మంచం కింద నోట్ల కట్టలు | Peddapalli Ae Held Red Handed While Taking Rs 2 Lakh Bribe | Sakshi
Sakshi News home page

మంచం కింద నోట్ల కట్టలు

Jul 14 2026 1:20 PM | Updated on Jul 14 2026 1:37 PM

Peddapalli Ae Held Red Handed While Taking Rs 2 Lakh Bribe

సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ఏసీబీ వలకు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ చిక్కారు. ఏఈ సతీష్ రూ.2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్‌ను సతీష్‌ లంచం డిమాండ్‌ చేశాడు. అంతపెద్ద మొత్తం అడిగేసరికి కంగుతిన్న కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఇవాళ (మంగళవారం) ముందస్తు ప్లాన్ ప్రకారం సతీష్‌కు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లిలోని ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఏఈ సతీష్ ఇంట్లో మంచం కింద భారీగా డబ్బు కట్టలు లభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు సోదాల్లో 32 లక్షల నగదును గుర్తించారు. ఏఈ సతీష్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement