug 25 2026 8:08 PM

YSRCP Leader Bhumana Slams Chandrababu Govt

తిరుపతి:  ఏపీలో మద్యం ఏరులై పారుతోందని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత భూమన  కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్‌లకు సైతం తలుపులు తెరిచి మరీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్లాన్‌ చేశారన్నారు.  చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా? అని ప్రశ్నించారు భూమన. 

‘మద్యం సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. 5వేలకు పైబడిన మద్యానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో  535 తీసుకు వచ్చింది. ప్రీమియర్ లిక్కర్‌కు బార్లా తలుపు తెరిచింది. ప్రతి చోట మద్యం దుకాణాలు.. ఊరూ-వాడ తేడా లేకుండా బెల్ట్ షాపులు విక్రయాలు సాగిస్తున్నారు. 

పగలు రాత్రి అని తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజల రోగ్యం పూర్తిగా గాలికి వదిలి వేసింది. రాష్ట్రంలో 3లక్షలకు పైగా బెల్ట్ షాపులు విళయ తాండవం చేస్తున్నాయి. మద్యం తాగాలి.. తూగాలి అనే నినాదం తో వెళ్తోంది కూటమి ప్రభుత్వం.  ఖరీదైన మద్యం అమ్మకాలు ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. రూ. 20 లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చాయని ఉదరకొడుతున్నారు.. అది ఇదేనా.?’ అని నిలదీశారు.

మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement