Relationships
-
సెంచరీ చేసిన సరస్వతమ్మ… ఇంకా నాటౌట్!
అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకొంది. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరుకావడం విశేషం. నాలుగు తరాల కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు నిర్వహించుకోవడం అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి, కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో పండుగ సందడి కనిపించింది. -
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్‌ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. పెట్స్‌తో అనుబంధమూ పెరుగుతోంది. దీని వల్ల కొత్త సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంటిల్లిపాదీ ముందుగా పెట్స్‌కు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు...‘పిల్లి చనిపోతే ఏడుస్తున్నావా, కుక్కపోతే అంత దుఃఖమా..’ అంటూ బాధపడుతున్నవారితోనే అవమానకరంగా మాట్లాడేవారుంటారు. దీనివల్ల వారి బాధ మరింత పెరుగుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. పెట్ అంటే కేవలం ఒక జంతువు కాదు. అది మనసుకు అండగా నిలిచే ఒక జీవం. మనం బాధల్లో లేదా ఆనందంలో ఉన్నప్పుడు మాటలేమీ లేకుండానే మనసును అర్థం చేసుకునే తోడు. అందుకే, ఇటీవలి కాలంలో చాలామంది పెట్స్‌తోనే ఎక్కువ అటాచ్‌మెంట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. మనతో కలిసి జీవించే ప్రాణి అకస్మాత్తుగా దూరమైతే, ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు మరింత భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పెంపుడు జంతువును కోల్పోయినా అంతే బాధ కలుగుతుంది.వాస్తవం ఏంటంటే...∙పెట్స్‌కి మనుషుల కంటే తక్కువ జీవనప్రమాణం ఉంటుంది. పిల్లి జీవితం కాలం 13 నుంచి 20 ఏళ్లు. కుక్క ఆయుష్షు బ్రీడ్‌ను బట్టి 10 – 13 ఏళ్లు, కుందేలు 7 –10 ఏళ్లు. ఇలాగే, ఇతర జంతువులు, పక్షులకు.. నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ∙పోషణ, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు, బరువు నిర్వహణ.. ఇవన్నీ కూడా పెంపుడు జంతువుల ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. వీటిని తప్పక అంగీకరించాల్సిందే. ఈ విషయాన్ని పెట్‌ను ఇంటికి తీసుకురావడానికి ముందే కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉంటే వారికి ఈ నిజాలు తప్పక చెప్పాలి. ∙పెంపుడు ఎలా ఉండాలి, క్రమశిక్షణ, వాటికి ఇవ్వాల్సిన శిక్షణ, కుటుంబంలో అందరూ నిబంధనను తప్పక పాటించాలి. నెలకు ఒకసారైనా పెట్స్ పెంపకం గురించి మంచి–చెడులను అందరూ కలిసి బేరీజు వేసుకోవాలి. ∙పెట్ చనిపోవడం ఒక్కటే కాకపోవచ్చు... సూసైడ్‌కు ఒత్తిడికి సంబంధించిన కారణాలు మరిన్ని ఉండి ఉండవచ్చు.తేలిగ్గా తీసేయవద్దుకుటుంబంలో పెంపుడు జంతువుతో ఎవరికి ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ‘పిల్లికి, కుక్కకే.. ఇలా అయిపోతే ఎలా.. అది ఒక జంతువు మాత్రమే కదా’ అనే మాటలతో వాళ్ల బాధను చిన్నచూపు చూడద్దు. దీనివల్ల ఇంట్లో తమ భావోద్వేగాలను పట్టించుకోనివారిగా, తమ బంధాన్ని అగౌరవ పరిచినట్టుగా భావిస్తారు. ఇవి చేయించవచ్చు...∙పెట్ రెస్క్యూ సెంటర్స్, అడాప్షన్ సెంటర్స్‌కి వెళ్లి రావచ్చు. ∙మరో చిన్న పెట్‌ను కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. ∙యానిమల్ రెస్క్యూ టీమ్స్‌తో కలిసి స్వచ్ఛందంగా తమ సేవలను అందించవచ్చు. ∙పెట్ లాస్ – ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్, హ్యూమన్ వరల్డ్ లింక్ వంటి గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో చేరి బాధను పంచుకోవచ్చు. ∙పెట్ జ్ఞాపకార్ధం ఒక మొక్కను తెచ్చి నాటి, ఆ మొక్క పెంపకంలో సేదతీరవచ్చు. ∙పెంపుడు జంతువు గురించి నచ్చిన విషయాలను రాసి, ఇంట్లో అందరూ ఆ విషయాలను పంచుకోవచ్చు. ∙బాధ నుంచి కోలుకోవడానికి స్థల మార్పిడి బెటర్. ∙మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులు, బాధను పంచుకోగలవారు దగ్గరగా ఉండాలి. పెట్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. పెంపుడు జంతువు పంచిన ప్రేమను గుర్తుంచుకోవాలి. కానీ మన జీవితాన్ని వదిలేయకూడదు.. అనే వాస్తవాల్ని పెట్ లవర్స్ తెలుసుకోవాలి, సన్నిహితులకు తెలియజెప్పాలి.నిపుణుల సాయం అవసరం...పెట్స్‌ను ప్రేమించడం మంచి విషయం. కానీ, ఆ ప్రేమ మన బతుకుని బలి తీసుకునేలా ఉండకూడదు. ఎక్కువ ఎమోషన్‌కు గురవుతుంటే, మూల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. దుఃఖిస్తున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. గతంలో పెంపుడు జంతువుతో ఉన్న సమయాలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఆ సమయం లో మరో ఇష్టమైన వ్యాపకంతో పూరించుకోవాలి. అధిక ప్రేమ, భావోద్వేగాల విషయంలో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే కౌన్సిలర్ సాయం తప్పక అవసరం.– డాక్టర్ సునీత ప్రసాద్, సైకాలజిస్ట్ -
విడాకుల కేసులో వెన్నెలకు ఎదురుదెబ్బ..!
వెన్నెలకి తన 21వ ఏట పెళ్ళి చేశారు పెద్దలు. భర్తకి అప్పటికే 35 ఏళ్ళు. పెళ్లి అయిన వారం కూడా గడవకుండానే హింసించడం మొదలుపెట్టాడు. అలాగే భరిస్తూ ఉండగా ఒక పాప పుట్టింది. వెన్నెలకి 25 ఏళ్ళు వచ్చాయి. విపరీతంగా అనుమానించి కొట్టడంతో తృటిలో ప్రాణం పోయే ప్రమాదం తప్పి, బతికి బయటపడింది. విడాకులు, డీ.వీ.సీ కేసులతో పాటు కూతురికి, తనకు మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేసింది. కేసులు నడుస్తూ ఉండగా వెన్నెలకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఓదార్పుగా తన భుజం అందించారు. అప్పుడు వెన్నెలకి 28 సంవత్సరాలు. వెన్నెల తన సహచరుడితో దిగిన ఫోటోలు తీసుకుని వచ్చి కోర్టులో చూపించి వెన్నెల మరొకరితో సహజీవనం చేస్తోందని చెప్పడంతో కోర్టు వెన్నెలకి మెయింటెనెన్స్ తిరస్కరించింది. పాపకి మాత్రం నెలకి 7 వేలు ఇచ్చింది. భర్త దగ్గర ఉంటే ప్రాణాలకే ప్రమాదం. తనకు ఒక సహచరుడు దొరికితే చట్టం వెన్నెలనే దోషిగా చూస్తోంది. ఇప్పుడు తన దారెటు?తమను తాను పోషించుకోలేని భార్య, మైనర్ పిల్లలు, తల్లిదండ్రులు (కొన్ని సందర్భాలలో మేజర్ అయిన పిల్లల సైతం) భర్త నుంచి, తండ్రి నుంచి లేదా కొడుకు నుంచి మెయింటెయినెన్స్ పోందవచ్చు అని సెక్షన్ 125 సి.ఆర్.పీ.సి చెప్తుంది. (కొత్త చట్టంలో సెక్షన్ 144). అయితే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండడానికి ఉన్న కారణాల్లో ఒక ప్రధానమైన కారణంగా మెయింటెనెన్స్ చట్టం లోని సీ.ఆర్.పీ.సీ. సెక్షన్ 125(4) – ప్రస్తుత బీ.ఎన్.ఎస్.ఎస్. లోని సెక్షన్ 144(4) ప్రకారం భర్త కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే, భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అంతేకాదు, సరైన కారణం లేకుండా కాపురానికి వెళ్లకపోయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది. అనేక జడ్జిమెంట్లలో ఒకటి రెండు సార్లు లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన మెయింటెనెన్స్ ఇవ్వమంటే కుదరదు అంటూ మహిళలకు అనుకూలమైన తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ ఎగ్గొట్టాలి అని ప్రయత్నించే భర్తలకు కోర్టులో రుజువు చేయాలి అనుకునే విషయం – తన భార్య ఒక వ్యభిచారి అని! వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అని!స్త్రీని ఒక శరీరంగాను, మగవాడికి బానిసగాను, మగాడు పోషిస్తే తప్ప పోషించుకోలేని వ్యక్తిగాను, ‘పతి’ వ్రతగాను – చూడడం ఆపేసి ఒక మనిషిలా – ఒక మైండ్ లా చూడడం మొదలుపెట్టిన రోజున స్త్రీ తన సాధికారత తను సాధించుకోగలదు.ఇదే చట్టంలో అనేకమంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న భర్తలకు డబుల్ మెయింటెనెన్స్ వెయ్యరు కదా?వెన్నెల కేసులో ప్రస్తుత చట్టం ప్రకారం విడాకులు కాకుండా సహజీవనం సాగిస్తుంటే, లేదా వెన్నెల లైంగిక సంబంధం కారణంగా విడాకులు మంజూరు అయివుంటే తనకి మెయింటెనెన్స్ రాకపోవచ్చు. ఒకవేళ వెన్నెలది సహచర్యమే కానీ సహజీవనం కాదు అని నిరూపించగలితే మాత్రం తనకి కూడా మెయింటెనెన్స్ మంజూరు అవుతుంది. అంతే కాక, పాపకి 7 వేలు సరివవు అనుకున్నా, ఖర్చులు పెరిగాయి అనుకున్నా, కోర్టులో అప్పీల్ ద్వారా కానీ, మెయింటెనెన్స్ పెంపునకు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు. -
పిల్లలతో ఆటాపాటా.. వృద్ధులకు ఉల్లాసం
మనవళ్లు, మనవరాళ్లతో గడపడం అనేది వృద్ధుల బ్రెయిన్‌కు మంచి టానిక్‌లా పని చేస్తుందని డచ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. పిల్లల సంరక్షణలో పాలు పంచుకునే వృద్ధుల జ్ఞాపకశక్తి మిగతా వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, దానివల్ల వారికి వయసు పరంగా వచ్చే మానసిక సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం 67 ఏళ్ల సగటు వయసు కలిగిన 2887 మంది తాతాబామ్మలను ఎంపిక చేశారు. కొన్ని ఏళ్లపాటు వీరిని పరిశీలనలో ఉంచి డేటాను సేకరించారు. పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారు, వారికి కథలు చెప్పడం, సందేహాలు తీర్చడం వంటì వాటిలో వారు ఎంత చురుగ్గా పాల్గొంటున్నారో వారి పరిశోధనలో విశ్లేషించగా... పిల్లల సంరక్షణలో పాల్గొనే వారిలో జ్ఞాపకశక్తి, పదాలను స్పష్టంగా ఉపయోగించే పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశోధనలో తేలింది. పిల్లలతో అనుబంధం ఉండే వృద్ధులలో వారి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలతో మాట్లాడటం, వారికి విషయాలు వివరించడం వల్ల మెదడు కణాలు చురుగ్గా ఉంటాయి. పిల్లల వెనుక పరుగెత్తడం, వారితో ఆడుకోవడం వల్ల తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది. మెరుగైన రక్తప్రసరణ వల్ల మెదడుకు ఆక్సిజన్ అందుతుంది, ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే, పిల్లల ఆలనాపాలనా చూడటం అనేది కేవలం సరదా కోసం, బాధ్యత కోసం కాదు, వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా ఉండటానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలియజేశారు. -
భర్త ఉన్నా పాత ప్రేమికుడి వైపు మనసు..!
డాక్టర్ గారూ, నా కూతురికి ప్రస్తుతం 34 సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను సామాజికంగా, ఆర్థికంగా మా స్థాయిలో లేనందువల్ల మేము ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మా అమ్మాయి చాలా సంబంధాలను తిరస్కరించింది. చివరికి మేము తీవ్రంగా ఒత్తిడి చేసి, ‘‘ఇలా అయితే మేము బతకం’’ అని చెప్పిన తర్వాత గత సంవత్సరం మేము కుదిర్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె తన భర్తతో దాంపత్యంలో దూరంగా ఉంది. తన పాత ప్రేమ విషయం కూడా భర్తకు చెప్పింది. భర్త మంచి మనసుతో ‘‘గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెడదాం’’ అని చెప్పినా, మా అమ్మాయి అలా చేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే ఆమె తన పాత ప్రేమికుడితో మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. అతను ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడని, తన దగ్గరకు రావాలని ఆమెను కోరుతున్నాడని చెప్పింది. అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్లిని ఒప్పుకోవడం లేదు. మా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా అతనినే చేసుకుంటానని అంటోంది. ఒకవైపు మా అమ్మాయి మొండితనం, మరోవైపు మా అల్లుడి మంచితనం, ఇంకోవైపు పాత ప్రేమికుడి ఒత్తిడి – ఈ పరిస్థితిలో మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేమంతా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా ముందుకు వెళ్లాలి? సరైన మార్గం చెబుతారని ఆశతో......– ఒక సోదరి, హైదరాబాద్మీ ప్రశ్న చదివాక నిజంగా చాలా బాధగా అనిపించింది. ఇక్కడ నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది – ఈ పెళ్లి మీ అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆమెకు తన భర్తతో భావోద్వేగ అనుబంధం ఏర్పడటం చాలా కష్టం. ఆమె గతాన్ని పూర్తిగా వదలలేకపోతోంది. ఆమె మనసు ఇంకా అక్కడే ఆగిపోయింది. మానసికంగా బలమైన బంధం లేని చోట శారీరక బంధాన్ని ఆశించడం సరి కాదు. మీ మీద ప్రేమతో, మీరు చనిపోతారన్న భయంతో ఆమె మనసు నొప్పించి తీసుకున్న నిర్ణయం, ఈ రోజు మూడు కుటుంబాలకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో కూడా కొంత మార్పు అవసరం. పిల్లలు తమ అభి్రపాయాన్ని చెప్పినప్పుడు వెంటనే తిరస్కరించకుండా, ఆ విషయాన్ని కుటుంబ పెద్దలందరూ కలిసి కూర్చొని ప్రశాంతంగా చర్చించడం మంచిది. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం వెతకాలి. బెదిరింపులతో లేదా భావోద్వేగ ఒత్తిడితో సంసారాలు నిలబడటం కష్టం. ఈ సమస్యను ఒకే కోణంలో చూడలేం. ఇందులో సామాజిక, నైతిక, చట్టపరమైన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే, సరైన మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. ఒకసారి మీ అమ్మాయిని, ఆమె భర్తను కలిపి తీసుకువస్తే, వారితో విడివిడిగా మాట్లాడి సమస్య మూలాలను, తీవ్రతనూ అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తితో కూడా మాట్లాడి స్పష్టత తీసుకురావచ్చు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా, మీరు మీ అమ్మాయిని ఇకపై ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఆపాలి. ‘‘మేము చనిపోతాం’’ అనే మాటలు సమస్యను పరిష్కరించవు. మీరు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరింత క్లిష్టతరం అవుతుంది. మీరు ్రపాణం తీసుకోవటం సమస్యకు పరిష్కారం కాదు. నిపుణులైన వారితో ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం ఈ దశలో అత్యంత అవసరం. ఓపికతో, స్పష్టతతో ముందుకు వెళ్లాలి. ఒక విషయం గుర్తుంచుకోండి – కష్టాలు శాశ్వతం కావు. కష్టం తర్వాత సుఖం, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తాయి. కాస్త ఓపిక పట్టండి. మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ప్రేమ.. ఒక జీవితం
నిర్మల్: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల పండుగగా భావిస్తుంటారు. కానీ, ప్రేమ అనేది ఈ ఒక్కరోజుకే పరిమితం కావొద్దు. జీవితాంతం కొనసాగాలని చాలామంది సీనియర్ ప్రేమికులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం అర్థవంతంగా సాగుతుందని, లేదంటే అర్ధంతరంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ నిలుస్తుందని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలవడమే అవసరమని చాలామంది చాటుతున్నారు. అలాంటి ప్రేమజంటలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.జూనియర్–సీనియర్జిల్లాకేంద్రానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు గేయన్మయి నాగరంజని, కావేటి శ్రీకాంత్‌లది ప్రేమవివాహం. వీరిద్దరూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చదువుతుండగా కలిశారు. శ్రీకాంత్ సీనియర్ కాగా, నాగరంజని ఆయనకు జూనియర్. అప్పట్లో వీరిద్దరికీ ఒకే వార్డులో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఒకరి వివరాలు ఒకరికి తెలిశాయి. వారి విభాగం వారంతా ఒకసారి కోల్‌కతా కాన్ఫరెన్స్‌కి వెళ్లారు. అక్కడే ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం బయటపడింది. చదువులు కూడా పూర్తికాగానే ఇద్దరూ ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి చెప్పారు. మొదట్లో నాగరంజని వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలారోజులు వేచిచూసి పెద్దలను ఒప్పించేదాకా ఓపికతో ఉండి చివరకు విజయం సాధించారు. అలా 2014 డిసెంబర్ 7న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక పాప, బాబు ఉన్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలని, ప్రేమను పొందాలంటే ఓర్పు ఉండాలని వీరు సూచిస్తున్నారు.ఇంట్లో ఒప్పించి ఒక్కటయ్యారుజిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యజంట అనిత, రా మకృష్ణలదీ ప్రేమవివాహమే. వీరిద్ద రు 1995లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పట్లో ప్రేమ అంటేనే ఓ భయం. ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే ఇంకా భయం. కానీ, వీరిద్దరూ అప్పట్లోనే ఇంట్లో పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య ప్రేమకు చిహ్నాలుగా పాప పద్మిని, బాబు ప్రద్యుమ్న ఉన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ప్రేమ కలకాలం నిలుస్తుందని, అలాంటి ప్రేమకూ అందరి మద్దతు ఉంటుందని వీరు చెబుతున్నారు. -
నా భార్త సంసారానికి పనికిరాడు.. నేనెలా రుజువు చేయాలి
మాకు పెళ్లి అయ్యి ఏడాది అవుతోంది. తొలిరాత్రి మేము కలవడానికి నా భర్త నన్ను కొంత సమయం కావాలి అని అడిగారు. నేను సరే అన్నాను. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకు నేను తనను సంతృప్తి పరచడం లేదు అని నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి΄ పోమ్మని చెప్పాడు. బంధుమిత్రులందరి దగ్గరా అలాంటి దుష్ప్రచారమే చేస్తున్నాడు. అయితే అది తప్పు. అతను అసలు ఒకసారి కూడా కనీసం నాకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అతను సంసారానికి పనికిరాడు అని చెప్పి కోర్టులో కేసు వేశాను. రుజువు చేయండి అంటున్నారు. నేనెలా రుజువు చేస్తాను? – సరళ, విజయవాడపెళ్ళైన తర్వాత భర్త భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండకపోవటం లేదా లైంగికంగా తగిన విధంగా లేకపోవటం వలన చాలా వివాహ బంధాలు విడాకులతో అంతమవుతున్నాయి. భార్య అయినా భర్త అయినా లైంగిక సంతృప్తి ఇవ్వకపోవడం మానసిక క్షోభకి గురిచేస్తుందని కోర్టులు చాలా సందర్భాలలో చెప్పాయి. లైంగిక సంబంధం లేని భర్తతో కలిసి కొంతకాలం ఉన్న తర్వాత, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే స్త్రీలు ‘ఇంపొటెన్సీ’ని (నపుంసకుడు / లైంగిక శక్తిహీనత/ సంసారానికి పనికిరాడు అని) కారణంగా చూపి కేసులు వేస్తున్నారు. ఇలా వేసే కేసులలో దాదాపుగా స్త్రీలకు వ్యతిరేకం అయ్యే దాఖలాలే ఎక్కువ.ఎందుకంటే భర్త ఇంపొటెన్సీని రుజువు చేయలేని పక్షంలో, భర్త లైంగిక సమర్థతపై అబద్ధపు ప్రచారం చేశారు అని, సమాజంలో భర్త పరువును తీశారని.. ఇవన్నీ కూడా భాగస్వామిపై క్రూరమైన చర్యలే అని కోర్టు భావించే ఆస్కారం ఉంది. తనని నపుంసకుడు అని అందరిలో ప్రచారం చేస్తోందనే కారణం చూపి–దానిని రుజువు చేస్తే, విడాకులు అడిగే భర్తలకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఎందుకంటే, పురుషులలో తరచుగా వుండే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, స్తంభన సమస్యలని చాలా సందర్భాలలో నపుంసకత్వం అని చాలామంది, ముఖ్యంగా సరైన అవగాహన లేని స్త్రీలు భావిస్తుంటారు. అదే కోర్టులో కూడా చెప్పి, చివరికి రుజువు చేయలేక నష్టపోతారు. అందుకే, అలాంటి అంశం ఏదైనా ఉంటే, విడాకుల దరఖాస్తు వేసేముందు నిపుణులతో వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మగవారు సైతం వారికి ఉండే సమస్యలు దాచి ఉంచి పెళ్ళి చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో అయితే తాము సంసారానికి పనికిరామని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లేదా తమకి స్త్రీలపై ఎటువంటి ఆకర్షణా లేదు అని తెలిసి కూడా పెళ్లికి సిద్ధమవుతారు. కేవలం తమని తాము మగాడిలా చూపించుకోవాలి అనే తపనతో స్త్రీ హక్కులను, జీవితాన్ని పట్టించుకోకుండా కావాలని పెళ్ళి చేసుకుని, తర్వాత ఏదో ఒక కారణం చూపి విడిపోవాలని పథకం ప్రకారం చేసుకునే పెళ్ళిళ్ళు కూడా చాలానే వున్నాయి. అయితే, ఒకవేళ తన భర్త సంసారానికి పనికిరాడు అని రుజువు చేయగలిగితే మాత్రం, అన్ని రకాల పరిహారాలతో΄ాటు తగిన భరణం కూడా పొందవచ్చు. అంతేకాక క్రిమినల్ చేసు కూడా నిరూపించవచ్చు. విడాకులు తీసుకోవాలి అనుకునే స్త్రీలు అయినా పురుషులు అయినా, తన భాగస్వామి లైంగికతను తెలుసుకొని, సరైన కారణాలు, రుజువు చేయదగ్గ అంశాలను కోర్టుకు చూపగల్గితేనే సరైన ఉపశమనం దొరుకుతుంది. - శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
నాకు 65 ఏళ్లు.. భార్యేమో ఛీ కొడుతోంది
నా వయసు 65 సంవత్సరాలు. నేను రిటైర్ట్ ప్రభుత్వోద్యోగిని. నా భార్యకు 55 ఏళ్లు. తను టీచర్‌గా పని చేస్తోంది. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి కానీ నియంత్రణలోనే ఉన్నాయి. నా భార్య కొంచెం లావుగా ఉంటుంది. మోకాళ్ల నొప్పి తప్ప ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేదు. మాది ప్రేమ వివాహం. పెళ్లైన మొదట్లో మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగిన తర్వాత మా మధ్య మానసికంగా, శారీరకంగా దూరం పెరిగింది. ఆమె పిల్లలతో కలిసి పడుకునేది. మేము ఏ నెలకో రెండు నెలలకో ఒకటి రెండుసార్లు కలిసేవాళ్లం. ఇటీవలే మా పిల్లలకు పెళ్లిళ్లు చేశాం. వాళ్లు బాగానే సెటిల్ అయ్యారు. నా భార్యకు ఐదేళ్ల క్రితం మెనోపాజ్ వచ్చింది. అప్పటినుంచి ఆమె నన్ను పూర్తిగా దూరం పెట్టింది. ఇప్పుడు మా ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం. నాతో ఒకే బెడ్‌మీద పడుకోదు. ఎప్పుడైనా నేను ప్రేమగా దగ్గరకు వెళితే– కాటికి కాళ్లు చాపే వయసులో ఇంకా నీకు ముద్దు మురిపాలు కావాలా– అంటూ చికాకుతో విదిలించి కొడుతుంది. మా పెళ్లయి ఇన్నేళ్లయినా నేను వేరే స్త్రీని ముట్టుకున్నది లేదు. కనీసం ఊహించుకున్నది కూడా లేదు. భార్యతో కలసి సరదాగా గడపాలని కోరుకోవడం తప్ప! అది కూడా ఆమెకు ఇష్టం ఉండదు. నా భార్య, నా పిల్లలు కలిసి నన్ను ఒక సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన మా పిల్లల కంటె కొంచెం పెద్దవారు. కనీసం నా వెర్షన్కూడా వినకుండా నాకే క్లాస్ పీకారు మీరు కోరికలు తగ్గించుకోవాలి అని చెప్పి నాకు ఏవో మాత్రలు రాశారు. నాకు ఈ విషయమై చాలా బాధగా ఉంది. నా కోరికలో ఏమైనా తప్పుందా? నా విషయంలో నా భార్యా పిల్లల వైఖరి సరైనదేనంటారా? మీ అభిప్రాయం, సూచనలు, సలహాల కోసం గంపెడంత ఆశతో రాస్తున్నాను.– ఎన్.ఎస్.ఎన్.మూర్తి, విజయనగరంమూర్తిగారూ, మీరు రాసిన ప్రశ్నలో ఎక్కడా అశ్లీలత లేదు. మితిమీరిన కోరికలు లేవు. బాధ్యత లేని ప్రవర్తన లేదు. మీరు మీ భార్యతో ప్రేమను, సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. అవి దొరకక పోవడంతో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వయసు పెరిగినంత మాత్రాన ప్రేమ, జీవిత భాగస్వామితో దగ్గరగా ఉండాలనే భావన పూర్తిగా పోదు. అది సహజమే. అయితే మెనోపాజ్ తర్వాత హార్మోన్లలో ర్పడిన అసమతుల్యత వల్ల ఆమెలో వచ్చిన శారీరక, మానసిక మార్పులను మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆమెది కేవలం మెనోపాజ్ వల్ల వచ్చిన సమస్యగా మాత్రమే చూడలేం. పిల్ల బాధ్యతల కారణంగా మీరిద్దరూ ఇప్పటి వరకూ భార్యాభర్తల కంటే తల్లిదండ్రుల్లా ఎక్కువగా జీవించారు. మీ మధ్య మాటలతో పాటు భావోద్వేగ అనుబంధం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లలు వెళ్లిపోయిన తర్వాత మీరు మళ్లీ భార్యాభర్తలుగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మీ భార్య ఇంకా అమ్మ పాత్రలోనే నిలిచిపోవడం వల్ల ఒక భార్య ఇవ్వాల్సిన ప్రేమ, ఆ΄్యాయతల వంటివి ఆమె పూర్తిగా మరచిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మీరు అన్నీ ఆశించేటప్పుడ ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా మంది దంపతుల్లో కనిపించే సమస్యే. ఆమెను తప్పు పట్టడడం కానీ, నిందించడం కానీ సరైనది కాదు. ఇది కేవలం మాత్రలతో తగ్గిపోయే సమస్య కూడా కాదు. ఆమె వైపు నుంచి కూడా సమస్యను అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మీ ఇద్దరూ కలిసి ఒకసారి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అక్కడ మీ ఇద్దరూ భద్రంగా, స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పిస్తారు. మీ మధ్య ఉన్న అపోహను తొలగించి, ఒక సమతుల్యమైన పరిష్కారం కోసం అందరం కలిసి ప్రయత్నిద్దాం. చివరిగా ఒక మాట... వృద్ధాప్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. అన్ని బరువు బాధ్యతలూ తీరిన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరయ్యే మంచి సమయం అది. జీవితపు చివరి రోజులు ప్రేమతో అన్యోన్యంగా గడపాల్సిన సమయం అలా అన్నీ మంచిగా జరగాలని కోరుకుందాం!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!
నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?– కృష్ణమూర్తి, విశాఖపట్నంమీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ పోందే హక్కు వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comమెయిల్ చేయవచ్చు. -
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే: సీఆర్పీఎఫ్ జవాన్ భావోద్వేగ ఘట్టం
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంటారు. అలా ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తాను ఆ ఉద్యోగం సాధించిన విషయాన్ని తల్లికి చెప్పిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ప్రశంసలు పోందుతోంది.మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన గోపాల్ సావంత్ ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబానికి ఆసరాగా తన తల్లి కుడాల్‌నగర్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటుంది. తన తల్లి కష్టాన్ని బాల్యం నుంచి చూసిన గోపాల్ సావంత్ కఠోర దీక్షతో, కృషితో సీఆర్పీఎఫ్ జవానుగా ఎంపికయ్యాడు. అయితే ఈ సంతోషకరమైన విషయాన్ని తన తల్లికి చెప్పిన విధానమే పలువురి మన్ననలు పోందుతోంది. గోపాల్ తన తల్లికి ఇంటి వద్ద చెప్పకుండా.. ప్రతిరోజూ ఆమె రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించేప్రాంతానికి వెళ్లి చెప్పాడు. ఆ విషయం చెప్పగానే ఆ తల్లి భావోద్వేగానికి లోనై, నీళ్లు నిండిన కళ్లతో కొడుకును గుండెలకు హత్తుకుంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఇప్పటి వరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. తల్లీ, కొడుకుల అనుబంధానికి ఫిదా అయిపోతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Vilas Kudalkar (@vilas.kudalkar.52) -
మధ్యతరగతి కల… కొడుకు ప్రేమతో నిజమైంది
మధ్య తరగతి వారికి విమాన ప్రయాణం ఒక తీరని కల. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ వైపుగా ఆలోచన కూడా చేయరు. కానీ .. ఓ కుమారుడు తల్లిదండ్రుల కోసం ఆ కలను నిజం చేస్తే..? ఆ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, ఇప్పుడు తన తల్లిదండ్రులకు ఆ మేఘాలపై విహరించే ఆనందాన్ని అందించాడు.తన తల్లిదండ్రులని విమానాశ్రయం వద్దకి తీసుకువెళ్లగానే భారీ విమానాశ్రయ భవనం, అక్కడి వెలుగులను చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఉత్సాహంతో΄ాటు, విమానం ఎక్కే ముందు కొంచెం కంగారుగా కనిపించినా.. తమ కుమారుని చేయి పట్టుకుని విమానంలోకి ప్రవేశించినపుడు వారి ఆందోళన అంతా పోయి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆ క్షణం ఎంతో విలువైనది. తన తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని చూసి, ఆ కుమారుడి ముఖంలో ఎంతో తృప్తి, గర్వం. దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజనులు తల్లిదండ్రుల కల నెరవేరిన సంతోష సమయం అనీ... కొడుకు కళ్లల్లో ఆనందం వెల కట్టలేనిది అనీ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hey Vishnu👨💻 (@vishh.mms) -
నా కంటే వీధికుక్కలే ఎక్కువంట!.. ఓ భర్త ఆవేదన వైరల్
‘ఒకప్పుడు దంపతులు కలిసి ఉండటానికి రాజీ కుదర్చాల్సిన పరిస్థితులు కనిపించేవి. ఇప్పుడు జంటలు విడిపోవడానికి అధిక శాతం రాజీ పడుతున్నారు’ అంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూసి,విడాకులకువచ్చేవారి సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. భార్య కుక్కలు పెంచుతోందని భర్త విడాకులకు వెళ్లడం, బ్యూటీ పార్లర్ ఖర్చు కోసం భరణం ఎక్కువ ఇవ్వాలని భార్య తిరిగి కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్యలే అయ్యాయని అంటున్నారు. వైవాహిక బంధంలో వస్తున్న ఈ పెనుమార్పులు రాబోయే కాలానికి ఈ యేడాది చెబుతున్న కొత్త భాష్యం.. ‘‘ఈ యేడాది న్యాయపరంగా చూస్తే విడాకుల సంఖ్య బాగా పెరిగింది. సెక్షన్ 490ఎ కింద వరకట్న కేసులు కోర్టులలో చాలా సులువుగా వీగిపోతున్నాయి. ఇప్పుడు జాతీయ లోక్ అదాలత్‌లో చాలావరకు ఈ కేసులను నిర్వహిస్తున్నారు. ఇరువైపుల వాళ్లు ఈ విషయంలో రాజీ కుదుర్చుకొని, డబ్బు విషయాలలో ఒక ఒప్పందానికి వచ్చి, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. దీని వల్ల కోర్టులకు పనిభారం కూడా తగ్గింది’’ అంటున్నారు న్యాయనిపుణులు ఈమని పార్వతి.సమయానికే ప్రాధాన్యతచిన్న వయసు జంటలు విడాకులకు లాయర్లను సంప్రదించే వారి శాతం బాగా పెరిగింది. దంపతులలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరిలోనూ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ గ్యాప్‌ని పూరించడానికి చాలా సమయం పట్టవచ్చు. సమయం వృథా అయ్యేలా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారు. డబ్బు, సమయం, పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం.. నవతరానికి నచ్చడం లేదు. అందుకే విడాకులు తీసుకునే సందర్భంలో డబ్బు పంపకాలలో ఒక కచ్చితమైన ధోరణి ఉండేది. ఉదాహరణకు... ఒక విడాకుల కేసులో అమ్మాయి తనకు పది లక్షలు ఇవ్వాలని ముందు పంతం పట్టినా రెండు మూడు సిట్టింగ్‌లలో 5–6 లక్షలకు రాజీకి వచ్చేస్తుంది.విడాకులకు ఏదైనా కారణమే...!ఇంత చిన్న విషయానికే బంధాన్ని విడగొట్టుకుంటారా అనిపించే హాస్యాస్పదమైన కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి.. ‘ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చి, వాటికి ఆహారం పెడుతూ, వాటితో ఆడుతూ–పాడుతూ ఆనందంగా ఉంటోంది. దీంతో ఖర్చు ఎక్కువైపోయింది, ఆ వాసన భరించలేకపోతున్నాను అని ఆ భర్త ‘నా భార్య నన్ను మానసికంగా టార్చర్ చేస్తుంది, విడాకులు కావాలని’ కోర్టును ఆశ్రయించాడు. అది సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అతని ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోందని ఆమెను హెచ్చరించిన కోర్టు విడాకులు మంజూరు చేయడానికి ఇంకాస్త టైమ్ ఇచ్చింది. ఒక కేసులో జంటలో ఒకరు మాంసాహారులు, మరొకరు శాకాహారులు. తమ భాగస్వామి నుంచి వచ్చే ఉల్లి, వెల్లుల్లి వాసన నచ్చడం లేదు. ఈ కారణంగా విడాకులకు అప్లై చేశారు. అస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చొని తనను పట్టించుకోవడం లేదని మరొక కేసు ఫైల్ అయ్యింది. ఇలాంటివన్నీ క్రూయల్టీ కింద అంటే మానసిక వేదనకు కారణం అవుతుందనే విషయంగా ఆలోచిస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ కేసు విషయంలో... భర్త అమెరికాలో ఉన్నాడు, భార్య ఇండియాకు వచ్చింది. ఆమె తిరిగి వెళ్లడం లేదు. ఆ భర్త అమెరికా నుంచి కేసు ఫైల్ చేశాడు భార్య తిరిగి రావాలని. ఆమెకు ఇష్టం లేక ‘క్రూయల్టీ అమౌంట్’ అనే విషయం మీద కేసు వేసింది. అదేమింటంటే, భర్త తాను పంపే డబ్బుకు ప్రతీ పైసాకు లెక్క అడుగుతున్నాడనేది ఆమె అభియోగం. అతనిపైన క్రిమినల్ కేసు నమోదయ్యింది. హైకోర్టులో కూడా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో అతను సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకున్న ఒకామె భరణం పెంచాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన విషయాలు.. బ్యూటీ΄ార్లర్కు వెళ్లడానికి, షాపింగ్ చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని కేసు ఫైల్ చేసింది.సర్దుబాటు «ధోరణి దంపతుల్లో లోపించడం, డబ్బులు, ఇతరుల పట్ల ఆకర్షణ, అవసరాలు పెరగడంతో బంధాలు చాలా సులువుగా విచ్ఛిన్నమవుతున్నాయి. బంధాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తేనే అవి మనుగడ సాధిస్తాయి. విడిపోవడానికి రాజీ చేసుకునేవాళ్లు, కలిసుండే విషయంలో ప్రయత్నిస్తే దాంపత్య జీవనం సామాజికంగానూ పటిష్టంగా ఉంటుంది. పిల్లలు ఉన్నా.. ఒత్తిడి లేదు..విడాకులు తీసుకోవాలనుకున్న జంటలకు పిల్లలు ఉంటే, వారిపై తమ ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనే ఒత్తిడి ఈ రోజుల్లో లేదు. ఇరువైపుల ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటున్నారు. వారు కూడా సంతానం నిర్ణయాన్నే ఆమోదిస్తున్నారు. విడాకులు తీసుకున్న జంటలకు పిల్లల కస్టడీ గురించి పెద్ద సమస్యలు లేవు. విజిటింగ్ రైట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితం చూసుకుంటూ, తమ పిల్లల విషయంలో సమాన బాధ్యతలు నిర్వర్తించేందుకు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన సహజీవనాలు2022లో దీపక్ శర్మ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వివాహేతర సంబంధాలలో సమాజం ప్రకారం అనైతికం కానీ, చట్టరీత్యా శిక్ష పడేటటువంటి నేరం కాదు అనేది వచ్చింది. అయితే, అందరి విషయాల్లో కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అని కూడా చె΄్పారు. కానీ, చట్టాన్ని ఒక సాకుగా చూపుతున్నారు. లివింగ్ రిలేషన్ కూడా పెరిగింది. సమస్య వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దూరం అయినప్పుడు లైంగిక హింస, రేప్ వంటి కేసులు వస్తున్నాయి. ఇద్దరు ఒక ఇష్టప్రకారం ఉండి, ఎవరో ఒకరికి నష్టం జరిగినప్పుడు తట్టుకోలేక కేసులు ఫైల్ అవుతున్నాయి. అయితే, ఈ కేసులు అంతగా నిలబడటం లేదు. -
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్‌తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్‌తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్‌గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్‌లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్‌తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్‌కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్‌కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్‌కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్‌తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్‌ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది. -
అందరి అమ్మ అల్కాశర్మ
భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం. దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్‌కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్‌ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది. ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు. అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్‌లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు. ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ. – యాసీన్ -
ఎమోషనల్ మగాడే అసలైన వాడు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మనసారా ఏడ్చారా? మీ భయాలను ఓపెన్ గా చెప్పగలిగారా? మీ బలహీనతలను ఒప్పుకోగలిగారా? చాలామంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుందని తెలుసు. ఎందుకంటే మన సమాజంలో మగబిడ్డ పుట్టిన వెంటనే అతని చుట్టూ ఒక మేట్రిక్స్ నిర్మితమవుతుంది. మేట్రిక్స్ అంటే మరేదో అనుకోకండి, ఒక ఫ్రేమ్ వర్క్.‘‘నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. బాధపడకూడదు, తట్టుకోవాలి’’ అని పుట్టినప్పటినుంచీ చెప్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కలిసి అతను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఒక ఫ్రేమ్ వర్క్ ను నిర్మిస్తాయి. అది కంటికి కనిపించని జైలులా మారుతుంది. దాని లోపల ఉన్నాడని కూడా తెలీదు. కానీ అతని డెసిషన్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ అది నియంత్రిస్తుంటుంది.కానీ చాలామందికి అది తెలియదు. తెలిసిన వాళ్లు కూడా బయటకు రావడానికి భయపడతారు. కానీ నిజమేమిటంటే... దాన్ని బద్దలు కొట్టినప్పుడే మగాడు నిజమైన మనిషి అవుతాడు.1. BREAKమగాడు, మగతనం అనే మేట్రిక్స్‌ను బద్దలుకొట్టకపోతే పురుషుడు సంపూర్ణంగా జీవించలేడు. జస్ట్ మగాడిగా తన పాత్రను పోషిస్తుంటాడంతే. ఈ మేట్రిక్స్ మగాడి మనసుకు మూడు పెద్ద నష్టాలు చేస్తుంది:1. ఏమైనా జరిగినప్పుడు ‘ఇది చిన్నవిషయమే’ బాధపడకూడదు అనిపిస్తుంది. ఏడవాలనిపించినా... ‘అలా చేస్తే ఏమనుకుంటారో?’ ‘బలహీనంగా కనిపిస్తానేమో?’ అని ఏడుపును మనసులోనే నొక్కేసుకుంటారు. తమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేరు. భావాలను చెప్పడం నేరం అనిపిస్తుంది.2. ఒక పురుషుడు ‘I need help’ అని ఓపెన్ గా అడగలేడు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ అతనికి నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పారు. అందుకే సహాయం అడగడానికి సిగ్గనిపిస్తుంది. 3. చుట్టూ జనాలు ఉన్నా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుంది. ఇది depression, anger issues, burnout, relationship breakdowns కి నేరుగా దారి తీస్తుంది.ఇది బలం కాదు బ్రో, ఇదో కనిపించని జైలు. ఇదే మగాడు అనే మేట్రిక్స్.2. BUILDఈ మేట్రిక్స్ నుంచి బయటపడినప్పుడు పురుషుడు తనను తానే తిరిగి నిర్మించుకుంటాడు. ఒక పురుషుడు మేట్రిక్స్‌ను ప్రశ్నించే రోజే అతని అసలు వ్యక్తిత్వం పుట్టే రోజు. అప్పుడే అతను మొదటిసారి తనతో నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడతాడు.“నాకు కూడా బాధ ఉంటుంది.”“నాకు కూడా భయం ఉంటుంది.”“నాకు కూడా ప్రేమ, వినేవాళ్లు కావాలి.”అని ఒప్పుకోవడం మొదలుపెడతాడు. ఇది బలహీనత కాదు. ఇది అవగాహనా స్థాయి పెరగటం. దీనివల్ల మగాడిలో కొత్త వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది.1. Emotion Awareness: ఏం ఫీల్ అవుతున్నాను? ఎందుకు? అని ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రశ్న ఒక వ్యక్తిని బలంగా మారుస్తుంది, బలహీనంగా కాదు.2. Healthy Expression: బాధను చెప్పగలగడం అనేది మానసిక బలమని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదని గుర్తిస్తాడు. 3. Boundaries: నేను మగాణ్ని కాబట్టి ప్రతి పని నేనే చేయాలి అనే మేట్రిక్స్ నుండి బయటపడతాడు. 4. Genuine Relationships: జస్ట్ మగాడనే పాత్రను పోషించడం కాకుండా, నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వల్ల నటించే బంధాలు కాకుండా నిజమన బంధాలు మొదలవుతాయి.3. BEYONDమేట్రిక్స్ బద్దలైనప్పుడు మగాడు లిమిట్స్ దాటి వెళ్తాడు. మగతనం కొత్తరూపు తీసుకుంటుంది. ఈ కొత్త మగాడు Emotionally Intelligent. అతను మాట్లాడతాడు.అతను వింటాడు.అతను పంచుకుంటాడు.ఈ కొత్త పురుషుడు Strong + Softఅతని బలం అరవడం కాదు.అతని సున్నితత్వం బలహీనత కాదు.కొత్త మగాడు Balanced.అతను తనను తాను కోల్పోకుండా కుటుంబం, పని, సంబంధాలను నడపగలడు.కొత్త పురుషుడు Human. ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్ అన్నీ అతని భాగమే అని అంగీకరిస్తాడు.అతను మగాడనే ఒక మూసలో కాకుండా పూర్తి మనిషిగా జీవిస్తాడు.Break the ‘Man’ Matrix.Build your true self.Go Beyond your limits.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
కలహాలు వీడి.. కాపురాల ముడి
జగిత్యాలజోన్: కుటుంబ గొడవలతో ఇక కలిసి ఉండలేమని కోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాలుగు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి పెద్దరికంతో నచ్చజెప్పి.. వారికి బాసటగా నిలిచి ఏకం చేశారు. జగిత్యాల కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్‌అదాలత్.. నాలుగు జంటలను కలిపే పెళ్లి వేడుకగా మారింది. జడ్జిలు పెళ్లి పెద్దలుగా మారి అక్షింతలు వేశారు. పోలీసులు ఆశీర్వచనాలు అందించారు. తమకు పుట్టిన సంతానం సాక్షిగా.. న్యాయవాదుల చప్పట్ల మధ్య నాలుగు జంటలు దండలు మార్చుకున్నాయి. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు లావణ్య, శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోనే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.నచ్చజెప్పి కలిపారుమా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్‌స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్‌అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.– వేమల లావణ్య, మధుకొత్త జీవితం ప్రారంభిస్తున్నాంపెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్‌స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.– కొత్తూరి మానస, ప్రశాంత్ఒకరినొకరం అర్థం చేసుకున్నాంఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం– అవుదారి శీరిష–శ్రీను, దంపతులుమళ్లీ కలిసిపోయాంచిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలతచంద్రశేఖర్, దంపతులు -
నాన్నలూ అమ్మలవుతారు... కుంగిపోతారు
బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లికి డిప్రెషన్ రావడం సహజం. దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. మైక్రో ఫ్యామిలీగా ఉండటం వల్ల పెంపకం బాధ్యత ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జయిటీ ఎదుర్కొంటున్న తండ్రుల గురించి పట్టించుకోవాల్సి ఉంది.కుంగిపోతారు‘ఒక బిడ్డను పెంచడానికి ఓ ఊరంతా కావాలని’ సామెత. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో బిడ్డల పెంపకానికి వెసులుబాటు ఉండేది. బాధ్యతను అందరూ పంచుకొని బిడ్డను కంటికి రెప్పలా కాపాడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బిడ్డల పెంపకమంతా తల్లిదండ్రుల మీదే పడింది. ఈ కారణం వల్ల కొంత, భౌతిక–మానసిక మార్పుల వల్ల కొంత బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లి కుంగుబాటుకు గురవడం చాలామందికి తెలిసిందే! దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ ను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.అసలేంటీ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్?స్త్రీ జీవితంలో మాతృత్వం మధురమైన అనుభవం. ఆ సమయంలో ఆమెలో అనేక శారీరక, మానసిక మార్పులు ఏర్పడతాయి. దాంతో ఒత్తిడి, చిరాకు, యాంక్సైటీ, కోపం, కుంగుబాటు ఆమెను చుట్టుముడతాయి. బిడ్డను రోజంతా చూసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి ఉండిపోవడం వల్ల పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కి గురవుతారు. ఇది కొందరితో గర్భధారణ సమయం నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సమస్య అమ్మలకే వస్తుందనే ఆలోచన ఉండగా, ప్రస్తుతం నాన్నలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.నాన్నల్ని అర్థం చేసుకునేదెవరు?ప్రస్తుతం చాలామంది 27 దాటాక పెళ్లిళ్లు చేసుకొని 30 ఏళ్లకు తండ్రవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు కెరీర్, ఈఎంఐలు, బాధ్యతలు, ఖర్చులు, అవసరాలతో సతమతమైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిడ్డ పుట్టిన ఆనందం ఉన్నా, మెల్లగా ఆ ఆనందం స్థానంలో కొత్తగా రాబోయే ఖర్చులు, బాధ్యతలు వారిని భయపెడుతున్నాయి. బిడ్డ పుట్టాక రాత్రుళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో మగవారు సైతం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కు గురవుతన్నారు. ఉన్నట్టుండి కోపం రావడం, చిన్న విషయాలకు చిరాకు పడటం, అరవడం, ఇంటికి దూరంగా ఉండాలనుకోవడం వంటివి ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. తలనొప్పి, వాంతులు, అజీర్తి, కీళ్ల నొప్పులు సైతం వీరిని వేధిస్తాయి.మగవారికి అందాల్సిన చేయూత బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది తల్లి ఆరోగ్యంపైనే దృష్టి నిలుపుతారు. ఆమెను జాగ్రత్త చూసుకోవాలని భావిస్తుంటారు. తండ్రి పరిస్థితి ఏమిటి... అతను పడుతున్న ఇబ్బందులేమిటన్న విషయాన్ని చాలామంది పరిగణనలోకి తీసుకోరు. మగవారు కూడా తమ సమస్యల్ని బయటకు చెప్పుకునేందుకు మొహమాట పడతారు. లోలోపలే దాచుకొని సతమతమవుతారు. దీంతో వారి సమస్య మరింత పెరిగి ఒక్కోసారి ఆత్మహత్యా ప్రేరేపిత ఆలోచనల వరకూ వెళ్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తల్లితోపాటు తండ్రికీ కుటుంబ సభ్యుల చేయూత అవసరమని, వారితో మాట్లాడుతూ, వారి సమస్యల్ని విని ఓదార్పు అందించాలని అంటున్నారు. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ అందించాలంటున్నారు. -
సాంకేతికత అను..బంధం
టీవీ వచ్చి ఆడవాళ్లు .. ఇంట్లోవాళ్లకు తిండి పెట్టకుండా చేసింది.. స్మార్ట్ ఫోన్ వచ్చి.. ఇంట్లోవాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసింది.. టెక్నాలజీ మీద సంప్రదాయం చేస్తున్న కామెంటూ.. విడుస్తున్న నిట్టూర్పూనూ!అయ్యో సాంకేతికతతో సౌకర్యాలే కాదు.. సాఫల్య అనుబంధాలూ ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అనుభవాలు!జనార్థన్, రాధ (పేర్లు మార్చాం)కి కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. జనార్దన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి. రాధ గృహిణి. ఇద్దరూ డెబ్భైల్లో ఉన్నారు. బీపీతో జనార్ధన్, షుగర్, థైరాయిడ్‌తో రాధ సహజీవనం చేస్తున్నారు. ఓ మూడేళ్ల కిందటిదాకా ఇద్దరి జీవనశైలి వేరుగా ఉండేది. ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. చిన్నిపాటి వ్యాయామానిక్కూడా బద్ధకించేవారు రాధ. కూర్చున్న చోటికే ఆమెకు అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ల పనమ్మాయి. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా యూట్యూబ్‌లోనే గడిపేవారు. జనార్దన్ వాకింగ్ క్లబ్ ఫ్రెండ్స్‌తో వాకింగ్‌కి వెళ్లినా.. పార్క్‌లోని చెట్లకింద కూర్చుని కబుర్లతోనే కాలక్షేపం చేసేవారు కానీ నడిచేవారు కాదు. ఆహారం మీద అదుపు ఉండేదికాదు. అమెరికాలో ఉన్న పిల్లలు పోరగా పోరగా మెడికల్ టెస్ట్లకి వెళ్లేవారు. ఆ రిపోర్ట్స్‌లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు కనపడేవి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్లు బాధపడుతూ, విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఆందోళన కలిగించేవారు. తల్లిదండ్రుల కోసం కెరీర్‌ను వదులుకుని పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వీళ్లే అక్కడికి వెళ్లినా, అక్కడ అడ్జస్ట్ అయ్యే ముచ్చట అసలే లేదు. అమ్మా నాన్నను హెల్త్‌లైన్‌లో పెట్టడమెలాగా? వాళ్లకు ఓ యాక్టివిటీ కల్పించడమెలాగా అని పిల్లలిద్దరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు కోడలు రంగంలోకి దిగింది.ఇలా సీన్ మార్చేసింది.. ఆ అమ్మాయి వృత్తిరీత్యా బిజినెస్ ఎనలిస్ట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఇండోర్ డెకరేషన్ ఆమె ఇష్టంగా చేసే పనులు. అందుకే తన అత్తమామల జీవనశైలిని ఓ గాడిలో పెట్టేవరకు ఉద్యోగానికి సెలవుపెట్టి.. హాబీల మీద దృష్టి పెట్టింది. అలా దొరికిన సమయం, వెసులుబాటును పూర్తిగా ఇండియాలో ఉన్న ఇన్లాస్ మీదే వెచ్చించింది. అందులో భాగంగా ముందు వాళ్ల దైనందిన జీవనసరళిని పరిశిలీంచింది. వాళ్ల బాధ్యతలను చూస్తున్న కన్సల్టెంట్స్తో మాట్లాడింది. ఆ రిపోర్ట్స్, వాళ్ల లైఫ్‌స్టయిల్ గురించి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ న్యూట్రిషనిస్ట్తోనూ చర్చించింది. ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే షెడ్యూల్ చేసుకుంది. ఈ స్టడీతో ఆమె వాళ్ల దైనందిన కార్యక్రమాల టైమ్‌టేబుల్ ఒకటి తయారు చేసి వాట్సాప్‌లో పంపింది. ప్రింట్ అవుట్స్ తీసుకొమ్మని చెప్పింది. డైట్‌కి సంబంధించిన పట్టీని ఫ్రిజ్కి అతికించమంది. వ్యాయామానికి సంబంధించి డ్రెసింగ్ టేబుల్‌కి అతికించమంది. సాయంకాలం వాళ్లు చేయాల్సిన పనుల పట్టికను టీవీ కేస్కి అతికించమంది. రోజూ ఉదయాన్నే (ఇండియన్ కాలమానం ప్రకారం) అయిదింటికల్లా ఆ ఇద్దరినీ ఫోన్ చేసి నిద్రలేపేది. వాకింగ్‌కి వెళ్లమని పోరేది. వాళ్లకు కావాల్సిన సరకులు, కూరగాయలు, డాక్టర్ అపాయింట్మెంట్స్ వగైరా సమస్తం తానే చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే యాప్స్ ద్వారా తనిచ్చిన జాబితా ప్రకారం అన్నీ ఆర్డర్ చేసేది. మూడు నెలలకు ఒకసారి వాళ్లకు టూర్స్నీ ΄్లాన్ చేయడం.. టికెట్స్, అకామడేషన్ బుక్ చేయడం అన్నీ చూసేది. ప్రతివారం ఏడు రోజులకు సరిపడా వాళ్లకు సుడోకు, వర్డ్ పజిల్ లాంటి ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చేది. వీటన్నిటితో.. ఆరు నెలల గడిచేసరికి ఇద్దరిలో చాలామార్పు వచ్చింది. ఇద్దరూ చెరో రెండు కేజీల వెయిట్ తగ్గారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ కొత్త సర్కిల్ ఏర్పడింది. దాంతో ఇద్దరిలో జీవనాసక్తి, జీవనోత్సాహం పెరిగాయి. ట్రావెల్ చేయడం వల్ల ఉల్లాసంగా కనపడసాగారు. ఈ మార్పుకి ఇరుగు పొరుగు, చుట్టాలే కాదు వాళ్ల కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇంట్లో పళ్లు, కూరగాయలు, సరకులు వృథా అవట్లేదు. మురిగిపోయి చెత్త బుట్ట దాఖలు కావట్లేదు. ఎప్పటికప్పుడు తాజా వాటినే వినియోగిస్తున్నారు. కారణం.. తానిచ్చిన టైమ్‌టేబుల్ తప్పితే ఆ వారం మనవరాలితో గానీ.. తమతో గానీ ఫోన్ ఇన్ ఉండదని, తామెవరమూ మాట్లాడమని హెచ్చరించింది కోడలు. ఈ హెచ్చరిక వాళ్ల జీవనశైలిని దిద్దడమే కాదు.. తమ కుటుంబ అనుబంధాన్నీ బలపరచింది అంటారు జనార్ధన్.‘తొలుత.. చిన్నపిల్లల్లా మాతో మా కోడలు అవన్నీ చేయిస్తుంటే చిరాకు, కోపం వచ్చేవి. మా అబ్బాయికి, అమ్మాయికి కంప్లయింట్ కూడా చేశాను. మా అమ్మాయి మా కోడలితో ‘పోనీలే వదినా.. పెద్దవాళ్లయిపోయారు వాళ్ల మానాన వాళ్లను ఉండనివ్వండ’ని చెప్పింది. పెద్దవాళ్లయ్యారు కాబట్టే.. ఈ జాగ్రత్తలు. ఒక్క ఏడాది ఓపికపట్టండి.. నా మీద నమ్మకం ఉంచండి’ అని అందరికీ చెప్పింది మా కోడలు. ఏడాది కాదు.. ఆర్నెలు తిరిగేసరికే మా కోడలు కోరుకున్నదేంటో మాకు తెలిసింది. ఆ మార్పు మా ఆరోగ్యాన్నే కాదు మా కుటుంబ బంధాలనూ గట్టిపరిచింది’ అంటారు రాధ. తాను చేసిన ఈ ప్రయోగం తన అత్తమామల ఆరోగ్యాన్ని మెరుగుపరచేసరికి దాన్ని వాళ్ల అమ్మకూ అప్లయ్ చేసింది. అంతేకాదు రాధ వాళ్లమ్మాయి తన అత్తమామల విషయంలోనూ ఆ ఎక్స్‌పరిమెంట్‌ను అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది.విదేశాలలో ఉన్నా కూడా...విదేశాల్లో ఉన్న చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు, ఇన్ లాస్ ఆరోగ్యం విషయంలో డాక్టర్ల అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ట్రావెల్ ΄్లాన్ చేయడం, మందులు, నిత్యావసర సరుకులు ఆర్డర్ పెట్టడం పరిపాటే. కానీ ఇలా ఫిజీషియన్ ఇచ్చిన రిపోర్ట్స్‌ను సైకియాట్రి, సైకాలజీ నిపుణులు, ΄ûష్టికాహార నిపుణులతో చర్చించి.. భవిష్యత్‌లో రానున్న రిస్క్‌లను నియంత్రించడానికి చేయాల్సిన పనులతో పెద్దవాళ్లకు ఓ ఎక్సర్సైజ్లాంటిది ఇచ్చి.. అందులో వాళ్లను తలమునకలు చేయడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆరోగ్యకరమైన ప్రయోగం కూడా. దీంతో పెద్దలు రోజుకు సరిపడా కావల్సినంత యాక్టివిటీలో ఉండి.. పిల్లలు దగ్గరలేరన్న బెంగకు గురికాకుండా మానసిక ఉల్లాసాన్ని పెం పొందించుకున్నారు. అలాగే గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. ఆ గాడ్జెట్.. వాట్సాప్ నెట్‌వర్క్‌తోనే తన ఇన్లాస్, పేరెంట్స్‌కి దగ్గరై.. లాంగ్ డిస్టెన్స్‌లో కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పింది.గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. -
దేశంలో మగాడికి కష్టమొచ్చింది!
హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్‌లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడుఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.1. కుటుంబ సంబంధాల ఒత్తిడిఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.2. మానసిక సమస్యలపై మౌనంమగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.3. ఆర్థిక ఒత్తిళ్లు... కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.4. చట్టపరమైన ఒత్తిళ్లు...మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.5. మత్తు పదార్థాలు... చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.6. ఒంటరితనం... మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్‌తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.గణాంకాలు చెబుతున్నది ఏమిటి?• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. • వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.పరిష్కార దిశలు1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.2. కౌన్సెలింగ్‌ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి. 4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. 5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com -
E–ఈక్వల్ M–మ్యారేజ్ I–ఇన్స్టాల్మెంట్
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసిచూడు.. అని సామెత. రెండూ జటిలమైనవేనని అర్థం. ఇంటి కోసం అప్పు చేసినా తప్పు లేదు. అదొక నీడగా మిగులుతుంది. కానీ పెళ్లి? కం పాటబులిటీ కుదిరితే కుటుంబంగా స్థిరపడుతుంది. లేదంటే చేదుజ్ఞాపకంగా వెంటాడుతుంది. అయినా అంతా బాగుంటుందనే ఆశతో ఏడడుగుల ప్రయాణానికి సిద్ధపడినా.. దానికోసం లక్షలకు లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఉందా అని! ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరే పెట్టుకుంటున్నారు. అది వాళ్లిద్దరి జీవితాలకు తీరని రుణంగా పరిణమించి.. ఈఎమ్ఐల రూపంలో జీతాలనే మింగేస్తోంది. దాని గురించే ఈ కథనం..సాత్విక్‌ది మార్కెటింగ్ జాబ్, మానస ఒక కార్పొరేట్ కంపెనీలో లీడ్ రోల్లో ఉంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా, డెస్టినేషన్ వెడ్డింగ్. దాదాపు 80 లక్షల రూ పాయలకు పైనే ఖర్చయింది. ఆ భారం ఇరువైపుల తల్లిదండ్రుల మీద పడకుండా వీళ్లిద్దరే షేర్ చేసుకున్నారు. సేవింగ్స్ నుంచేనా ఖర్చు చేసింది అని అడిగితే.. ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్, ఎయిటీ పర్సెంట్ లోన్ అనే చెప్పారు ముక్తకంఠంతో. పెళ్లయి మూడేళ్లవుతోంది. ఆ ఖర్చుకు ఇంకా ఈఎమ్ఐ చెలిస్తునే ఉన్నారు. ఆ లోన్ తీరేదాకా పిల్లలు వద్దు అనుకుంటున్నారట. ఆ మాటతో మానస వాళ్ల మామ్మ హతాశురాలైంది. ఇదెక్కడి చోద్యమంటూ విచారపడింది.సర్వేలే సాక్ష్యం‘ఇండియా లెండ్స్’ చేసిన సర్వే మేరకు సొంత ఖర్చుతోనే పెళ్లిచేసుకోవాలనుకుంటున్న 26 శాతం అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆ ఖర్చును పర్సనల్ లోన్‌తో భర్తీ చేసుకుంటున్నార ట. వాళ్లలో చాలామంది పెళ్లికి సంబంధించి ఒక్క ఈవెంట్‌కే రూ. లక్ష నుంచి రూ. అయిదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని మీదే వెడ్డింగ్‌వైర్ ఇండియా అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఒక్క నిరుడే మన దేశంలో పెళ్లి ఖర్చు అమాంతం రూ. 29.6 లక్షలకు చేరినట్టు తేలింది. పెళ్లి జంటల్లోని మూడోవంతు జంటలు తమ పెళ్లికి రూ. 30 లక్షలకు పైనే వెచ్చిస్తుంటే మిగిలిన జంటలు రూ. 50 లక్షలకు పైగా ఖర్చుపెడుతున్నారని ఆ సర్వే నివేదిక.అప్పులు బారెడు... జీతం మూరెడుగానే! డబ్బు ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కూడబెట్టడమే బహు కష్టం. రూ. లక్ష సమకూర్చుకోవడానిక్కూడా కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మూడు లేదా అయిదురోజుల పెళ్లిలోని ఒక్కో వేడుకకు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల దాకా పెట్టే ఖర్చు జీవితానికి ఎంత భారమవుతుందో తెలుసా! ఆ అప్పు తీర్చడానికి ఆ జంటలు.. అప్పుడే పిల్లల్ని వద్దనుకోవడం దగ్గర్నుంచి ఇల్లు, ఇతర స్థిర, చరాస్తులను సమకూర్చుకోవడం దాకా అన్నిటినీ వాయిదా వేసుకుంటున్నారు. అ పార్ట్మెంట్ డౌన్పేమెంట్కి పనికొచ్చే డబ్బును, భవిష్యత్ ప్రణాళికలను.. ఆఖరకు ఇన్సూరెన్స్ పాలసీలను సైతం బ్రేక్ చేసి మరీ పెళ్లి బట్టలు, ఈవెంట్ డెకరేషన్ కోసం చేసిన అప్పు తీరుస్తున్న జంటలున్నాయి. ఇలా ఆ లోన్ వాళ్ల పెళ్లిని మధుర జ్ఞాపకంగా మలచకపోగా సంసారాన్ని చింతల చితిగా మారుస్తోంది.క్రైసిస్‌లో కాపురాలుదరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్‌ను బట్టి వెడ్డింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఏడాదికి పది నుంచి 24 శాతం దాకా మంజూరవుతున్నాయట. వీటికి కట్టలేకుండా పేరుకుపోయిన ఈఎమ్ఐల వడ్డీ వచ్చి చేరి.. ఎంత జీతం వచ్చినా, అత్యవసరాలకే ఎసరు వస్తోంది. ఈ క్రైసిన్ కాపురంలో కలతలను రేపుతోందంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. పెరుగుతున్న రుణభారాన్ని తీర్చడానికి ఓవర్ టైమ్, పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెదుక్కుంటున్న జంటలూ ఉన్నాయి. నెల తిరిగేసరికల్లా వచ్చే ఈ ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక భార్యాభర్తల డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ కలహాలతో ముగుస్తున్నాయి. ఎడమొహం పెడమొహంగా ఉదయాలు మొదలవుతున్నాయి.అప్పు తప్పు కాదు కానీ.. లోన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఎందుకు తీసుకుంటున్నాం.. దేనిమీద ఖర్చు పెడుతున్నామనే ఎరుక, స్పష్టత చాలా అవసరం అంటున్నారు ఆర్థికవిశ్లేషకులు. ఇల్లు కట్టుకోవడానికో, వ్యా పారం ప్రారంభించడానికో, మెరుగైన ఉ పాధి అవకాశాలను కల్పించే చదువుకోసమో అప్పు చేయడం సబబే. కానీ.. పైసా రాబడి లేనిచోట అప్పు చేసి మరీ డబ్బును వెదజల్లడం తెలివైన నిర్ణయం కాదని చెబుతున్నారు. పరస్పర గౌరవ మర్యాదలు, సర్దుబాట్లు, ప్రేమాభిమానాలతో పెళ్లి చేసుకోవాలి. మంచి కుటుంబంగా స్థిరపడాలి. కానీ ఆడంబరాల వేడుకగా.. ఫొటోలు, వీడియోలతో కనిపించే అప్పుగా కాదని సూస్తున్నారు ఆర్థికనిపుణులు, విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు. కలలు సాకారమవ్వాల్సిందే! మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాల్సిందే! కానీ ఈ రెంటికి మూల్యం మన జీవితం కాకూడదు! అప్పుడే సాకారమైన కలలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన మ్యారేజ్ ఇండస్ట్రీ ఏటా కోటి పెళ్లిళ్లతో 10.79 లక్షల కోట్ల టర్నోవర్‌గా పురోగమిస్తోంది. ఫుడ్ అండ్ గ్రాసరీ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధాన, ప్రభావవంతమైన ఇండస్ట్రీగా విరాజిల్లుతోంది. -
ఈ బామ్మ రోజూ జైలుకు!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!‘చాలా మంది ఉదయం ఆలయానికి వెళ్లినట్లే నేనూ జైలుకు వెళుతుంటాను’ నవ్వుతూ అంటుంది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన అరుణ. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అరుణ విపశ్యన ధ్యానప్రక్రియను సాధన చేసేది. ఆ సమయంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కోర్సులకు సంబంధించి కరపత్రం ఒకటి చదివింది. ఆ కోర్సులు నేర్చుకోవడానికి రెడీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాంపస్‌లో ఎన్నో కోర్సులు నేర్చుకుంది. ఆ తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.‘తొలిసారిగా జైలుకు వెళ్లినప్పుడు భయంగా ఏమీ అనిపించలేదు. జైలులో ఎలా ఉంటుందో ఆసక్తికరంగా పరిశీలించాను. ఖైదీలతో వివరంగా మాట్లాడాను. వారితో కలిసి భోజనం చేశాను. ప్రతి నిమిషం హాయిగా గడిచినట్లు అనిపించింది. యోగా, «ధ్యానం ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది అరుణ.ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం జైలులో నాలుగు గంటల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తోంది. జబల్పూర్ మాత్రమే కాదు ఇండోర్, సాత్న, భోపాల్‌లతో పాటు మధ్యప్రదేశ్‌లోని పది కారాగారాలలో యోగా సెషన్లు నిర్వహిస్తోంది.‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ పేరుతో తాను నిర్వహించే కార్యక్రమాల వల్ల ఖైదీల ఆలోచనా ధోరణిలో మార్పు రావడాన్ని ఆమె గ్రహించింది. చాలామంది ఖైదీలు ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహలతో కనిపించేవారు. అలాంటి వారికి జీవనోత్సాహాన్ని కలిగించడంలో ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ ప్రభావం ఎంతోఉంది.‘కోర్స్ పూర్తి చేసుకున్న ఖైదీలలో ఎంతో మార్పు వచ్చింది. తగాదాలు తగ్గాయి. కొద్దిమంది ఖైదీలలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపంలో బ్లేడ్‌తో కోసుకొని తమకు తాము హాని చేసుకునేవారు. అలాంటి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది’ అంటుంది అరుణ. గతంలో కొందరు ఖైదీలు జైలు నుంచి పారి΄ోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వారిలో కూడా ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ మార్పు తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లాడు రాజు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ అదే అక్రమ వ్యాపారం చేయాలనుకునేవాడు. అయితే అరుణ నిర్వహించే హ్యాపీనెస్’ కార్యక్రమంతో అతడిలో మార్పు వచ్చింది.జైలు నుంచి విడులైన రాజు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. స్థూలంగా ‘హ్యాపీనెస్ ప్రోగ్రాం’ ద్వారా ఖైదీలకు యోగా, ధ్యానం మాత్రమే పరిచయం కాలేదు. ఉత్సాహంతో కూడిన కొత్త జీవన విధానం పరిచయం అయింది. జైలు బయట రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది అరుణ. మద్యం బారిన పడిన ఎంతోమందిని ఆ దురలవాట్ల నుంచి బయటకు తీసుకువచ్చింది. ‘జైలులో నిర్వహించే హ్యాపీనెస్ ప్రోగ్రాం వల్ల ఖైదీలలో క్రమశిక్షణ పెరిగింది’ అంటున్నాడు జబల్పూర్ సెంట్రల్ జైలు సూపరిండెంట్ అఖిలేష్ తోమర్. -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుందా?
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?– ఒక సోదరి, ఖమ్మం జిల్లాబహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది. దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్ని కలవడం అవసరం. -
నాన్నా... నువ్వెక్కడ?
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్‌కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..1987...హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్‌లో తోటమాలి. అతనికి అబిడ్స్‌లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్ బి. రాజ్‌కుమార్‌తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్కుమార్దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్‌కుమార్‌తో పెళ్లి చేయాలనుకుని రాజ్‌కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్‌కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్‌కుమార్‌తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్‌కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్‌కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్‌కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.1988...సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్‌గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్‌లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్‌లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.2025...జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్‌రావ్ పవార్‌ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్‌కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో. ‘వరంగల్‌లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’ సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.– సరస్వతి రమ– ఫొటోలు: గడిగె బాలస్వామి -
ఈ వారం కథ: పరోపకారార్థం ఇదం శరీరం
‘‘అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది’’ సొంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తర్వాత ఊళ్లో ఉన్న అన్న విశ్వనాథ్‌కి తీరిగ్గా ఫోన్ చేశాడు తమ్ముడు శంకరం.‘‘నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్ని ఇవ్వరట. చంద్రం డబ్బు కోసం వెళ్లాడు’’ నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాథ్.‘‘ఓ నిన్ననే వచ్చావా? చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?’’ ఆతృతగా అడిగాడు శంకరం.‘‘అడిగాడు. అవసరానికి నేనేమీ సర్దలేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట. అప్పో సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతులతో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు’’ బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.‘‘అన్నయ్యా! వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను’’ అన్నాడు శంకరం కఠినంగా.‘‘అవేం మాటలురా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయం చేసిన బాబాయి కుటుంబానికి...’’ తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.‘‘నీదంతా అమాయకత్వం. నేనన్న దాంట్లో తప్పేముంది? అందరినీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు. అటు ఉద్యోగం, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?’’ తమ్ముడి మాటల్లో ఈర్షా్య ద్వేషాలు విశ్వనాథ్‌ని కలవరపెట్టాయి.‘‘ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేకపోయాము. ఇక ఆ విషయం వదిలెయ్’’ అసహనంగా అన్నాడు విశ్వనాథ్.‘‘అయినా నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి? అయినాదానికి, కానిదానికి అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా!’’ అన్నని రెట్టించి దెప్పుతూ అన్నాడు శంకరం.తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.‘‘సరేలే! ఈ వాదులాట మనకెప్పుడూ ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు. నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు’’ నిష్ఠూరమాడాడు శంకరం.‘‘బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను’’ సంజాయిషీ ఇచ్చాడు విశ్వనాథ్.‘‘ఏం వాడింట్లో మనుషులేమయ్యారు? అన్నీ నాటకాలు..’’ ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి, ‘రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి’ అని చెప్పి వెళ్లింది. తమ్ముడి ఫోన్ కట్ చేసి లోనికి వెళ్లాడు విశ్వనాథ్.‘‘డబ్బు కట్టి రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్లండి. బాడీ ఎంబామ్ అవుతోంది’’ అంటూ తొందరపెట్టింది సిస్టర్.‘‘ఎంబామ్ అవుతోందా? అంటే?’’ ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘ఏం లేదు! బాడీని రెడీ చేస్తున్నాం’’ అని వివరం చెప్పకుండా లోనికి వెళ్లింది నర్సు.చంద్రం సాయంకాలం ఆరుగంటలకు వచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాథ్ బాడీతో అంబులెన్సులో చంద్రం ఇంటికి బయలుదేరారు.మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా శ్మశానం వీడి వెళుతున్నారు. స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓ మూల బెంచీ మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్.‘‘శంకరం ఇంటికి వెళుతున్నావుగా! కర్మలకు రా అన్నా!’’ అని చెప్పి వెళ్లాడు చంద్రం.‘‘పద! ఇక మనం కూడా వెళదాం’’ అన్నాడు శంకరం అన్న దగ్గరకొచ్చి.ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని, ‘‘ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి’’ శ్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.అదే సమయానికి వారి పక్కనుంచి మహాప్రస్థానం వ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ వెళ్లింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ శ్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్‌కి వచ్చారు. అదే సమయానికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు శంకరం.తిరిగి వస్తూనే, ‘‘అన్నయ్యా! మీ మరదలు ఫోన్ చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. శ్మశానం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లాలట. నీకు తెలిసే ఉంటుంది. అందుకే నువ్వు సరాసరి ఊరికి వెళ్లు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు’’ అని పక్కన నిలబడి, పాసింజర్ కోసం తమనే గమనిస్తున్న ఆటోను పిలిచాడు శంకరం.‘‘సార్‌ని బస్టాండ్‌లో దింపు’’ అని ఆటో డ్రైవర్‌కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకరం నిర్దయగా.తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్థమయ్యీ కాక క్షణంపాటు తొట్రుపాటుకు లోనయ్యాడు విశ్వనాథ్.తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్థమైంది.‘అవును వాడన్నది నిజమే! కొందరికి ఇలాంటి పట్టింపులు ఉంటాయి. అయినా సొంత అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆంక్షలా?’ విరుద్ధ ఆలోచనలతో విశ్వనాథ్ మనసు కళ్లెంలేని గుర్రంలా పరుగెట్టింది. అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొకటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.తెచ్చుకున్న డబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్సు టికెట్‌కి కూడా సరిపడా డబ్బులు లేవు. ఎవర్ని అడగాలి? దిక్కుతోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుగు పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతోందో, తనెక్కడ ఉన్నాడో సైతం అర్థం కావడంలేదు అతనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో.. ఏదో.. అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.‘‘ఏ బస్టాండ్‌కి వెళ్లాలి సార్?’’ అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటి మాటకు సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాథ్.జేబులో మిగిలి ఉన్న ఒక్క యాభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ మళ్లీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాథ్‌ని పరికించి చూస్తూ.‘‘ఆటో వద్దు, డబ్బుల్లేవు..’’ అతని నోటి మాటలు ముద్దగా వచ్చాయి.‘‘గూగుల్ పే ఉంది సార్!’’‘‘నాకు లేదు. బస్టాండ్‌కి దారి చెప్పు. నడిచి వెళతాను’’ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని అంటూనే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయాడు విశ్వనాథ్.ఆటో అతను కంగారుపడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాథ్‌ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి, విశ్వనాథ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ, ‘‘సార్.. సార్!’’ అంటూ తట్టి లేపే ప్రయత్నం చేశాడు.రెండు మూడు నిమిషాల తర్వాత కొద్ది తెలివి వచ్చి, మగతగా కళ్లు తెరిచాడు విశ్వనాథ్.విశ్వనాథ్ వీపు చుట్టూ చేయి వేసి, కూర్చోవడానికి సాయం చేసి, వాటర్ బాటిల్ అందించి, ‘‘కాసిని నీళ్లు తాగండి సార్’’ అన్నాడు ఆటో డ్రైవర్.నీళ్లు తాగి, ‘‘నాకేమైంది?’’ పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘మీరు స్పృహతప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు.. మీ ఫోను, యాభై రూపాయల నోటు కింద పడ్డాయి’’ అని వాటిని, బట్టలున్న బ్యాగును విశ్వనాథ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.ఆ నోటును అతనికే తిరిగి ఇచ్చి, తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాథ్.అతను పరుగున వెళ్లి, పక్కనే ఉన్న పాన్‌షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి, ‘‘ఇవి తినండి! మీ సుగర్ లెవల్ పడిపోయినట్లుంది’’ అని పక్కనే ఉన్న పళ్ల బండి మీద నుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు.నీళ్లు తాగి, నాలుగు బిస్కట్లు, అరటిపండు తిని, రెండో పండు బ్యాగులో వేసుకుని,‘‘చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది’’ అని లేచి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్లినతను ఎవరు?’’ అడిగాడు ఆటో డ్రైవర్.‘‘నా తమ్ముడు’’ అన్నాడు విశ్వనాథ్.‘‘సొంత తమ్ముడా? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీదా ఊరికి పొమ్మన్నడు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.మౌనంగా లేచి నిలబడి, ‘‘నేను వెళతాను’’ అన్నాడు విశ్వనాథ్.‘‘ఎలా వెళతారు? డబ్బులు లేవన్నారు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.‘‘నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోన్ చార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా తప్పక సాయం చేస్తాడు’’ అన్నాడు విశ్వనాథ్ ఆకాళంలోకి చూస్తూ.‘‘అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలో లేవు. నిన్ను బస్టాండులో దింపి వెళతాను’’ అని విశ్వనాథ్ భుజం చుట్టూ చేయి వేసి, ఆటో దగ్గరికి నడిచాడు అతను.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు విశ్వనాథ్.‘‘శంకర్’’‘‘ఓ.. నీది నా తమ్ముడి పేరే’’‘‘తమ్ముళ్లందరూ ఒకేలా ఉండరన్నా’’‘‘ఎందుకలా అన్నావు?’’‘‘మీకు తెల్వదా?.. ఇంతకీ ఏ ఊరెళ్లాలి?’’ మాట మారుస్తూ అడిగాడు శంకర్.‘‘కోదాడ వెళ్లాలి.. శంకర్! నువ్వు నా ఫోన్ తీసుకో. నాకు బస్సు చార్జి మందం మూడువందలు ఇవ్వు. ఫోను ఖరీదు పదిహేను వందలు ఉంటుంది’’ అన్నాడు విశ్వనాథ్.‘‘తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు ఎట్టా ఎవరికి ఎవరితో వస్తుందో ఎవరికి ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు’’ అన్నాడు ఆటో శంకర్.ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోను ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాథ్‌ని క్యాంటీన్‌కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కించాడు.‘‘శంకర్! నీ ఫోన్ నంబరు ఒక చిట్టీ మీద రాసివ్వు. ఊరికెళ్లగానే డబ్బు పంపిస్తాను. నువ్వు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటాను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే! మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను’’ నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.చిట్టీ మీద తన ఫోన్ నంబరు రాసి ఇస్తూ, ‘‘అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్‌కి చెప్పి, నా ఫోన్ నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది, నీ తమ్ముడి ఫోన్ నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా’’ అడిగాడు ఆటో శంకర్.ఫోన్ నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోట్ చేసుకుని, ‘‘ఇంటికి చేరగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట’’ అని చెప్పి బయటకు వచ్చి, బస్టాండులోని పబ్లిక్ ఫోన్ నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోన్ చేశాడు ఆటో శంకర్.‘‘హలో! సంకరం గారేనా మాట్లాడేది?’’ అన్నాడు ఆటో శంకర్.‘‘నా పేరు శంకరం.. సంకరం కాదు’’‘‘సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్‌పేట శ్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహ తప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివరి ఫోన్ చేసిండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆయన నీకు చుట్టమో పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాళ్లొచ్చి ఆయన్ని తీసుకుపోయిన్రు. ఏ హాస్పిటల్‌కి తీసుకుపోయిన్రో నాకు తెల్వదు. ఆ మనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన, గంతే!’’ అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.అన్న విశ్వనాథ్‌కి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ పనిచేయడం లేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.‘‘రమా! అన్నయ్య శ్మశానం దగ్గర స్పృహతప్పి పడిపోయాడట! అంబులెన్స్ వాళ్లు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పనిచేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి?’’ అని తల పట్టుకుని బాధపడుతూ వెంటనే బయలుదేరాడు.అమీర్‌పేట చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులన్నీ మూడుగంటల పాటు వెదికాడు.గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్లీ అన్నకి ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడం లేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.ఊళ్లో వదినకు ఫోన్ చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి కంగారు ఇంకా ఎక్కువైంది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలైంది.ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్‌లైన్ నుంచి ఫోను.‘‘శంకరం! ఇప్పుడే కోదాడ బస్సు దిగి, నువ్వు కంగారు పడుతున్నావేమోనని బస్టాండు నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నీరసంతో కళ్లు తిరిగి కూలబడ్డాను. ఎవరో ఆటో అతను.. అతని పేరు కూడా శంకరమే! సొంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్సు ఎక్కించి వెళ్లాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్! -
ఓల్డ్ is గోల్డ్: కొత్త తరానికి వారధులు
వయసైపోయి, శక్తి ఉడిగిందని గ్రాండ్ పేరెంట్స్‌ని చులకనగా చూడకండి. ఈ యుగపు వేగంతో నత్త వారసులేం పోటీపడగలరు అనుకోకండి. వాట్సాప్‌లు, స్నాప్‌చాట్‌లు, ట్విటర్లు, ఇన్‌స్టా హ్యాండిల్స్‌లో వాళ్లు యమ యాక్టివ్. ఫేస్‌టైమ్.. స్కైపుల్లో భలే షార్ప్. షాట్స్, రీల్స్‌లో సూపర్ ఫాస్ట్. జెన్ జీ జార్గాన్నూ జీర్ణించుకుంటున్నారు. ఆధ్యాత్మికతనూ ఆస్వాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ పట్లా అవగాహనతో ఉంటున్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్కీ రెడీ అవుతున్నారు. ఇంటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ దాకా కావల్సినంత ఇన్ఫో ఇస్తున్నారు. అన్నింటిలోనూ గ్రాండ్‌నెస్‌ను చవిచూపిస్తున్న వాళ్లే గ్రాండ్ పేరెంట్స్. వారితో కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతోనే ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ సెలబ్రేషన్ మొదలైంది.ఆకాశంలోని చుక్కల్ని పరిచయం చేయడం దగ్గర్నుంచి కథలతో ఊహలను ఉసిగొల్పడం వరకు మన జీవితాల్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పోషించిన పాత్రను వర్ణించగలమా? అందుకు వాళ్లు నేర్పిన మాటలతోపాటు మనం నేర్చుకున్న భాషల్లోని వొకాబులరీని అరువు తెచ్చుకున్నా సరిపోదు. రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని, భాగవతంలోని కృష్ణుడి లీలలను, భారతంలోని యుద్ధనీతిని.. పురాణ స్త్రీల ఔన్నత్యాన్ని, చరిత్రలోని పరాక్రమాన్ని.. వెండితెర అద్భుతాలను తమదైన బాణి, వాణితో బుజ్జి మెదళ్లలో నింపే గుర్తులు మరుపుకొచ్చేవా! ఆ కాలానికీ ఈ కాలానికీ వారధులైన గ్రాండ్‌పేరెంట్స్ మనల్ని నడిపించే గురువులు. బడులు బోధించలేని ఎన్నో పాఠాలను వాళ్ల అనుభవ జ్ఞానం బోధిస్తుంది. అందుకే.. ముసలాళ్లని వాళ్లను మూలకు తోసేయొద్దు. మనకన్నా ముందు ప్రపంచాన్ని చూసినవాళ్లని.. ఔపోసనపట్టిన పెద్దవాళ్లని గౌరవిద్దాం. రోజూ కుదరకపోయినా.. వారాంతాల్లోనైనా వాళ్లతో కాస్త సమయాన్ని వెచ్చిద్దాం. కనీసం గ్రాండ్‌పేరెంట్స్ డే అయినా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం! హ్యాపీ గ్రాండ్‌పేరెంట్స్ డే!మెరియన్ మెక్వేడ్ అనే గృహిణి.. పెద్దలను గౌరవించాలని, వారి అనుభవజ్ఞానానికి విలువివ్వాలని.. దాన్నో సంస్కృతిగా మార్చాలనే తలంపుతో గ్రాండ్‌పేరెంట్స్ డే అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసి.. దాన్నో వేడుకగా మలచింది. అప్పటి నుంచి ప్రపంచంలోని పలు దేశాలు వాళ్లకు అనువైన నెలల్లో ఈ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించుకుంటున్నాయి. అలా మనం ప్రతి ఏడు సెప్టెంబర్లోని మొదటి ఆదివారం నాడు గ్రాండ్‌పేరెంట్స్ డేని జరుపుకుంటున్నాం!ఈరోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం మా తాతయ్యే (పీవీ గోపాలన్). చదువు దగ్గర్నుంచి మహిళా హక్కులు, ప్రజా సేవ వరకు నా మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆయన చాలా ప్రొగ్రెసివ్. అమ్మాయిల చదువుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎన్నో విషయాలను తాతయ్య దగ్గరే నేర్చుకున్నాను. – కమలా హ్యారిస్మా నాన్న, చిన్నాన్న యాక్టర్స్ అయినా నాతోపాటు అక్క (కరిష్మా కపూర్), తమ్ముడు (రిషీ కపూర్) అందరం ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ అయింది మాత్రం మా తాతగారు రాజ్‌కపూర్ వల్లనే! ఫ్యామిలీ యూనిటీ నుంచి సినిమాల దాకా చాలా విషయాల్లో ఆయన చెప్పిన మాటలు, చూపిన దారినే అనుసరిస్తాం! – కరీనా కపూర్క్రమశిక్షణ, బాధ్యత వంటి విషయాలను మా తాతయ్య (లెఫ్టినెంట్ కల్నల్ రామేశ్వర్‌నాథ్ డియోల్) నుంచే నేర్చుకున్నాను. ఏ పని చేసినా నిబద్ధత ముఖ్యమనే ఆయన మాటలనే జీవన విలువగా పాటిస్తున్నాను. – అభయ్ డియోల్ -
పొద్దున మూడింటిదాకా పబ్జీ.. పెళ్లయిన నెలకే విరక్తి చెందిన భార్య
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్మెంట్ షూట్. బ్యాచ్‌లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వరి్ణంచడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది.విడగొడుతున్న ‘సెల్’ భూతం దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్‌ఫోన్‌గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు. సర్దుకుంటున్న వాళ్లు చాలా తక్కువ.. విడాకుల కోసం న్యాయస్థానం మెట్లకెక్కుతున్న జంటలకు మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఈ మధ్య ఒకటి గమనించాం. దంపతులు సర్దుకోవడం, మళ్లీ కలిసి ఉండడం అనే ప్రస్తావనను ఏమాత్రం ఒప్పుకోనంటున్నారు. ఆర్థిక స్తిరత్వం ఉన్నవాళ్లు అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడడంలేదు. మారుతున్న తరాలకు మధ్య స్వేచ్ఛ, ఒంటరితనం, నచ్చినట్టు బతకడం, భర్త–భార్య ఒకరినొకరు ప్రశ్నించకుండా ఉండాలనుకోవడం లాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. – చక్రవర్తిరెడ్డి, న్యాయవాది, చిత్తూరు చట్టపరంగానే.. వివాహ బంధం గొప్పదే. కానీ ఒకరిపై ఒకరికి తప్పకుండా గౌ రవం, నమ్మకం ఉండాలి. అవిలేకుండా చాలా మంది విడిపోవడానికి మొగ్గు చూపిస్తున్నా రు. ఇంట్లో గొడవ అని వచ్చే దంపతులకు మంచీ– చెడు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక కలిసి ఉండలేము, కేసులు పెట్టండి అని కొందరు వస్తుంటారు. మెయింటెనన్స్, భరణం కోసం వచ్చేవాళ్లకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
మీదే రకం పర్సనాలిటీ బాస్?!
‘‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి’’ అనే శ్లోకం అందరికీ తెలుసు. అలాగే ఉత్తమ పురుషుడెవరనే అంశంపై ప్రాచీనకాలంనుంచి ఇటీవలి కాలం వరకూ అనేకానేక కల్పనలు, సిద్ధాంతాలు వచ్చాయి. కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయా తు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః.. అని కామందక నీతిశాస్త్రంలో చెప్పారు. పనిలో యోగిలా, కార్యనిర్వహణలో నిపుణుడిలా, రూపంలో కృష్ణుడిలా, క్షమలో రామునిలా, భోజనంలో తృప్తిగా, సుఖదుఃఖాలలో స్నేహంగా ఉండాలని దాని అర్థం. అలాగే ‘ఆధునిక పురుషుడు ఎవరు?’ అనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. కొందరు కుటుంబాన్ని ముందుంచుతారు, ఇంకొందరు సంపద కోసం పరుగులు పెడతారు, మరికొందరు ఇతరుల ఆనందం కోసం జీవిస్తారు, మరొకరు ప్రశాంతత కోరుకుంటారు. ఇవన్నీ ఒకే మనిషి వ్యక్తిత్వానికి వేర్వేరు రంగులు. అలాగే ప్రొవైడర్, హస్ట్లర్, ప్లేబాయ్, ఫిలాసఫర్, రెబెల్, మాంక్ అనే ఆరు వ్యక్తిత్వాలు పాప్ సైకాలజీలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. అలాగని ఇవేం ఊహాజనిత ట్యాగులు కాదు. వీటి వెనుక సైకాలజీ, కల్చరల్ ప్రభావం, పాప్ సైకాలజీ ఉన్నాయి. The Provider: కుటుంబాన్ని ముందుంచడం, బాధ్యతను విలువగా చూడడం, కష్టపడటం ద్వారా సంతృప్తి పొందడం వీరి లక్షణం. బిగ్ ఫైవ్ పర్సనాలిటీ సిద్ధాంతంలోని Conscientiousness ఎక్కువగా ఉండే వ్యక్తులు ఈ వర్గంలో ఉంటారు. వీరు స్థిరత్వం, సెక్యూరిటీని ముఖ్యంగా చూస్తారు. అయితే తన అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల అప్పుడప్పుడూ బర్నవుట్ అవుతారు. ‘నా జీవితం ఇతరుల కోసమేనా?’ అని బాధపడతారు.The Hustler: సక్సెసంటే పిచ్చి, నిరంతరం లక్ష్యాల వెంబడి పరుగులు, ఎంట్రప్రెన్యూరియల్ డ్రైవ్ వీరి లక్షణాలు. వీరికి Achievement Motivation ఎక్కువ. ప్రఖ్యాత సైకాలజిస్ట్ Erik Erikson చెప్పిన Industry vs. Inferiority దశను వీరు అత్యంత శక్తివంతంగా అధిగమిస్తారు. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మిస్సవుతుంది. సక్సెస్ ఉన్నా లోపల ఒంటరితనం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.The Playboy: అందం, ఆనందం, ఆకర్షణ, స్టేటస్, రొమాన్స్ వీరి లక్షణాలు, లక్ష్యాలు. అందుకే గాఢమైన బంధాలకు దూరంగా ఉంటారు. వీరిలో Extraversion స్కోర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే Instant gratification, novelty-seeking బిహేవియర్ కూడా. అయితే బయటకు చార్మింగ్‌గా ఉన్నా, లోపల కమిట్మెంట్ అంటే భయం ఉంటుంది. అందుకే అటాచ్మెంట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంలో శూన్యత అనుభవిస్తారు.The Philosopher: లోతైన ఆలోచన, సత్యాన్వేషణ, మానసిక/ఆధ్యాత్మిక ఎదుగుదల వీరి లక్షణాలు. Openness to Experience ఎక్కువ. Jungian archetypesలో The Sageకు దగ్గరగా ఉంటారు. అయితే ఆచరణలో కొన్నిసార్లు డిటాచ్డ్గా కనిపిస్తారు. సామాజిక, ఆర్థిక వాస్తవాలతో గ్యాప్ ఏర్పడుతుంది.The Rebel: రెబెల్ అంటే తెలుసుగా. స్వేచ్ఛను అత్యంత విలువైన అంశంగా చూడటం, అందుకోసం నిబంధనలను సవాలు చేయడం వీరి లక్షణాలు. Erikson చెప్పిన Identity vs. Role Confusion దశలో ఎక్కువగా పోరాడి ఉంటారు. వీరు ప్రధానంగా Autonomyని ప్రధానంగా కోరుకుంటారు. అయితే వీరు సమాజనియమాలకు ఖాతరు చేయకపోవడం వల్ల అపార్థం చేసుకుంటారు. కానీ అంతరంగంలో వీరు అత్యంత ప్యాషనేట్.6. The Monk: డిసిప్లిన్, ఆధ్యాత్మిక దృష్టి, మినిమలిజం, స్వీయ నియంత్రణ వీరి లక్షణాలు. Maslow hierarchyలోని అత్యున్నత స్థాయి స్వీయసాక్షాత్కారాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఆ క్రమంలో భాగంగా సామాజిక సంబంధాలు, భౌతిక జీవన అవసరాల నుండి పూర్తిగా వేరుపడే ప్రమాదం ఉంది. కానీ అంతరంగ శాంతి మాత్రం గరిష్ట స్థాయిలో ఉంటుంది.జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి డయాగ్నస్టిక్ కేటగిరీలు కావు. కేవలం సామాజిక సాంస్కృతిక ఫ్రేమ్వర్కులు మాత్రమే.ఒక మనిషి ఒక్క టైప్‌లోనే ఉండిపోడు. జీవన దశలు, పరిసరాలు, లక్ష్యాలపై ఆధారపడి వేర్వేరు టైపుల లక్షణాలు బయటపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 20ల్లో ‘హస్ట్లర్’గా, 30ల్లో ‘ప్రొవైడర్’గా, 40ల్లో ‘ఫిలాసఫర్’గా మారవచ్చు.ఇవి చదివి మిమ్మల్ని మీరు లేబుల్ చేసుకోకండి. వీటిని అద్దంలా ఉపయోగించుకుని మీలో ఏది బలంగా పనిచేస్తుందో తెలుసుకోండి. మీ టైప్ మీకు శక్తినిస్తుందా లేదా పరిమితం చేస్తుందా? ఈ ఆత్మపరిశీలన మీ ఎదుగుదలకు మొదటి మెట్టు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్‌పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్‌లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
'సోలో' డేటింగ్.. సూపర్ క్లిక్...
ఇద్దరు వ్యక్తులు కలిసి డేటింగ్ కి వెళ్తే... ఆ డేట్ అధ్యంతం పరస్పరం మెప్పించుకోవాలనో ఒప్పించుకోవాలనో... ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే తాము పరస్పరం అర్ధం చేసుకోవాలి అని అనుకుంటున్న విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టి... డేటింగ్ అలా ఉంచితే జీవితం లో ప్రతీ దశ లోనూ ఎవరో ఒకరిని మెప్పించక తప్పదు.. దాంతో అది తీవ్రమైన ఒత్తిడి కి దారి తీస్తోందిమరో వైపు ప్రస్తుతం అనేకమంది వ్యక్తిగత జీవితం లో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కన్నా తమని తాము ఎక్స్ ప్రెస్ చేయడానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అయితే అది అంత సులభం గా జరిగేది కాదు.. అందుకే ఒంటరి జీవితాలు కూడా పెరుగుతున్నాయ్ ఈ నేపథ్యంలోనే సోలో డేటింగ్ అనే భావన కూడా పుంజుకుంది.అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. మి టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో అయితే "ఒంటరి డైనింగ్" (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా "సోలో ట్రావెల్ & డేటింగ్" ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా యువత, ముఖ్యంగా మెట్రో సిటీస్‌లో, వీకెండ్ సోలో డేట్స్ ని ట్రెండ్‌గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో "సెల్ఫ్ కేర్" అనే భావనకు కొత్త దిశ గా దీన్ని పేర్కొoటూన్నారు సోలో డేటింగ్... ఇలాఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు, ఒక రొమాంటిక్ పార్ట్నర్ తో వెళ్ళినట్టు మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు న ఏదైనా కాఫీ షాప్ లోనో కల్చరల్ స్పేస్ లోనో కూర్చోవడం, సినిమా, డ్రామా.. వంటివి చూడటం, ప్రకృతి మధ్యలో ట్రెక్కింగ్ చేయడం, లేదా మనసుకు నచ్చిన చోటు ఎక్కడికైనా వెళ్లడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.సోలో డేటింగ్ ప్రత్యేకత ఏమిటి?ఇంటెన్షనల్ టైమ్ అలోన్ – యాదృచ్చికంగా ఏదో ఒంటరిగా ఉండటం కాదు, ప్రణాళిక బద్దంగా నాణ్యమైన సమయం మనకోసమే సమయం కేటాయించుకోవడం.ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ – కాంప్రమైజ్ అవకుండా మనకిష్టమైనదే చేయడం.ప్రెజర్ లెస్ హ్యాపీ నెస్ – ఎవరినీ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేకుండా, మన మనసు చెప్పింది అనుసరించడం.సోలో డేటింగ్... ప్రయోజనాలుకాన్ఫిడెన్స్ పెరుగుతుంది – ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల పై ఆధారపడడం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది – సామాజిక బాధ్యతల నుండి విరామం లభిస్తుంది.సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది – నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చినది ఏంటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.స్పాంటేనియిటీ పెరుగుతుంది – ఇతరుల కోసం ఎదురు చూడకుండా కొత్త విషయాలు ప్రయత్నించే ధైర్యం వస్తుంది.సోలో డేటింగ్ కోసం...కొన్ని ఎంపికలుపార్క్లో పుస్తకంతో పిక్నిక్పెయింటింగ్ లేదా పొటరీ క్లాస్ఒంటరిగా సినిమా లేదా మ్యూజియం సందర్శనమనసుకు నచ్చిన మ్యూజిక్ తో ఒక లాంగ్ డ్రైవ్రెస్టారెంట్లో ఫ్యాన్సీ డిన్నర్...అంతర్జాతీయ ట్రెండ్స్అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. #MeTime, #SoloDate, #SelfLove అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, సోలో డేటింగ్ అనేది లొన్లీగా ఫీల్ అవ్వడం కాదు. అది మనసు నింపుకోవడం, మనల్ని మనమే ప్రేమించడం. ఒంటరి తనం ప్రాప్తించింది అంటే భాధ కలుగుతుంది కానీ ఈ ఒంటరి తనం ప్లాన్ చేసుకుంది అంటే ఏదో సాధించిన ఆనందం ఆవరిస్తుంది అంటున్నారు సైకాలాజిస్ట్స్..ఎస్. సత్యబాబు -
భార్య చనిపోయింది.. వంట మనిషిని పెళ్ళి చేసుకోవడం తప్పా..?
నాకు 62 ఏళ్లు. నేనొక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. నా భార్యకి క్యాన్సర్ ఉండేది. ఐదు సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో చనిపోయింది. పిల్లలిద్దరూ వాళ్ళ భర్తలతో వేరే దేశాలలో స్థిరపడ్డారు. నా భార్యకి సహాయం చేయడం కోసం, ఇంట్లో వంట చేయడం కోసం ఒక ఆవిడ పది సంవత్సరాల నుండి మా ఇంట్లో పని చేస్తోంది. ఆవిడ భర్త తాగుబోతు, ఆమెని వదిలేశాడు. ఆమెకు ఒక పెళ్లీడు వచ్చిన అమ్మాయి ఉంది. నా భార్య చనిపోయాక తను నాకు తోడుగా ఉంటోంది. మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. తాను నా నుంచి ఏమీ ఆశించకపోయినా, తన కూతురి పెళ్లి కోసం ఒక 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ నా పిల్లలు ఆవిడని పెళ్ళి చేసుకోవడానికి, ఆవిడకి ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకోవట్లేదు. నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండమని చెప్తున్నారు. నాకు పెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో నా అన్న వాళ్ళతో చివరిదాకా ఉండి, కన్నుమూయాలని కోరిక – పిల్లలు వచ్చి నాతో ఉండలేరు. అలా అని నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్లతో ఉంచుకోలేరు. ఈ వయసులో నాకు కావలసింది ఒక తోడు, నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. కానీ పిల్లలు మా చుట్టాలకు ఫోన్ చేసి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఈయనకి ఈ వయసులో ఇదేం పాడు ఆలోచన అని. ఈ వయసులో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం ఒక తోడు కావాలని అనుకోవడం తపా? నా పిల్లల కోసం నా ఆలోచన మార్చుకుని వృద్ధాశ్రమంలో ఉండమంటారా, నాకు సరైన సలహా ఇవ్వగలరు! – సత్యనారాయణ, హిందూపూర్ ముందుగా మీసమస్యని ధైర్యంగా మాతో పంచుకున్నందుకు అభినందనలు, బంటరితనం మనిషిని ఎంతో కుంగదీస్తుంది ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండకుండా, ఒక తోడుంటే బాగుంటుందని అనుకోవడం తప్పేం కాదు! ఓ భర్తగా, తండ్రిగా, మీ బాధ్యతలన్నీ ఏ లోటూ లేకుండా నిర్వర్తించారు.. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ పిల్లలు తమ జీవితాల్లో బిజీగా ఉండటం వల్ల వాళ్లు మిమ్మల్ని చూసుకోలేరు. అదే సమయంలో మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉండాలని చెప్పే అధికారం వాళ్ళకి లేదు. మీరు చెప్పినావిడ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, మీరు ఆమెని మీ జీవిత భాగస్వామిగా కోరుకోవడం. తనకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలని అనుకోవడం ఇవన్నీ మంచి విషయాలే. అయితే ఇదే సమయంలో పిల్లలనుండి వ్యతిరేకత లేకుండా వీలైనంత సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోవడం ముఖ్యం. బహుశా తమ తల్లి స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్లుగా లేదు. అలాగే వాళ్ళకి ఆర్థికపరమైన అభద్రతా భావం కూడా ఉండి ఉండవచ్చు. పెళ్ళి తర్వాత మీరు వాళ్ళకి దూరం అపుతారనే అలోచన కూడా ఉండొచ్చు. మీ చుట్టాల్లో ఒక తటస్థ వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో స్పష్టంగా కనుక్కోండి. మీ పిల్లలకు ఆమోద యోగ్యంగా ఉండేలా ఒక వీలునామా రాయండి. మీరు వివాహం చేసుకునే అవిడ మీ నుండి ఏమీ ఆశించలేదంటున్నారు కాబట్టి ఆవిడ అభ్యంతరం చెప్తుంది అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఆవిడ ఏదైనా పేచీ పెడితే మీకు అక్కడే ఆవిడ ఉద్దేశ్యం అర్థం అవుతుంది. అప్పుడు మీరు మీ నిర్ణయాన్నీ పునరాలోచన చేయవచ్చు. ఆమె మీ నిర్ణయాన్ని సంతోషంగా ఒప్పుకుంటే ఆమెను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. మీ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోండి. తద్వారా ఆమె భవిష్యత్తుకి కూడా కొంత భరోసా కల్పించిన వారవుతారు. ప్రతి యేటా కొంతకాలం మీ పిల్లలతో గడిపేలా ఏర్పాట్లు చేసుకోండి.. మీ జీవితంలో మీ పిల్లల స్థానం పదిలంగా ఉందన్న అశ, నమ్మకం వారికి కలుగుతాయి.. ఇవన్నీ చేసినా కూడా మీ పిల్లలు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంటే, ఇంక మీరు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో ఒక గౌరవ ప్రదమైన జీవితం గడ΄ాలనుకోవడం మీకున్న హక్కు. సమాజం కోసమో, మీ పిల్లలు బాధపడతారనో దాన్ని మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం గురించి ఎలాంటి అపరాధనా భావన లేకుండా ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అమృత ఘడియలవి!
వ్యాధులు దరిచేరకుండా శిశువులకు వ్యాక్సిన్లు వేయించడం తెలిసిందే. ప్రసవం అయిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం అంటే శిశువుకు మొదటి వ్యాక్సిన్ వేయించినట్టే అని చెబుతుంది భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రసవం తర్వాత మొదటి గంట ఎంత కీలకమైనదో తల్లికి– బిడ్డకి ఎన్ని విధాల మేలు చేస్తుందో తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమనేది కాబోయే తల్లులు తప్పక తెలుసుకోవాల్సినదే.అమ్మపాలే తన బిడ్డకు ఇచ్చే అమృతం. ఔషధం కూడా. నవజాత శిశువులకు మొదటి గంటలోనే రొమ్ము పాలు పట్టించడాన్ని ఓ మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. తల్లిపాలు పిల్లలకు సహజ పోషకాహారం, సురక్షితమైనవి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తాగడం లేదు అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యకరమైన భావి జీవితం సమస్యాత్మకంగా ఉంటుందనేది ఆ నివేదికల సారాంశం. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని, మొదటి గంట మరీ కీలకం అని యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ప్రసూతి అనారోగ్య భారం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాల సృష్టికి మూలం అవుతుంది. బిడ్డకు అందమైన భవిష్యత్తును కానుకగా ఇవ్వాలని తపించే ప్రతి తల్లి మొదటగా అందివ్వాల్సింది తల్లిపాలే.మరెన్నో ప్రయోజనాలు→ ప్రసవం అయిన కొన్ని రోజుల వరకే కొలొస్ట్రామ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రోజుల్లో తప్పక పాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మనుగడ అవకాశాలు 14 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.→ తల్లిపాలలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం. → తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలా వరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది.ఆరు నెలలు... ఆ తర్వాత...ఆరు నెలల తర్వాత ఇంట్లో వండిన పోషకాలు ఉండే మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే, వయస్సుకు తగిన విధంగా, పోషకాలు ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అదే సమయంలో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడ తల్లిపాలు ఇవ్వచ్చు. బిడ్డ క్రమంగా ఘన, ద్రవ, వైవిధ్యమైన ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోగలుగుతుందా లేదా అని దృష్టి పెట్టాలి. బిడ్డ తొలినాళ్ల నుంచే తీసుకున్న శ్రద్ధ ఆ బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి పునాది వేస్తుంది. తొలి బాల్య దశలోనే బిడ్డ ఏం నేర్చుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది.. అనే వాటిని నిర్ణయిస్తుంది. జీవితంలో విజయాలు సాధించేలా వారి సామర్థ్యాన్ని ఆ తొలిదశే నిర్ణయిస్తుంది. పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్క అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శ్రక్తి ప్రదాయిని. సాధారణ, సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. ఈ విషయాన్ని తల్లికాబోయే ప్రతి ఒక్కరికీ చెబుతుంటాం. పాలు ఎలా పట్టాలి, శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు వృద్ధి చెందడానికి ఎలాంటి పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవాలో వివరిస్తాం. ప్రతీ తల్లి తన బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం లో తప్పనిసరి అవగాహన పెంచుకోవాలి. తల్లికి తగినంత మద్దతునివ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్∙ -
మాట కటువైతే... మురి పాలు విరుగుతాయ్!
‘‘తొమ్మిది నెలల బొడ్డుతాడు అకస్మాత్తుగా అలా కోసేస్తే ఎలా...?’’ అనుకున్నాడో ఏమో దేముడు! ‘‘పేగుబంధమిలా తెంచినందుకేనేమో... ఆహారంగా పాలబంధం పెట్టి స్తన్యబంధమేర్పాటు చేశాడనిపిస్తోంది!!ప్రసవవేదనతో ప్రాణాల్ని తోడేసిన ఆ కొత్తబిడ్డలోకి తన ప్రాణాలు నింపి... తనలోంచి బయటకు తోడిన ప్రాణాలను మళ్లీ నెమ్మది నెమ్మదిగా పునఃప్రతిష్టించుకుంటూ ఉంటుంది అమ్మ. అలా అప్పుడప్పుడే కోలుకుంటున్న కీలక తరుణంలో ఆ అమ్మ పట్ల జడ్జిమెంటల్‌గా కొన్ని కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు మానసికవేత్తలు.ఆ పోస్ట్ పార్టమ్ ‘బ్ల్యూ’స్ తాలూకు ‘నీలి’నీడల్ని క్రమంగా బిడ్డపై ప్రేమ పెంచుకుంటూ ఇంద్రధనుస్సులాంటి ఫ్లయింగ్ కలర్స్‌గా మార్చుకునే తరుణంలో ఆ కామెంట్లు ఆమెలో అపరాధభావం నింపుతాయంటూ హెచ్చరిస్తున్నారు. సూచన అనే మారువేషం వేసుకుని కర్కశాన్ని కనిపించకుండా కప్పేస్తూ ఉండే... పలకకూడని ఆ పరుష పదాలేమిటో చూద్దాం.ఈనెల మొదటి తేదీతో మొదలై ఈ వారమంతా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భంగా బుజ్జాయికి తల్లి పాలే పట్టమంటూ సిఫార్సు చేస్తుంటారు డాక్లర్లు. ‘బాటిల్ పాలు బొజ్జ నింపుతాయేమోగానీ... అమ్మ పాలు కడుపునింపడంతో పాటూ ఆత్మనూ నింపుతాయంటున్నారు’ వైద్య నిపుణులు. ఈ సమయంలో కొన్ని మాటలు కొత్త తల్లితో చెప్పకూడదంటూ వారు సూచిస్తున్నారు. ‘‘అమ్మా! నువ్వు పీరియడ్స్‌లో ఉండి మైలతో ఉంటే బిడ్డకు పాలుపట్టకు’’– కొందరు పెద్దాళ్ల పెడసరం మాటఇది ఎంతమాత్రమూ తల్లితో చెప్పకూడని మాట. బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. డాక్టర్లు నిర్దిష్టంగా వద్దని చెబితే మినహా బిడ్డకు పాలుపట్టకుండా ఉండనే కూడదు. పైగా మురి పాలతో పట్టే ముర్రు పాలు ఇంకా ఇంకా మేలూ మంచీ చేసేవే. ఆ ముర్రు పాలనే కొలెస్ట్రమ్ అంటారు. తల్లిని దేవత అన్నాక అమ్మ అమృతం పట్టక పోతే ఎలా! అందుకే అనేక అనారోగ్యాలూ... ఎప్పుడో వృద్ధాప్యంలో బిడ్డకు వచ్చే ఎన్నో జబ్బుల్నించి రక్షించే ఆ పాలు అమృతాలు కాకుండా ఎలా పోతాయి. అమృతానికి అంటు ఏమిటి? పాలకు మైలేమిటి? అందుకే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా బిడ్డకు అమ్మ పాలు పట్టాల్సిందే. ‘‘ పాప ఏడుస్తోంది... పాలు సరిగా పట్టావా? ఏమో.... పట్టావో లేదో?’’ – అనుభవజ్ఞురాలంటూ ఆరా తీసే మహిళ పాలు తాగుతుండే పా పాయి చక్కగా బరువు పెరుగుతుంటే చాలు. పాలు తన ఒంటికి పడుతున్నట్టే లెక్క. తల్లి ఇచ్చే ఆ పాలబువ్వనంతా బిడ్డ ఒంటికంతా పట్టేలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకే నెలల పా పాయిలకు మలవిసర్జన అంతగా కాక పోవచ్చు. కొన్నిసార్లు మల విసర్జనకు రెండు మూడురోజులూ పట్టవచ్చు లేదా రోజులో రెండుసార్లు కూడా కావచ్చు. కానీ మూత్రంతో రోజుకు ఆరుసార్లైనా డయపర్ తడిపేస్తుంది బేబీ! అలా రోజూ పాలు తాగే పసి పాప... రోజులో ఐదారుసార్లు పక్కతడిపేస్తుంటే చాలు. ఇక పా పాయి ఏడుస్తుందంటే అర్థం పాలు సరి పోలేదని కాదు... అది కోలిక్ అని పిలిచే కడుపునొప్పి వల్ల కావచ్చు. చెప్పుకోలేని చెవినొప్పి ఉండచ్చు. అందుకే... పాప అదేపనిగా ఏడుస్తుంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతేతప్ప జడ్జిమెంటల్‌గా కామెంట్స్ పాస్ చేయకూడదు. ‘‘ఏమిటీ...? పాలు పట్టడం అప్పుడే మానేశావా? మా కాలంలో బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకూ పట్టేవాళ్లమమ్మా...’’– తమ కాలమైన గతమంతా గొప్పేనంటూ చెప్పే ఓ పెద్దావిడ మాటబిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకూ పాలు పట్టడం తప్పనిసరి. చిన్నారి పా పాయికి పాలే సరైన ఆహారం. ఆర్నెల్ల తర్వాత నెయ్యీ పప్పూతో గుజ్జుగుజ్జుగా కలిపిన అన్నం గోరుముద్దలతోనూ, గుజ్జుగా నలిపే పండ్ల బువ్వతో క్రమంగా ఘనాహారమంటూ అలవాటు చేయడాన్ని ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అంటారు. ఇలా చేస్తూ కూడా ఏడాది ఏడాదిన్నర వరకూ పాలు పడుతూనే ఉండవచ్చు. డాక్టర్ చెప్పిన ఏ కారణాల వల్లనో లేదా బిడ్డకు సరిపడా పాలు తల్లికి పడకనో ఆపేయాల్సి వస్తే... అందుకు అనేక కారణాలుండవచ్చు. అందుకే అదేదో నిష్ఠూరంగా ఎలా పడితే అలా మాట్లాడాల్సిన మాట కాదు. ‘‘బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్టుగా లేదు... పాలు సరిగా పట్టడం లేదా?’’– పెత్తనం చేస్తున్నట్టుగా పెదవి దాటించే ఓ పెద్దావిడ ఆరా!బిడ్డకు పాలు సరి పోయాయంటే... కడుపు నిండిన వెంటనే పా పాయి కనీసం గంటా గంటన్నర పాటు నిద్ర పోతుంది. పాలు తాగాక కనీసం గంటసేపైనా పా పాయి పడుకుందంటే చిన్నారికి కడుపు నిండినట్టే లెక్క. కొందరు బిడ్డలు కాస్త పీలగా ఉండొచ్చు. అందరూ బొద్దుగానే ఉండరు కదా. అలా చూసి... ఇలా నిష్టూరాలు ఆడకూడదు. మొదట్లో ఒకవైపు పాలు తాగడానికి బిడ్డకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలూ పట్టవచ్చు. పాలు తాగే నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ పా పాయి 5 – 10 నిమిషాల్లోనే పాలు తాగేస్తుంటుంది. అయితే... పాలు పట్టేటప్పుడు మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. అందులో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది తాగేశాకే హైండ్ మిల్క్ అనే పాలొస్తాయి. ఇందులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కొవ్వులే అయినా పాప ఒంటికి హాయిగా పట్టేలా చేస్తుంది ప్రకృతి.కొత్త తల్లితో కినుక మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే... కొత్త తల్లికి అంతా కొత్తే. కొంగులో బంగారు బిడ్డతో కొత్త తల్లికి అసలే కంగారు. పాప పుట్టే సమయంలో అనుభవించే వేదనతో కొన్నిసార్లు పాపపై కోపం వచ్చేలాంటి ‘ పోస్ట్ పార్టమ్ బ్లూస్’ వర్కవుట్ అవుతూ ఉంటాయి. అవి క్రమంగా తగ్గుతుండే సమయంలో ఇలాంటి నిష్ఠూరాలతో అమ్మమనసుకు కష్టం కలిగిస్తాయి. అలాంటి వ్యాఖ్యలు ఆమెను మానసికంగా దెబ్బతీసి గిల్ట్‌ను నింపవచ్చు. మొదటే తెలియని తనం... అసలే అనుభవలేమి... పైగా ఇలాంటి మాటలు!! వీటితో ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఇంకా ఇంకా సమస్యలు రావచ్చు. అందుకే అలాంటిలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ సూచిస్తున్నారు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు. -
డుగ్గు డుగ్గుమని... బుల్లెట్ బండి మీద డాడీ వచ్చిండు!
‘నాన్నా... కొత్త బుల్లెట్ కొన్నాను. ఎలా ఉంది?’ తండ్రిని అడిగాడు కొడుకు. ‘చాలా బాగుందిరా’ అన్నాడు నాన్న. ‘ఇది నా కోసం కాదు నీ కోసం’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి కళ్లు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. పద్నాలుగు సంవత్సరాల క్రితం కేరళలోని కొచ్చికి చెందిన అశ్విన్ తండ్రి బుల్లెట్ కొనాలని బలంగా అనుకున్నాడు. అయితే ఆర్థిక కష్టాలు కూడా అంతే బలంగా ఉండడంతో బుల్లెట్ బండి కొనలేకపోయాడు. పద్నాలుగు సంవత్సరాల తరువాత తండ్రి కోరికను నిజం చేశాడు చేతికి అందివచ్చిన కొడుకు అశ్విన్. అశ్విన్ తన తండ్రికి బ్రాండ్–న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ కీ అందించడం, తల్లిదండ్రులు ఆ బండిని చూసి మురిసిపోవడం... ఇలాంటి దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎంత చేసినా తక్కువే’ ‘ఈ తరం పిల్లలు ఆశ్విన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! -
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...మదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఏడడుగులు తడబడి... విడివడి
మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య బైండ్ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ, కంపాటబిలిటీతో తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌరవం, భావోద్వేగాలతో బంధించాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రయాణంలో విడాకుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాన్ని గమనిస్తున్న పెద్దలకు మన వివాహ వ్యవస్థ కూలిపోతున్నట్టనిపించవచ్చు! కానీ.. ఒక వ్యవస్థను పునర్నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు! సుచరిత బిజినెస్ ఎనలిస్ట్. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్వేర్. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్ ఆఫర్ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్ ఆఫర్‌ని వద్దనుకుంది. ఓ స్టార్టప్ ప్లాన్ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్ అవుతుందనుకుని ఆ జాబ్‌కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్ పెట్టాడు. తను స్టార్టప్‌ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్ ఆఫర్ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్ నాకు వచ్చింది. కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ జాబ్‌ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్ క్లిక్ అయ్యింది. ఇంత ఎఫర్ట్నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ? నీ కెరీర్ కోసం మదర్‌హుడ్‌ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్ కోసం నా కెరీర్‌ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్‌గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.ఎందుకంటే.. ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్‌ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. కానీ..చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. విడాకులకు కారణాలు.. మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.– కరీనా కపూర్భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.– విద్యా బాలన్ – సరస్వతి రమ -
ఐ లవ్ యు డాడీ...
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.భావోద్వేగాలకు ప్రాధాన్యంఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్‌కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.టెక్నాలజీతో అనుబంధంఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.ఆధునిక తండ్రిమోడర్న్ ఫాదర్‌హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్‌గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఉదాహరణగా తండ్రిఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్‌గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. -
కలియుగ శ్రవణ కుమారుడు
రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్‌కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్ అయింది. బిహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది. పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్‌ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్‌స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్‌స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్‌ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్‌కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్‌కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్‌లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్‌పర్ట్‌లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్‌లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్‌లో జన్మించి ఐ సర్జన్‌గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, మేరేజ్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
నాకు నువ్వు వద్దు!
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్‌లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంచిన్న చిన్న కారణాలతో..⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.ఆధిపత్య ధోరణి వద్దు దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.– అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైకాలజిస్ట్తొందరపాటుతోనే..దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, కరీంనగర్ -
మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది ఎలాంటి సంబంధాలు?
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి. ఏ పునాదుల ఆధారంగా మానవ సంబంధాలు నిర్మితం అవుతున్నాయి... కాలక్రమంలో ఎలాంటి కారణాలు మానవ సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఎలాంటి వ్యవహారాలు నైతిక విలువలను పరిహాసం పాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీసే సంగతులు. వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను చంపేసే భార్యలు, కన్న పిల్లలను చంపేసే తల్లులు, అదేమాదిరి పురుషులు మనకు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆ వివాహేతర సంబంధం కంటె వారికి ఏదీ ఎక్కువ కాదేమో అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు.తాజాగా ఒకేరోజు దినపత్రికల్లో కనిపించిన నాలుగు వేర్వేరు వార్తలు గమనించినప్పుడు.. అసలు మానవసంబంధాలు ఎంత దారుణంగా పతనం అవుతున్నాయో కదా.. అనే అనుమానం కలుగుతుంది. అనుబంధాల్లో నైతికత అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా మారిపోతున్నది కదా అని కూడా భయమేస్తుంది. ముందు ఆ నాలుగు ఉదాహరణలు పరిశీలిద్దాం.ఉదాహరణ 1 :వైవాహిక బంధంలో కొనసాగుతున్న మహిళ, మరొక ప్రియుడితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నైతికతకు సంబంధించిన విషయమే తప్ప, నేరం కాదు అని దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పైగా ‘భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలానికి చెందిన భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని కూడా వ్యాఖ్యానించింది.ఉదాహరణ 2 :ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో రాహుల్ అనే వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. మరో పదిరోజుల్లో పెళ్లి. ఈలోగా ఆ అమ్మాయి తల్లి స్వప్న.. కాబోయే అల్లుడితో కలిసి పారిపోయింది. వారి కుటుంబీకులు పోలీసు కేసు పెట్టారు. అప్పటికే నేపాల్ సరిహద్దుల దాకా పారిపోయిన వారు.. కేసు సంగతి తెలిసి తిరిగివచ్చారు. కానీ స్వప్న మాత్రం.. కాబోయే అల్లుడితోనే జీవితం పంచుకుంటానని భర్త తనకు వద్దని ఇంకా మొండిపట్టుపడుతోంది.ఉదాహరణ 3 : ఉత్తరప్రదేశ్ లోని బదాయూపట్టణంలో మరో ఉదంతం జరిగింది. మమత అనే 43 ఏళ్ల మహిళ ఇంట్లో డబ్బు నగలు తీసుకుని తన కుమార్తెకు మామ అయిన శైలేంద్రతో కలిసి పారిపోయింది. వరుసకు అన్నయ్య అయ్యే అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ప్రస్తుతం పరారయ్యారు.ఉదాహరణ 4 :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ఫూర్ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మంగళగిరిలో నివాసం ఉంటాడు. అతనికి స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమార్తెతో కలిసి నంద్యాల శివార్లలో నివాసం ఉంటోంది. నాలుగురోజుల సెలవుమీద ఆమె ఇంటికి వచ్చిన ఫరూక్ ఆమె కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గొడవ అయింది. కుమార్తె స్నేహితుడితో కూడా గొడవ అయింది. దీంతో ఆ యువకుడు, మరోనలుగురు కలిసి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ ను హత్య చేశారు.మానవ సంబంధాల గురించి చాలా మంది పెద్దలు చాలా చాలా ఆదర్శాలను, నీతులను వల్లెవేస్తూ ఉంటారు. కానీ.. మానవ సంబంధాల్లో ఉండే చేదు వాస్తవాన్ని చాలా నిష్కర్షగా చెప్పాడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తేల్చేశాడు. సమాజంలో చాలా వ్యవహారాలను భిన్నమైన కోణంలో చూడగలిగిన ప్రతిసారీ మార్క్స్ చెప్పినది అక్షర సత్యం అని అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న నాలుగు ఉదాహరణలు గమనిస్తే.. మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది సెక్స్ సంబంధాలేనా? అనే అనుమానం మనకు కలుగుతుంది. 497 అధికరణం రద్దయిపోయింది తను చేసిన పనిని నేరం అని ఏ కోర్టు చెప్పజాలదు గనుక.. ఓ వివాహిత.. భర్తకు తెలిసినా నిర్భయంగా తన ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. కూతురుకు కాబోయే భర్తతో.. ముందే లేచిపోయింది మరో తల్లి. వరుసకు అన్నయ్యతో అదే ఘోరానికి తెగబడింది మరో ఇల్లాలు. ఏపీఎస్పీ కానిస్టేబులు ఏకంగా తల్లితో వివాహేతర సంబంధంలో ఉంటూ కూతురులాంటి అమ్మాయిపై అత్యాచారానికి తెగబడి హతమయ్యాడు. ఇలాంటి దారుణమైన బుద్ధులు ఎలా వ్యాప్తిలోకి వస్తున్నాయి.నేరాలు జరిగినప్పుడు.. చంపిన వారిని ముక్కలు చేసి ఆచూకీ తెలియకుండా మార్చేస్తున్నప్పుడు.. అలాంటి దారుణాలు చూసి ఓటీటీ సినిమాలు మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయని మనం నీతులు వల్లిస్తుంటాం. కానీ.. ఇలాంటి ఘటనలు ఎలా ప్రభావితం అవుతున్నాయి. నైతిక విలువల పట్ల ప్రజల్లో కనీసస్పృహ లేకపోతుండడమే ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నదనే అభిప్రాయం కలుగుతోంది. పరిష్కారం అంతుచిక్కని సమస్య లాగా సమాజ గతిని ఈ పరిణామాలు దిగజారుస్తున్నాయి....ఎం. రాజ్యలక్ష్మి -
ఈ వారం కథ: ఉల్లి బంధం
‘‘లోకంలో ఎక్కువమంది అన్యోన్యత.. అంటే కమ్యునికేషన్స్ సరిగా లేక సమస్యలు తెచ్చుకుంటున్నారు’’మహానగరంలో పెద్ద దేవాలయ ప్రాంగణం. పురాణ కాలక్షేపం జరుగుతోంది. తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో భక్తులంతా కూర్చొని స్వామివారి ప్రవచనం శ్రద్ధగా వింటున్నారు.‘‘సమాచార లోపం వల్లే మెజార్టీ స్త్రీ పురుషుల్లో అన్యోన్యత దెబ్బతింటోంది. ఒకరు చెప్పింది మరొకరు సాంతం వినడం లేదు. ఠపీమని సమాధానం మాత్రం ఇచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రాక్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోవాల. నిదానం గాని, ఓ విధానం గాని ఉండట్లేదు’’భక్తజన శ్రోతలు ముసిముసిగా నవ్వుకున్నారు. కాని, ప్రియతమ్ నవ్వలేదు. అతని పక్కనే కూర్చున్న సుందరిలో కూడా స్వామివారి మాటలు నవ్వు పుట్టించలేదు. వారిద్దరూ భార్యాభర్తలు. అయినా గంభీర వదనాలతో ఉన్నారు. సుందరి.. పెళ్లయిన కొత్తలో భర్తను పేరులోనే కాకుండా అతడేం చేసినా ఇష్టసఖుడిగానే తలచేది, కొలిచేది. ప్రియతమ్.. భార్య చిలుకలు చుట్టి ఇచ్చినా, చిలుకపలుకులు పలికినా ‘గాల్లో తేలినట్టుందే’ అని సంబరపడిపోయేవాడు. మూడేళ్లు గడిచాయి. ఆ ముచ్చట్లు మాయమయ్యాయి.‘‘వాళ్ల కడుపున ఓ కాయ కాస్తే అన్నీ సర్దుకుపోతాయి’’ అని పెద్దవాళ్లు అనుకున్నదేమీ జరగలేదు. కాలం గడుస్తున్నకొద్దీ ఒకరిమీద మరొకరికి చిరాకు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. తమ ఇంట్లోనే తాము పరాయివాళ్లలాగా గడుపుతున్నారు. అయినా సరే, ఇద్దరిలో ఏ చిన్న అవసరం ఎవరికొచ్చినా మిగతావారి మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఎవరి రాజ్యంలో వారు సామంతులు మరి.మామూలుగా అయితే వంటగది ఆడవాళ్ల రాజ్యం. ఆక్కడ ‘మగా’నుభావులకు చోటుండదు. కిచెన్స్ రూమ్ వాళ్ల ఇష్టారాజ్యం. ఇదంతా ఒకప్పటి మాట. మహిళలు ఇప్పుడు పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు.‘వంట చేయడం ఏమైనా బ్రహ్మవిద్యా? యూ ట్యూబ్ చూసి చేసేయడమే కదా. ఆ మాత్రం వంటలు మేమూ చేయగలం’ అంటూ ఎంతోమంది మగమహారాజులు నారీమణులకు తీసిపోకుండా ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నారు.కాని, ప్రియతమ్ ఆ పని చెయ్యలేడు. తనకు స్టవ్ వెలిగించడమే సరిగా రాదు. ఎలాగోలా వెలిగించినా, బర్నర్ ఎటు తిప్పితే సిమ్మో, ఎటు తిప్పితే కాదో తనకు ఇప్పటికీ కన్స్ ఫ్యూజనే. ఒకసారి స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి. పాలు పొంగిపోతున్నాయని పొయ్యి దగ్గరకు పరిగెత్తి ఆ గాభరాలో వెంటనే స్టవ్ కట్ట లేకపోయాడు. గభాల్న పాలపాత్ర దించేసి, చేతులు కాల్చుకున్నాడు. అందుకే కప్పు టీ కావాలన్నా సుందరి చేసి ఇవ్వాల్సిందే! వంటగది సుందరికి ఇష్టారాజ్యం అయితే, ప్రియతమ్కు దుర్భేద్యమైన కోట.డబ్బుల్ని ఒకేసారి ఎక్కువగా చూస్తే సుందరికి గుండెలు ఝల్లుమంటాయి. ఆ పులకరింతలో వాటిని సరిగా లెక్కపెట్టలేకపోతుంది. ఎప్పుడైనా లెక్కపెట్టాల్సి వస్తే ఒకటి రెండు సార్లు లెక్కపెట్టినా, పది రూపాయలు ఎక్కువో తక్కువో అవుతుంది. అందుకే డబ్బు జోలికి తనెప్పుడూ స్వతంత్రంగా వెళ్లలేదు. ప్రియతమ్ను కట్టుకున్నాక సహజంగా ఉండే స్వాతంత్య్రం కూడా పోయింది. మనీపర్స్ ప్రియతమ్కు అల్లాఉద్దీన్స్ అద్భుత దీపం అయితే సుందరికది అర్థంకాని మాయల ద్వీపం.రోజులు గడిచేకొద్దీ ఏ చిన్న అవసరమైనా, ఒకర్నొకరు అడుక్కోవడం ఇద్దరికీ దుర్భరంగా తోచేది. భార్యాభర్తల మధ్య ఈ పరిస్థితేమిటి? ఎవరికైనా తెలిస్తే నవ్వుకోరా! అన్న ఆలోచన వచ్చినా ఎవరికి వారు సమర్థించుకునేవారు. అందులో తప్పున్నా దాన్ని దిద్దుకోవల్సింది తను మాత్రం కాదని ఒకరి మీద మరొకరు నెట్టుకునేవారు. ప్రియతమ్ గీసి గీసి లెక్కలేసి సుందరికి డబ్బులివ్వడం, సుందరి తెల్లారి లేచి నాన్చి నాన్చి పనులు చేయడం– ఇదీ తంతు! ఎప్పుడైనా పక్కింటివాళ్లతోనో, ఇంటికొచ్చిన అయినవాళ్లతోనో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సివచ్చినా, వీళ్ల బండారం బయట పడిపోకుండా ముఖాన పౌడర్లు స్నోలతో పాటు లేని నవ్వులు కూడా తగిలించుకునేవారు. దేవాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోందని, స్వామివారు చెప్పే పురాణం కన్నా ఇంటింటి రామాయణం మీద జోకులే అందరికీ కనెక్ట్ అవుతున్నాయని వీధిలో నలుగురూ అనుకోసాగారు. ఓ సాయంత్రం పక్కింటి వాళ్లు వెళ్తుంటే ప్రియతమ్, సుందరి వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది. నవ్వలేనివారు స్వర్గాన ఉన్నా ఏడుపు మొగంతోనే ఉంటారన్నట్లు, కనీసం ఇంగ్లీషు సినిమాహాల్లోలా, పక్కవారితో జతకలిపైనా నవ్వకుండా ప్రియతమ్, సుందరి గంభీర వదనాలతో ఉన్నారు. ‘‘మనిషి సంఘజీవి. ఒకరితో ఒకరు కలిసుండాలి. ఇందులో అనుమానమే లేదు. అలాగని ఒకరు లేకపోతే మరొకరు బతకలేరు అని కాదు, ఒకరికొకరుగా కలసి ఉంటూనే ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి. ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే కదా ప్రేమలు, అభిమానాలు పుడతాయి; బంధాలు బలపడతాయి. అప్పుడే కదా ఈ సమాజమే అందంగా ఉంటుంది. అందం అంటే– నేను చెప్పే అందం, మీరు చూసే అందం ఒకటి కాదు. విశ్వమానవ కళ్యాణంలోని అందాన్ని, వసుధైక కుటుంబంలోని బంధాన్ని నేను చూస్తున్నాను’’ భక్తులంతా గొప్ప ఊరటని, ప్రశాంతతను పొందిన అనుభూతితో తేలిపోయారు. అంతటి ఆనందాన్ని తట్టుకోలేని కొందరి గుండెలు ఉప్పొంగిపోగా కళ్లవెంట జలజలా ఆనందబాష్పాలు రాలాయి.స్వామివారు ఆ రోజుకి స్వస్తి చెప్పి లేవగానే భక్తజనం కూడా ఎవరిళ్లకు వారు వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.ప్రియతమ్, సుందరి మనసులపై స్వామివారి కొన్ని మాటలు బలమైన ముద్ర వేశాయి. ‘‘..ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి’’ ఈ మాటలు పదే పదే వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.స్వామివారి మాటల్లోని పూర్తి సారాంశాన్ని తీసుకోకుండా, తమకు కావల్సింది మాత్రమే పట్టుకొని రాత్రి పడుకున్నాక కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయారు. ఆఫీసుకు రెడీ అవుతున్న ప్రియతమ్ మనసులో పరిపరి విధాలా ఆలోచనలతో హాల్లో నిల్చున్నాడు క్యారియర్ కోసం. సుందరి ఇంతకీ రాదు, అంతకీ రాదు. అసహనం పెరిగిపోసాగింది. పోనీ ‘దీని కేరీజు ఎవడికి కావాలి బయట ఏదోటి తిందాం’ అనుకుంటే ఆ మసాలాలు, బిరియానీలు తన ఒంటికి పడవు. ఏదైనా హోమ్లీగా ఉండాలి. ఈ బలహీనతే దానికి బలమైన ఆయుధమైపోయింది. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు.సర్దిన క్యారియర్ యథాలాపంగా అతని చేతికిచ్చి మాటామంతి లేకుండా అక్కడే నిల్చుంది. ప్రియతమ్ అడుగుతీసి బయటపెట్టాక గేటు తలుపులు వేయడానికి వెళ్లి అక్కడ అడిగింది‘‘ఖర్చులకు డబ్బులివ్వలేదేం?’’అనిఏవేవో లెక్కలు వేసుకొని, జేబులోంచి పర్సు తీసి ఒకటికి నాలుగుసార్లు లెక్కపెట్టినవే లెక్కపెట్టి సుందరికిచ్చి బండి స్టార్ట్ చేశాడు.గేటు వేసొచ్చి సోఫాలో కూర్చుంది. ‘ఇలా గానుగెద్దులా పడుంటే, చేసి పెడుతుంటే తన విలువేంటో ఆయనకు తెలీట్లేదు. స్వామివారు చెప్పినట్టు ఎవరూ ఎవరికీ తీసిపోయి లేరు. నా వ్యక్తిత్వాన్ని నేనే కాపాడుకోవాలి. బానిస బతుకు బతకడంలో అర్థం లేదు’ అని ఒకటికి పదిసార్లు అనుకుంది.చూస్తుండగానే సాయంత్రమైంది. ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న ప్రియతమ్ తన వీధిలో రెండిళ్లు దాటీ దాటగానే ఠక్కున అతని స్కూటర్ ఆగిపోయింది. ఎదురుగా కొత్తగా వెలసిన టిఫిన్స్ కొట్టు ‘మీ వంటిల్లు’ కనిపించింది. ‘పేరు కూడా భలే ఉందే’ అనుకుంటూ బండి స్టాండ్ వేసి లోపలికెళ్లాడు. నేతి ఘుమఘుమలతో టిఫిన్లు కూడా అరటాకులో తింటున్న కస్టమర్లతో హోమ్లీగా కనిపించింది. సీరియల్ లైట్ల వెలుగు జిలుగుల్లో తనపాలిట కల్పతరువుగా కనిపించింది. తిన్నగా ఇంటికి పోనిచ్చి బండి పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.ప్రియతమ్ వచ్చాక ముందు మంచినీళ్లు, తర్వాత టీ కప్పు అందివ్వడం సుందరి చేసే పని.ఆ వేళ అలాంటిదేమీ జరగలేదు. ప్రియతమ్ ఫ్రెష్ అవడానికి వాష్‌రూమ్‌లోకి దూరాడు. కాస్సేపటికి హాల్లోకి వచ్చిన ప్రియతమ్కు చేష్టలుడిగినదాన్లా సోఫాలో సుందరి కనిపించింది. ఆమె టీ పెట్టి తీసుకురాలేదు. అతను అడగలేదు.‘తను నోరిడిచి అడగనిది నేనెందుకు ఇవ్వాలి. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఆ రోజు ఇంటి ఖర్చులకు నేనడగకుండా డబ్బులిచ్చాడా? లేదుకదా! గేటు వరకు వెళ్లినతని వెనకే వెళ్లి అడిగితే వీధిలోనే నిలబడి ఆరవైఆరు లెక్కలేసి డబ్బులు చేతిలో పెట్టాడు. కావల్సినవి కొని అన్నీ చేసేసరికి పైసా మిగల్లేదు. ఏమిటీ అవస్థ? ఇంతోటి భాగ్యానికి తనెందుకు పులుముకొని కడుక్కోవడం’ పేపరు చూస్తూ తన ఆలోచనల్లో తనుంది.ప్రియతమ్ డ్రెసప్ అయ్యాడు. చెప్పులు వేసుకొని లుంగీతోనే వీధిలోకి వెళ్లిపోయాడు. సుందరిలో ఒక్క నిముషం ఆశ్చర్యం. అంతలోనే సర్దుకొని తన పనిలో తను పడింది.‘అదేం పేదరాసి పెద్దమ్మ అనుకుంటుందేమో! దాని పుంజు కుయ్యకపోతే కప్పుటీ ఎక్కడా దొరకదనుకుంటుందేమో! రెండడుగులు వేస్తే అద్భుతమైన దుకాణం ఉందిప్పుడు. దానికా సంగతి తెలీదేమో! ఇంతకు ముందు రెండు వీధులు దాటి రోడ్డుకు వెళ్తేకాని టీ కాఫీ ఫలహారాలు కనపడేవి కావు. అవి కూడా మనకి కావల్సినట్లు ఉండేవి కావు. అయినా అంతదూరం ఎవడెళ్తాడ్రా బాబూ అనుకుంటూ ఇంట్లోనే దేవులాడాల్సి వచ్చేది.కొత్త దుకాణం ఆ బాధలన్నీ తీర్చింది’ అనుకుంటూ ఓ టీ కొనుక్కొని ఆక్కడే కాస్సేపు గడిపి ఏ టైమ్‌లో ఏయే వస్తువులు ఉంటాయో తెల్సుకొని ఆనందంగా ఇంటికొచ్చాడు.‘ఏమిటీ మనిషి? ఇంటికొచ్చిన వెంటనే టీ చుక్క పడకపోతే పిచ్చెక్కిపోయేవాడు. అలాంటి చిహ్నాలేవీ లేకుండా హుషారుగా కనిపిస్తున్నాడు’ అనుకొని వంటగదిలోకి వెళ్లి తన పనిలో పడింది.భోజనాల వేళైంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ‘‘భోజనం రెడీ’’ అంది సుందరి.‘ఏమిటి! హోటల్ ముందు బోర్డు పెట్టినదాన్లా ‘భోజనం రెడీ ఏంటి. భోంచేద్దురుగాని రండి అంటే దాని సొమ్మేమైనా పోతుందా? నా సొమ్మేగా! అయినా దానికి టీ తాగే అలవాటు లేదు. అందుకే అడిగితే కాని ఇవ్వట్లేదు. కాని, తిండి తినాలిగా. అందుకే నన్నూ పిలిచిందన్నమాట. ఏదైతేనేం, వద్దని పస్తుండలేం కదా’ అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.అందని అందాల అంచుకే చేరిననూ.. విరిసిన పరువాల లోతులే చూసిననూ.. తనివి తీరలేదే’’ పాట టీవీలో వస్తోంది. విసురుగా లేచి వెళ్లి టీవి కట్టేశాడు ప్రియతమ్. భోజనం ముగించి బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.పనులన్నీ ముగించుకొని సుందరి కూడా వెళ్లి పడుకుంది.‘ఏవిటీ అవస్థ? ఇంతకు ముందు మొక్కుబడిౖకైనా తమ మధ్య పొడి పొడి మాటలుండేవి. ముఖాన గంటు పెట్టుకొని పడుండేవాళ్లం కాము. ప్రవచనం దగ్గరకు వెళ్లొచ్చాక ఇద్దరిలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉన్న సంకోచాలు పోయి లేని తెగింపులు పుడుతున్నాయేంటి! ఇది ఎక్కడకి దారి తీస్తుంది? తెగని ఆలోచనలతో సుందరి ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఏమో!తెల్లవారింది. ఎవరి పనుల్లో వారున్నారు. ప్రియతమ్కు బెడ్ టీ అలవాటు. అలాగని నిద్రకళ్లతో, పాచిమొఖంతో తాగడు. నిద్రలేచి, వాష్‌రూమ్ అవసరాలు తీర్చుకొని బ్రష్ చేసి హాల్లో కూర్చొని పేపర్ చూస్తు ఉన్నవాడికి సుందరి టీ తెచ్చి ఇస్తుంది. అది లేటయితే అతనిలో అసహనం అంతకంతకు పెరుగుతుంటుంది. నిరసనను ఏదోరకంగా వ్యక్తం చేసేవాడు. అప్పటికీ ఆలస్యమైతే ‘‘లోపల ఏం వెలగబెడుతున్నావ్. టీ తెస్తున్నావా లేదా?’’అని అరిచేవాడు.ఈవేళ హాల్లోకి ప్రియతమ్ వచ్చాడు. కానీ టీ రాలేదు.‘మనిషొచ్చాడు. కానీ రంకె వేయలేదేంటి? చూద్దాం. ఏం చేస్తాడో. నిన్న సాయంత్రం పెద్ద ఫోజుగా బయటికెళ్లి పోయాడుగా’ అనుకుంటూ వంటగదిలోనే ఉంది సుందరి.ప్రియతమ్ సోఫా మీదున్న న్యూస్ పేపర్ తీశాడు. నిల్చొనే పేజీలు తిరగేస్తూ హెడ్‌లైన్స్ ్స ఒకసారి చూశాడు. టీ కోసం ఎదురు చూసినవాడిలా కనిపించకుండా చెప్పులు వేసుకొని లుంగీలోనే రోడ్డుకు వెళ్లిపోయాడు.సుందరి చిన్నపాటి కుదుపుకి లోనయింది. ‘ఏవిటీ మనిషి! ఉలకాయిస్తున్నాడా నన్ను? ఉలకాయించనీ. ఉలకాయించిన మొగుడ్ని ఉడతెత్తుకు పోయిందని.. ఎన్నాళ్లు ఉలకాయిస్తాడో నేనూ చూస్తాను’ అనుకుంటూ పనిలో పడింది.కాస్సేపటికి వచ్చిన ప్రియతమ్ సరాసరి వాష్‌రూమ్‌లోకి దూరిపోయాడు. మరి కాస్సేపటికి డ్రసెప్పై హాల్లోకి వచ్చాడు. సుందరి క్యారియర్ కట్టీసి అతను చూస్తుండగా టేబుల్ మీద పెట్టింది.ప్రియతమ్ పర్సులోంచి డబ్బులు చేతికొచ్చింది వచ్చినట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. అవి సరిపోతాయా చాలవా ఆన్న ఆలోచన ఆ సమయంలో అతనికి కలగలేదు.ప్రియతమ్ వెళ్లిపోయినా చాలాసేపు అలా సోఫాలో కూర్చుండిపోయిన సుందరి బలవంతంగా ఆలోచనల్ని మళ్లించడం కోసం యథాలాపంగా న్యూస్‌పేపర్ చేతిలోకి తీసుకొని తిరగేస్తూ చటుక్కున ఓ వార్త దగ్గర ఆగిపోయింది. ఆసక్తిగా వార్తను సాంతం చదివింది. ఆ తర్వాత తనకు స్పష్టమైన ఓ దారి, గమ్యం కనిపించినంత ఆనందంగా లేచింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ప్రియతమ్ కంగుతిన్నాడు. ఇంటికి తాళం వేసుంది. దానికో చీటీ తగిలించి ఉంది. ‘తాళాలు పక్కింటి ఆంటీవాళ్ల దగ్గరున్నాయి’ అని రాసుంది దానిమీద. ఎప్పుడూ జరగలేదిలా. ఆశ్చర్యపోతూనే వెళ్లి తాళాలు తెచ్చి తలుపులు తెరిచాడు. హాల్లో లైటు వేయగానే టేబిల్ మీద చిన్నసైజు లెటర్ కనిపించింది. ‘‘నేనెక్కడికి వెళ్లానా అని ఆలోచించకండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను అడుగుతీసి అడుగెయ్యలేననే కదా మీ ధైర్యం. నేను కుక్కిన పేనులా పడుంటాననే కదా మీ నమ్మకం. నాలాంటి వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. ఆర్టీసి బస్సుల్లో మా ఇష్టం వచ్చిన చోటుకు మా ఇష్టం వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛ లభించింది. నా కోసం వెతకొద్దు’’అదీ మ్యాటర్. ప్రియతమ్ లిప్తపాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే సర్దుకున్నాడు. ‘సరే. ఆ ముచ్చట కూడా చూద్దాం. అది లేకపోతే నాకు తిండి దొరకదా ఏంటి. ఎలా వెళ్లింది అలాగే వస్తుందిలే. రాకపోయినా వచ్చిన నష్టం లేదు హోమ్లీ హోటలుంది’ అని తనకు తాను చెప్పుకొని శుభ్రంగా ఫ్రెష్ అయి లుంగీలోనే రోడ్డు మీదకు వెళ్లాడు. కొత్త కొట్టు దగ్గరకి వెళ్లాడు. వేడి వేడిగా ఓ సమోసా తిన్నాడు. ఆనక ఓ స్పెషల్ టీ తాగాడు. అక్కడ మంత్లీ కార్డు సిస్టమ్ కూడా ఉందని తెలుసుకొని డబ్బు కట్టేశాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లినప్పుడు క్యారియర్ ఇచ్చేస్తే ఆఫీసుకు బయల్దేరే సమయానికి మంచి భోజనంతో క్యారియర్ రెడీ చేస్తారంట! ‘తంతే భోజనశాలలో పడ్డాం’ అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. కాస్సేపు ఇలా అలా గడిపేసి డిన్నర్ టైమ్ కాగానే మళ్లీ కొత్తకొట్టుకు వెళ్లి తృప్తిగా భోజనం చేసేసి వస్తూ వస్తూ దార్లో ఓ మిఠాయి కిళ్లీ కూడా కట్టించుకొని వేసుకొని డర్రుమని ఓ తేనుపు తీసి ఇంటికొచ్చి నడుం వాల్చీ వాల్చగానే హాయిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.∙∙ ఆ రోజు ఉదయం ప్రియతమ్ ఆఫీసుకు వెళ్లగానే పేపరు చదువుతున్నది ‘ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. సిటీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఎన్ని సార్లయినా వాళ్లు స్వేచ్ఛగా ప్రయాణించ వచ్చు’ అన్న వార్త చదివి ఎగిరి గంతేసింది. ఇక క్షణం కూడా నిలవలేక పోయింది. గబగబ పనులన్నీ ముగించుకొని చిన్న సంచిలో ఓ రవిక జాకెట్టు పెట్టుకొని ఇంటికి తాళం వేసి, దాని చెవి పక్కింటాంటీకి ఇచ్చి, రోడ్డు మీదకు వెళ్లీ వెళ్లగానే బస్సు. వెనకా ముందు చూడకుండా ఎక్కీసింది. అప్పుడు ఉదయం 11. భరత్‌నగర్ దగ్గర సుందరి ఎక్కిన బస్సు అనేక స్టాపుల్లో ఆగుతూ దిల్షుక్ నగర్ మీదుగా వెళ్తోంది. దిల్షుక్ నగర్లో సాయిబాబా మందిరం గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్లు పులకరించింది. మరో ఆలోచన లేకుండా అక్కడ దిగేసింది. ఎప్పటినుంచో దాచుకున్న వందో నూటయాభయ్యో రూపాయల్ని ఎందుకైనా మంచిదని పట్టుకొంది. బాగా దాహమేసి గొంతెండిపోతుంటే ముందు ఓ సోడా తాగింది. చాలా ఆనందమేసింది. గోలీ సోడాతో దాహం తీరినందుకు కాదు, స్వతంత్రంగా ఓ సోడా కొనుక్కోగలిగినందుకు. తర్వాత బాబాను దర్శించుకుంది. ఈలోగా ఉచిత భోజన వితరణ వేళయింది. ‘ఏమి నా భాగ్యం’ అనుకుంటూ బాబా ప్రసాదం ఆరగించింది. కొద్దిసేపు మందిరమంతా కలియతిరిగి అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సు ఎక్కీసింది. అక్కడ బస్సు మారి చిలుకూరు వెళ్లింది. బాలాజీని దర్శించుకొని తిరిగి మెహిదీపట్నం వచ్చింది. పెద్దపెద్ద స్తంభాల మీద వంకీలు తిరిగున్న బ్రిడ్జిని, స్తంభాల మధ్యనుంచి రాకపోకలు సాగించే బస్సులు, కార్లు, స్కూటర్లను ఎప్పుడూ చూడని అందాలను తనివితీరా సంతోషంగా చూసి తర్వాత కూకట్పల్లి వెళ్లే బస్సు ఎక్కి తాము ప్రవచనం విన్న గుడికి చేరింది. స్వామివారు ప్రవచనం ముగించినట్లున్నారు భక్తులెవరూ లేరు. తను వెళ్లి దేవుడ్ని దర్శించుకొని దేవాలయంలో ఓ మూల కూర్చొంది. కాస్సేపటికి పూజాదికాలు ముగించి మంగళహారతులిచ్చేసి గుడి తలుపులు వేసేసి వచ్చిన పూజారికి ఓ మూల కూర్చున్న సుందరి కనిపించింది. ‘‘ఎవరమ్మా నువ్వు. గుడి తలుపులు కూడా వేసేశాం. చూసుకో లేదా. నువ్వు ఇక్కడే ఉండిపోయావు’’ అన్నారు.‘‘లేదు స్వామీ. ఈ రోజు నేనిక్కడే ఉందామనుకుంటున్నాను. దూరం నుంచి వచ్చాను’’అంది సుందరి‘‘అలాగా! అయితే భక్తుల విశ్రాంతి మందిరం ఉంది. అక్కడుండమ్మా!’’ అన్నారు.అలా అక్కడ ఆశ్రయం పొందిన సుందరి తెల్లవారే లేచి, అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని, స్నానపానాలు కానిచ్చి దేవుని దర్శించుకొని బయటపడింది. ఆ రోజు కూడా తను చాలా చోట్లకు తిరిగి తిరిగి రాత్రికి మళ్లీ అక్కడికే చేరుకుంది.ప్రియతమ్కు బ్యాచిలర్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ‘టైమ్‌కు అన్నీ అందితే, ఈ సంసారం అనే జంఝాటమెందుకు? బ్యాచిలర్ బతుకే సో బెటర్ అయితే ఫోర్స్డ్ బ్యాచిలర్ బతుకు సోమచ్ బెటర్’ అని రోజు రోజుకీ హుషారుగా ఉన్నాడే కానీ ‘కట్టుకున్నది ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లిందో, ఏమైపోయిందో ఏమిటో’ అని ఆమె మీద ధ్యాస గాని, ఆశ గాని లేకుండా గడిపేస్తున్నాడు.ఇలా ఇద్దరూ ఒకరి నొకరు తలచుకోకుండా రెండు మూడు రోజులు గడిపేశారు. కాని, ఆ రోజు కథ అడ్డం తిరిగింది. విచిత్రంగా ఇద్దరి కొత్త జీవితం ఊహించని మలుపు తిరిగింది.ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న ప్రియతమ్ బండి ఒక్కసారి గాలి తీసినట్లు ఆగిపోయింది. కొత్తకొట్టు మూసేసి ఉంది. ఆ రోజు భోగి పండగ. సంక్రాంతికి వీధుల్లోని టీ, టిఫిన్స్ మీల్స్ దుకాణాలన్నీ బంద్ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతారు. సాయంకాలాలు, పండువెన్నెలలు, పండుగలు పబ్బాలు లేకుండా అంగళ్లమీద ఆధారపడుతూ యాంత్రికంగా గడిపేవారికి ఆ మూడు రోజులు చెప్పరాని ఇబ్బందే! భోగి ముందు రోజు తను ఆఫీసులోనే ఉండిపోవల్సి వచ్చింది. తనతోపాటు మరొ నలుగురైదురుకీ అదే పరిస్థితి. పెద్దపండగకి మెజార్టీ స్టాఫ్ సెలవులు పెట్టేయడంతో మిగిలినవారిమీద వర్క్ ప్రెజర్. డబుల్ డ్యూటీలు చేస్తేగాని పెండింగ్ అంతా క్లియర్ కాలేదు. ఆ హడావిడిలో హోటళ్ల సంగతే మరిచాడు ప్రియతమ్.డీలా పడిపోయి ఇంటికొస్తున్నవాడికి సుందరి గుర్తొచ్చింది.∙∙ సాయంత్రం వరకూ ఎక్కడెక్కడికో వెళ్లి అలవాటుపడ్డ గుడికి తిరిగొస్తున్న సుందరికి షాక్ తగిలింది. ఆలయ నిర్వాహకులు గుడిలోకి ఎవరినీ రానివ్వడం లేదు. లోపల ఉన్నవారిని వెతికి వెతికి బయటకు పంపించేస్తున్నారు. కొద్ది సేపట్లో చంద్రగహణం. అందుకే ఆలయం మూసేస్తున్నారు. సంప్రోక్షణం చేశాక మళ్లీ మర్నాటి వరకు ఆలయాన్ని తెరవరు. దర్శనాలు బంద్.సాయంత్రం బస్సులో తిరిగొస్తున్నప్పుడు అందరూ అనుకుంటుంటే తెల్సింది.. ‘ఈ వేళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్’ అని. తమ డిమాండ్లు తీర్చకపోతే సమ్మెకు దిగుతామని కార్మికులు ఎప్పుడో నోటీసు ఇచ్చారట! షరా మామూలుగా ప్రభుత్వం నాన్చి నాన్చి సంక్రాంతికి బస్సు సర్వీసులు లేకపోతే జనాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కార్మిక నాయకులతో చర్చలు మొదలుపెట్టిందట! ఆ చర్చలు మరో గంటో ఘడియలో సక్సెస్ అయితే సమ్మె ఉండదు. చర్చలు విఫలమైతే? ఏం పర్వాలేదులే, నేను నమ్ముకున్న దేవుడి గుడి ఉందిగా అని ధీమాపడ్డ సుందరికి చెంపదెబ్బ గోడదెబ్బలాగ గుడి, బస్సుల సంగతి తెల్సి నవనాడులు కుంగిపోయాయి.అక్కడే ఓ మూల గుడి స్తంభానికి జేరబడి కూలబడిపోయిన సుందరికి ప్రియతమ్ గుర్తొచ్చాడు.అందర్నీ పంపేస్తూ సుందరి దగ్గరికి వచ్చిన స్వామివారు, ‘‘అదేంటమ్మా. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. తలుపులు వేసేస్తారు. వెళ్లిపో’’ అంటూ ఆమె కళ్లలోకి చూసి అవాక్కయ్యారు. సుందరి కళ్లల్లో నీటిపొరను చూసి విచలితులయ్యారు. ఏమైందో అడిగి అంతా తెల్సుకున్నారు. ‘‘ఇదేంటమ్మా. ఇలాగేనా కాపురాలు చెయ్యడం. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి కదా. నీ తెలివితేటలు ఏమయ్యాయి? మీ ఆయన ఫోన్స్ నంబరు చెప్పు’’ అనేసరికి తడిగొంతుతో నంబరు చెప్పింది.కాస్సేపట్లోనే గుడిదగ్గరికొచ్చిన ప్రియతమ్ సుందరిని చూసి అలా ఉండిపోయాడు కాని, దగ్గరికి వెళ్లలేదు. సుందరి కూడా ఒకడుగు వేయబోయి ఆగిపోయింది. వీళ్లవస్థ చూసిన స్వామివారు ‘‘బాగుంది మీ వాలకం. ఇంత దూరం వచ్చినవాడివి దగ్గరకు రాలేవా? ఏమ్మా ఆయన వెనక ఏడడుగులు నడిచినదానివి ఒక్కడుగుతో ఆగిపోయావేం! మీకు మీరే గొప్ప అని ఎవరికి వారు అనుకుంటూ బంగారంలాంటి బంధాన్ని పాడుచేసుకుంటున్నారు. బంధమనేది ఉల్లిపాయ చందంలా పొరలు పొరలుగా బలపడాలి. వద్దనుకొని కట్ చేసుకుంటే కన్నీళ్లే వస్తాయి. పెట్రోల్ పడ్డ దగ్గర అగ్గిపుల్ల పడ్డట్టు కాకుండా పప్పు వొలికిన చోట నెయ్యి వొలికినట్లుగా కాపురం సాగాలి’’ అని ఇద్దరి చేతులు కలిపేసి తలుపేసేశారు.దగ్గరి కొచ్చిన సుందరి ఏదో అపరాధభావంతో తలొంచుకొని ఉండిపోయింది. ప్రియతమ్ ఆమె భుజాలపై చేయి వేసి ధైర్యం చెబుతున్నవాడిలా దగ్గరికి తీసుకున్నాడు. బండి స్టార్ట్ చేసి కనిపించిన గతుకుల్ని తప్పించుకుంటూ స్మూత్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే..‘‘సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా.. నీ అందచందాలింక నావె కదా’’ అన్న పాట దూరం నుంచి మైకులో వినపడుతోంది.పాట వింటూ సుందరి ప్రియతమ్ను గట్టిగా పట్టుకొని అల్లుకుపోయింది.∙ -
నాన్న.. నువ్వు మా ప్రాణం!
తండ్రీ కూతుళ్ల ప్రేమ అనిర్వచనీయం.. కూతురంటే ప్రతి తండ్రికీ ఎనలేని ప్రేమ.. తన కళ్లలో సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సునాయసంగా భరిస్తుంటాడు తండ్రి.. తన తండ్రి రోజంతా కష్టపడి పనిచేసేది తన కోసమేనని తెలుసుకుంటుంది కూతురు. ప్రతిరోజూ సమయానికి ఇంటికి వచ్చే నాన్న.. కాస్త ఆలస్యం అయితే చాలు అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడని తల్లి వెంటపడుతుంది. తండ్రి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎగిరిగంతేస్తుంది. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నిత్యం జరిగేదే.. అయితే.. యాక్సిడెంట్లో తన తండ్రి ప్రాణాలు విడిచాడని, ఇక ఎప్పటికీ ఇంటికి రాడనే వార్త విన్న కూతురిని ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దాంతో కూతురితో అవగాహన కలి్పస్తే తండ్రిలో తప్పకుండా మార్పు వస్తుందనే ఆలోచనతో ‘సర్వేజన ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ పేరుతో కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నాన్న! నేను ఇటీవల ఒక వార్త చదివాను. 2024లో 1.57 కోట్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయని, ఇది మన రాష్ట్ర జనాభాలో దాదాపు సగంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కేసుల్లో ఒకటి మీదైతే? ఒక చిన్న తప్పు మా జీవితాన్ని మార్చగలదనే ఆలోచన కూడా నన్ను భయపెడుతోంది. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను నేను చూశాను. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ వాళ్లు లేని జీవితం ఎలా ఉంటుందో తెలియక భయపడే పిల్లల్ని చూశాను. అందుకే నిన్ను కోల్పోవడం తలచుకుంటేనే నా గుండె భారంగా మారుతోంది నాన్న.. నాన్న! ఒక రోజు మేమంతా నీ రాకకోసం ఎదురుచూస్తుంటే.. నీవు ఇక ఎప్పటికీ రాకపోతే? ఒక నిర్లక్ష్య క్షణం నిన్ను మా నుంచి దూరం చేసేస్తే? నీ ప్రేమ, నీ నవ్వు, నీ మార్గనిర్ధేశం లేకుండా మేము ఎలా బతకుతాం? నాన్న దయచేసి ఎప్పుడూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తానని నాకు మాటివ్వు. ఎప్పుడు మద్యం తాగి వాహనం నడపకూడదు, అధిక వేగంతో ప్రయాణించకూడదు, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరగా ధరించాలి, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. ఇవి చేయనని నాకు మాటివ్వు నాన్న.. ఎందుకంటే నీవు లేకుండా మా జీవితం ఊహించుకోలేం.. – అంతులేని ప్రేమతో.. నీ ప్రియమైన కుమార్తె ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వేల కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నాయి. 90శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి.. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటివి ఎంతో మంది ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి.మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ‘సర్వేజనా ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ కూతురు తండ్రికి ప్రేమతో అవగాహన కల్పించేలా ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్ యాప్’ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా ఈ మహత్ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని సర్వేజన ఫౌండేషన్ చైర్పర్సన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డి అన్నారు. ప్రతి నెలా యాప్ ద్వారా పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నామని, కూతురితో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.63 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇవి 1.63 లక్షల మంది కుటుంబాలు తల్లడిల్లిన సంఘటనలు.. వారి కలలు, భవిష్యత్తు నాశనమై, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు, పిల్లలను కోల్పోయి కన్నీళ్లు మిగిలిన తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వీరిలో 50 వేల మంది హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడిపినవారయితే, మరొక 17 వేల మంది సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు. -
వధువే వరుడై... వరుడే వధువై...
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం -
మా చెల్లికి 28 ఏళ్లు.. పెళ్ళి చెయ్యొచ్చంటారా?
డాక్టర్! మా చెల్లెలి వయస్సు 28 ఏళ్లు. డిగ్రీ పాసయ్యింది. ఐదేళ్లుగా మానసిక వ్యాధికి మందులు ఇప్పిస్తున్నాం. తనలో తాను నవ్వుకోవడం, గొణుక్కోవడం, ఎవరేది అంటున్నా తన గురించేననడం. చెవిలో ఎవరివో మాటలు వినబడుతున్నాయనడం... పనేమీ చేయదు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వైద్యం చేయించిన తర్వాత చాలా మెరుగైంది. కానీ పూర్తిగా మామూలు మనిషి కాలేదు. మా నాన్న లేరు. చెల్లికి పెళ్ళి చేయాలని అమ్మ తాపత్రయం. చెల్లి మానసిక స్థితి గురించి చెప్పకుండా చేస్తే తర్వాత సమస్యలొస్తాయని భయం. ఇలాంటి వారికి పెళ్ళి చెయ్యొచ్చంటారా? దీనికి పరిష్కారం ఉందా? – ఉదయరాణి, హైదరాబాద్మీరు చెప్పినదాన్ని బట్టి మీ చెల్లెలు...‘స్కిజోఫ్రీనియా’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా సంవత్సరాలపాటు డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కాకపోవచ్చు. షుగర్, బి.పి. లాగా స్కిజోఫ్రీనియాని కూడా మందులతో అదుపు చేయవచ్చే తప్ప, పూర్తిగా నయం చేయడం కష్టమే! ఇలాంటి వారికి కేవలం మందులే కాకుండా, కొంతకాలం ‘రిహాబిలిటేషన్’ సెంటర్లో ఉంచితే, ఆమె యాక్టివ్‌గా, నలుగురిలో కలిసేటట్లుగా తన పనులే కాకుండా, ఇంటిపని, వంటపని, పిల్లలను చూసుకోవడం లాంటి లక్షణాలు ఆమెలో పెంపోదించేట్లుగా శిక్షణ ఇస్తారు.ఇలా చేసిన తర్వాతే అవతలివారికి విషయం చెప్పి వారు ఒప్పుకుంటే వివాహానికి అభ్యంతరం లేదు. చెప్పకుండా చేయడం అనర్థదాయకం. అన్ని విషయాలు చెబితే కొందరు ఒప్పుకోవచ్చు. అవసరమైతే డాక్టరు దగ్గరికి కూడా అవతలి పార్టీని తీసుకొచ్చి వారి అనుమానాలు నివృత్తి చేయడం మంచిది. అన్నీ చెప్పి వాళ్ల సమ్మతి మీద పెళ్లి చేసిన సందర్భాలలో భవిష్యత్తులో ఏమైనా తేడాలే వచ్చినప్పుడు ఒకవేళ వారు విడాకుల కేసు వేసినా కోర్టు అంత సులభంగా విడాకులు మంజూరు చేయదు.ఎందుకంటే గతంలో ఒకరు తన భార్యకు స్కిజోఫ్రీనియా ఉంది కాబట్టి విడాకులివ్వాలని కోర్టుకెక్కాడు. అయితే స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చినంత మాత్రాన విడాకులు ఇవ్వలేం, కానీ ఆ వ్యాధి వలన ఆ భర్త, పిల్లలు, కుటుంబం ఏమేరకు నష్టపోయిందనే విషయాలను నిర్ధారించగలిగితేనే అలాంటి కేసుల విషయంలో విడాకులు ఇవ్వాలా, వద్దా... అనే దాన్ని నిర్ణయించవలసి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ జడ్జిమెంట్‌ను ఇప్పటికీ మన దేశంలో ప్రామాణికంగా పాటిస్తూ ఉన్నారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అతడు సత్యవంతుడు
సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్ మండల్.గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్‌తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్‌లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్ మేన్’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్‌ను ‘ఆక్సిజన్ మేన్’ అనొచ్చేమో.భాగల్పూర్ నుంచివిజయ్ మండల్‌ది బిహార్‌లోని భాగల్పూర్కు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్‌కు కూడా తీసుకెళ్లారు. వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్ మండల్ నిశ్చయించుకున్నాడు.ఉదయాన్నే 4 గంటలకు లేచిఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పూర్ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్చారి’ రైల్వేస్టేషన్‌కు సిలిండర్ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్‌తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.ఆయుష్మాన్ కార్డు‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది. ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్‌లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు. ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్ సిలిండర్లను పర్మినెంట్‌గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం. -
నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం
తిరుపతి సిటీ: సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటూరని పెద్దలు చెబుతుంటారు. ఆ ఏడుగురు ఎవరో.. ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపం కలిగిన ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అదో గొప్ప అనుభూతే. తిరుపతిలో అలాంటి పిల్లలు వందల మంది ఉన్నారంటే నమ్మశక్యంగా లేదుకదూ. ఓ ప్రైవేటు సంస్థ ప్రతి ఏడాదీ కవలల దినోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తోంది. ట్విన్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఇచ్చిన వివరాల మేరకు కేవలం తిరుపతి జిల్లాలో కవలలు సుమారు 12 వేల పైచిలుకు ఉన్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఇది మీకు తెలుసా? ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవం జరుపుకునేందుకు ఓ ప్రత్యేక సందర్భం ఉంది. ప్రపంచంలో మొదటి సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ దేశంలో 1976లో నిర్వహించారు. పోలెండ్‌లో మోజన్, ఆరన్ విల్కాక్స్ అనే కవలలు తాము నివసిస్తున్న ఊరుకి ట్విన్బర్గ్ అని పేరు పెట్టుకున్నారు. అనుబంధాన్ని విడవకూడదనే ఉద్దేశంతో ఒకే ఇంట్లోని అక్కాచెళ్లను పెళ్లి చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యాధితో ఇద్దరూ ఒకే రోజు అంటే ఫిబ్రవరి 22న మరణించారు. వారి గౌర వార్థం నాటి నుంచి ట్విన్స్డేని జరుపుకుంటున్నాయి.నేడు తిరుపతిలో ఘనంగా ట్విన్స్డే స్థానిక సీపీఎం కార్యాలయం వేదికగా ట్విన్స్ ఆర్గనైజేషన్ సంస్థ శనివారం అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు కవల పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కవలలు హాజరుకానున్నారు.అయోమయం అవుతుంటారు మాది తిరుపతి. తల్లిదండ్రులకు మూడో సంతానంగా మేము జన్మించాం. ఒకే డ్రస్ వేసుకుంటాం. చిన్ననాటి నుంచి ఇద్దరం ఒకే తరగతిలో చదివాం. ప్రస్తుతం బెంగళూరులోని ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు మమ్ములను ఇప్పటికీ గుర్తించలేరు. కన్ప్యూజ్ అవుతుంటారు. –హేమావతి, హేమలత, తిరుపతి ఒకే ఆలోచనలు మాది స్వస్థలం కడప. తిరుపతితో అనుబంధం ఎక్కువ. మాకు దాదాపు ఒకే రకమైన ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. మా జీవిన శైలి ఆసక్తికరంగా ఉంటుంది. మమ్మల్ని చూసి చాలా మంది పొల్చుకోలేక తికమక పడుతుంటారు. బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాం. సంస్థలోని ఉద్యోగులు మమ్ములను గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటారు. –రామ్, లక్ష్మణ్, తిరుపతి తల్లిదండ్రులే గుర్తుపట్టలేరు మేము మా తల్లిదండ్రులకు రెండో సంతానం. ఇద్దరం రూపంలోనూ, ఎత్తులోనూ ఒకటిగానే ఉంటాం. తల్లిదండ్రులు సైతం మమ్ముల్ని గుర్తుపట్టలేరు. ఏవైనా పనులు చెప్పడం, పిలవడంలో ఒకరికి చెప్పేవి మరొకరి చెబుతుంటే నవ్వొస్తుంది. మేము ఓ ప్రైవేటు పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాం. –చరణశ్రీ, చరణ్యశ్రీ,తిరుపతి అందరిచూపూ మాపైనే తల్లిదండ్రులకు మేము నలుగురం కవలల. శృతి, ప్రీతి కవలుగా తొలి సంతానంలో జని్మంచాం. మరో ఇద్దరు సిరివెన్నెల, వివేక్ కవలలుగా రెండో సంతానంలో పుట్టాం. ముగ్గురు ఆడపిల్లలం ఒకే రూపంలో ఉంటాం. అమ్మ గీసిన అచ్చు బొమ్మలం. ఏదైనా ఫంక్షన్లకు వెళితే అందరి చూపు మాపైనే ఉంటుంది. –శ్రుతి, ప్రీతి, సిరివెన్నెల, వివేక్, తిరుపతి అదృష్టంగా భావిస్తున్నాం మాది పీలేరు. తిరుపతిలోనే ప్రతి ఏడా దీ తిరుపతిలో జరిగే ట్విన్స్డేకి హాజరవుతుంటాం. మేము ఇద్దరం ఒకేసారి వస్తుంటే ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు సైతం తికమకపడుతారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం. కలలుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. –హస్సేన్, హుస్సేన్, తిరుపతి అభిరుచులు ఒక్కటేవడమాలపేట మండలం, యనమలపాళ్యం గ్రామంలోని మధు, లత దంపతుల కవలలు ప్రగతి, ప్రనతి. వీరిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఆటపాటల్లో, చదువుల్లో ఇద్దరూ ఒకేలా వ్యవహరిస్తారు. కొత్తవారు చూసినప్పుడు ఎవరి పేరు ఏమిటో గుర్తుపట్టలేని విధంగా ఉంటారు. – ప్రగతి, ప్రణతిఇద్దరూ ఇద్దరే చిల్లకూరు మండలం, కమ్మవారిపాళెంకు చెందిన మోరా నాగరాజు, ప్రనూనాలకు రెండో సంతానంగా ఇద్దరు మగ కవల పిలలు పుట్టారు. వీరు చిన్న నాటి నుంచి ఏది చేసినా ఒక్కటిగానే చేస్తుంటారు. వీరు చిల్లకూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. జోషి, జీవన్, కమ్మవారిపాళెం, చిల్లకూరు మండలంగుర్తించాలంటే కాస్త టైమ్ పడుతుంది మాది తిరుపతి. ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదోదవ తరగతి చదువుతున్నాం. ఒకే నిమిషం తేడాతో జని్మంచాం. తల్లిదండ్రులు మమ్ముల్ని గుర్తించినా బంధువులు, స్నేహితులు గుర్తించేందుకు కాస్త టైమ్ పడుతుంది. తదేకంగా గమనిస్తేనే గుర్తుపట్టగలరు. –లక్ష్మీ అక్షయ, లక్ష్మీ ఐశ్వర్య, తిరుపతి -
చుట్టు పక్కల చూడరా..!
కర్నూలు: మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు. అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికై నా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవసంబంధాలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనలే నిదర్శనం. నంద్యాల పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్‌లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. కర్నూలు నగరానికే చెందిన రాజ్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు.నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్‌స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి.పలకరించి ఎన్నాళ్లైందో..ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు..నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికై నా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. -
మా వారి ప్రవర్తనతో విసిగిపోయాను...
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన పనిలో నిత్యం బిజీగా ఉంటారు. తన ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటం, ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మీటింగ్‌కు అటెండ్ అవాల్సి రావడం, వర్క్ ఫ్రమ్ హోం, రాత్రుళ్లు లేటుగా పడుకోవడం వంటివి కోవిడ్ సమయం నుంచి ఎక్కువయ్యాయి. పడుకున్న కొన్ని గంటలు సరిగా నిద్ర పోకపోవడం, పొద్దున్నే చిరాకుగా ఉండటం చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువయ్యాయి. పిల్లల మీద ఉట్టిపుణ్యానికి అరుస్తున్నారు. నా భర్త వేరే ఏ దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని ఎంతో ఆనందించే నేను ఈ మధ్య ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. మీ సలహా కోసం ఎదురు చూస్తూ...– ఓ సోదరి, హైదరాబాద్ప్రియమైన చెల్లెమ్మా! మీ భర్త దీర్ఘకాలిక వత్తిడి వలన కొన్ని మానసిక లక్షణాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. కోవిడ్ తర్వాత పని సంస్కృతిలోని మార్పుల వలన ఈ రోజులలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇంటికి, ఆఫీస్‌కి తేడా కనుమరుగవుతోంది. మీ వారి లక్షణాలను ‘బర్న్ అవుట్’ అని అంటాము. మీ ఆయనకు ఎలాంటి వ్యసనాలు లేవన్నారు. కాని వారు తన ఉద్యోగాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, అతి కోపం, చిరాకు ఇవి తన పనిలో సామర్థ్యాన్ని తగ్గించడమే గాక, తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మున్ముందు శారీరక సమస్యలు కూడా రావచ్చు. పనివేళలపై ముఖ్యంగా ఇంటి వద్ద పని వేళలపై సరిహద్దులు పెట్టడం, సరైన సమయపాలన చేయడం ద్వారా వృత్తి, జీవిత సమతుల్యం మెరుగుపరుచుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతపని ఇతరులకు అప్పగించడం లేదా నిరాకరించడం చేయగలగాలి. మీ కుటుంబ సమయం, విశ్రాంతి సమయాన్ని కూడా మీ మీటింగుల లాగే, అనివార్యమైనవిగా మీ కేలండర్లో రాసుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చు. మీ వారి ప్రవర్తన ఎలా కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో వారితో సానుభూతితో చర్చించండి. ఒక జీవిత భాగస్వామిగా మీ మద్దతు తనకు ఉందని తెలిసినప్పుడు వారు కూడా మార్పునకు గట్టిగా కృషి చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల వలన ఒత్తిడికి లోనవకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసి థెరపీ ద్వారా, మందుల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించి మీ కుటుంబ జీవన నాణ్యతను ఖచ్చితంగా మెరుగు పరుచుకోవచ్చును. -
సంతోషం..సంపూర్ణ బలం
సంపాదనకు కొదవలేకున్నా, సరదాలెన్నో అందుబాటులో ఉన్నా సంతోషం మాత్రం అల్లంత దూరంలో అందీ అందనట్టు ఊరిస్తూనే ఉంది. మన దేశం హ్యాపీ‘లెస్’లో ముందుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని అనేక రకాల అనారోగ్యాలకు అంతుపట్టని మనోవ్యాధులకు ఇదే ప్రధాన కారణమని కూడా స్పష్టం చేస్తున్నాయి. హ్యాపీనెస్‌కి రానురానూ ప్రాధాన్యత పెరుగుతోంది. అదే క్రమంలో కొత్త సంవత్సరపు తీర్మానాల జాబితాలో సైతం సంతోషంగా జీవించడం ముందు వరుసలో చోటు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో సంతోషం గురించిన కొన్ని సంగతులు.. దేశాన్ని సంతోషభరిత దేశంగా మార్చడం కోసం ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా 2022లో మార్చి 20న హ్యాపీనెస్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అదేవిధంగా గుజరాత్ యూనివర్సిటీ ‘హ్యాపీనెస్ కౌన్సెలింగ్’ అనే కొత్త సరి్టఫికెట్ కోర్సును ప్రారంభించింది. వారాంతాల్లో నిర్వహించే ఈ మూణ్నెళ్ల కోర్సులో వేదాలు, ఉపనిషత్తుల బోధనలు, నృత్యం, సంగీతం, లాఫింగ్, ఆహారం ప్రసంగ చికిత్స ద్వారా ఒత్తిడిని నియంత్రించడంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌లోనూ ‘సంతోష మంత్రిత్వ శాఖ’ను ప్రకటించారు. జీడీపీ ద్వారా కాకుండా ఆనందాన్ని అంచనా వేయడం ద్వారా రాష్ట్ర పురోగతిని అంచనా చేయడం కోసం ఈ శాఖ పనిచేస్తుంది. ఆ తర్వాత ‘ఆధ్యాత్మిక శాఖ’ ఏర్పాటు చేసి, దానితో ఈ శాఖను విలీనం చేశారు. ఆ రాష్ట్రం హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే సైతం నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఈ అంశంపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ రామానుజన్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎథిక్స్ అండ్ వర్చుస్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆరు నెలల కోర్సు అందిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జుడీషియల్ అకాడమీలలో సంతోషకరమైన తరగతులను ప్రతిపాదించారు. ‘ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యుఎన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంయుక్తంగా విడుదల చేసిన 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో 143 దేశాలలో భారతదేశం 126వ స్థానంలో నిలిచింది.’ సంతోషం ఎందుకు కోల్పోతున్నాం? సాంకేతిక జీవనశైలి మార్పుల ప్రభావం లేదా సామాజిక నిబంధనల ఒత్తిడితో సమస్యలను ఎదుర్కోవడం వల్ల దేశంలోని 1.3 బిలియన్ల మంది ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ఫలితాలను విశ్లేíÙస్తే అనుబంధలేమి.. ఆనందమేదీ? స్నేహితులు కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఆనందానికి బాటలు వేస్తాయి. అవే జీవితంలోని అసంతృప్తుల నుంచి మనల్ని రక్షిస్తాయి. వయసు రీత్యా వచ్చే మానసిక శారీరక క్షీణతను ఆలస్యం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ పరిసరాలకు మార్పులు, న్యూక్లియర్ ఫ్యామిలీల వెల్లువ అనుబంధాల విచి్ఛన్నానికి కారణమయ్యాయి. చాలామంది కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండటం లేదు. వీరిలో చాలా తక్కువ మందికి మాత్రమే నిజమైన స్నేహితులున్నారు. పనివేళలు ముగిశాక సోషలైజేషన్ తగ్గిపోయింది. సామాజిక మాధ్యమాల వల్ల ఏకాంతం.. మన దేశంలోని వృద్ధులే యువత కంటే సంతోషంగా ఉన్నారని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వెల్లడించడం గమనార్హం. యువత ఆనందం కోసం సాంకేతికతపై అధికంగా ఆధారపడటం దీనికో కారణం. మన మెదడులో పుట్టే డోపమైన్(ఆనందం, సంతృప్తికి ప్రేరణ అందించే రసాయనం)ని సోషల్ మీడియా అల్గారిథమ్‌లు తాత్కాలికంగా ప్రేరేపిస్తాయి. అందుకే ఆన్లైన్లో గడిపే సమయం చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన భావోద్వేగ వికాసానికి బాటలు వేయదు. స్నేహితులతో ముఖాముఖి సంభాషణ ఇచ్చే సంతోషాన్ని, నిద్ర వల్ల కలిగే ఆనందాల్ని దూరం చేస్తుంది. యువతలో ఆందోళన.. యువతలో విజయం కోసం ఆకలి కొన్ని ప్రతికూల అంశాలతోనూ ముడిపడింది. ఏ విధంగానైనా సరే విజయం సాధించాలనే ఆతృత యువతలో ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతోంది. వ్యక్తిగత లక్ష్యాలతో సామూహిక శ్రేయస్సు పట్ల ఆసక్తి పోయి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య లోతైన సంబంధాలను కోల్పోవడం జరుగుతోంది ప్లస్.. మైండ్‌ఫుల్ నెస్.. ట్రాక్ యువర్ హ్యాపీనెస్ అనే ఐ ఫోన్ యాప్ ట్రాకర్‌ని ఉపయోగించి హార్వర్డ్ మనస్తత్వవేత్తలు మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ డేనియల్ గిల్బర్ట్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, మనం పనిచేసే గంటల్లో 47% ఏం జరగడం లేదు? అనే దాని గురించే ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలపై కాకుండా వేరే అంశాలపై ఆలోచిస్తున్నాం. ఈ తరహా పగటి డ్రీమింగ్ మనకు సంతోషాన్నివ్వదు. దీనికి మన సంప్రదాయ మార్గాలైన మైండ్ ఫుల్ నెస్ సాధన, మెడిటేషన్లలో పరిష్కారం లభిస్తుంది. కారణాలేవైనా.. సంతోషాన్వేషణ అయితే తప్పనిసరి అని తెలుస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరారంభ వేళ.. సాక్షి పలువురు నిపుణులతో సంభాషించి.. సంతోషార్థుల కోసం పలు సూచనలను అందిస్తోంది.అంచనాలను మరచితేనే.. ఆనందం.. ఆనందం, దాని స్వచ్ఛమైన రూపంలో, బాహ్య పరిస్థితులపై ఆధారపడిన భావోద్వేగం కాదు. అంతర్గత సామరస్యం నుంచి ఉత్పన్నమయ్యే శాశ్వత స్థితి. నిజమైన ఆనందం కోరికల నుంచి విముక్తి పొందడం. దీని అర్థం ఆకాంక్షను కలిగి ఉండకూడదని లేదా అంకితభావంతో మన లక్ష్యాలను కొనసాగించక్కర్లేదని కాదు. మన కోరికలు, లక్ష్యాలు ఆకాంక్షలు ఉండటమే మనల్ని మనుషులుగా మారుస్తుంది. ఖచి్చతంగా లక్ష్యాల కోసం పని చేయండి. అయినప్పటికీ జరుగుతున్నది అంగీకరించి సంతోషంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆనందాన్ని కాపాడుకోగలిగేవారే అత్యంత సంతోషకరమైన వ్యక్తులు అని నా ఆధ్యాత్మిక గురువు షాజహాన్‌పూర్‌కి చెందిన శ్రీరామ్ చంద్ర అంటారు. మన అంచనాలను తగ్గించుకోవడం ద్వారా, కోరికల చక్రం నుంచి మనల్ని మనం విడిపించుకుంటాం. అంతర్గతంగా నిజమైన ప్రశాంతత కనుగొంటాం. ఇది అంతర్గత శాంతికి అనంతమైన ఆనందానికి దారి తీస్తుంది. ఈ మార్గంలో జీవించడానికి అత్యుత్తమ సాధనం ధ్యానం. – కమలేష్ పటేల్ (దాజి), హార్ట్‌ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ఆహారం.. ఆనందం.. జపనీస్ కల్చర్‌లో టీ సెర్మనీ అని ఉంటుంది. ఇది ఓ రకంగా టీ పార్టీ లాంటిది. ఇందులో పాల్గొన్న వారికి కప్స్‌లో కాకుండా బౌల్లో తేనీటిని ఇస్తారు. ఆ బౌల్ మీద విభిన్న రకాల జపనీస్ చిత్రాలు ఉంటాయి. టీ తాగేవారు చప్పుడు చేస్తూ తాగాలి.. ఆ బౌల్ మీద ఉన్న బొమ్మల్ని గుర్తించాలి. టీ రుచి గురించి మాట్లాడాలి. తయారు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ..ఇదంతా ఎందుకంటే.. ఆ మూమెంట్లో బతకడం అనేది అలవాటు కావాలని ఇలా చేస్తారు. బరువు తగ్గడం, పెరగడం, ఆరోగ్యం, అనారోగ్యం.. వీటన్నింటి చుట్టే మనం ఆలోచిస్తాం. కానీ ఆహారం అనేది అత్యంత భావోద్వేగ భరిత అంశం. సంస్కృతి సంప్రదాయాలతో మొదలుకుని అనేక రకాల అనుభూతులతో ఆహారం ముడిపడి ఉంటుంది. సంక్రాంతి సమయంలో అరిసెలు తినడం ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అలాగే వినోదమైనా, విషాదమైనా వాటిలో విందులను భాగం చేయడం కూడా అలాంటిదే. ఆహారం అనేది మన మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది కాబట్టే. ఒక రుచికరమైన పదార్థాన్ని చూడగానే తినాలనిపించడం, నోట్లో నీళ్లూరడం, అవి నోటిలోకి వెళ్లగానే ఆ రుచికి మనలో కలిగే స్పందనలు.. ఇవన్నీ కూడా ఫుడ్ ఇంపాక్ట్‌కి నిదర్శనాలు. తినేటప్పుడు కరకరమని సౌండ్ వచ్చే పదార్థాలు మరింత ఎక్కువ సంతృప్తిని అందిస్తాయని, అందువల్లే చిప్స్ వంటివి ఎక్కువగా తింటామని ఒక అధ్యయనం చెబుతోంది. పాలు మరుగుతున్నప్పుడు వచ్చే వాసన కూడా బ్రెయిన్ కెమికల్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక పండ్లలో యాంటిఆక్సిడెంట్స్ ఒత్తిడిని తొలగించి మనసు తేలికైన భావన అందిస్తాయి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్కన్నీరు పెట్టుకో.. కష్టాల్ని మర్చిపో.. కష్టాలు, సమస్యలు లేకుండా మనిషి జీవితం ఉండదు. అవి మర్చిపోవడానికి దేవుడు ఇచి్చన వరం కన్నీరు. ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంటుంది. ఏడుపు.. ఆరోగ్యానికి మదుపు.. క్రైయింగ్ పలు ఆరోగ్యకర లాభాలను అందిస్తుందనేది శాస్త్రీయంగా రుజువైన విషయం. అయితే ఆధునిక సమాజంలో బాధ వచి్చనప్పుడు రకరకాల కారణాల వల్ల దుఃఖాన్ని దిగమింగుకోవడం జరుగుతోంది. ఇది మరింతగా ఆరోగ్యానికి హాని చేస్తోంది. దానికి బదులుగా కాసేపు మనసారా ఏడవనిస్తే మనసుకు చాలా నిశి్చంతగా తేలికగా అనిపిస్తుంది. అది మనల్ని బాధాకరమైన అనుభవం నుంచి దూరంగా తీసుకెళుతుంది. ఏడుపు వల్ల మనసు మాత్రమే కాదు కళ్లు, కన్నీటి వాహికలు సైతం శుభ్రపడతాయి. సాధారణ కంటి సమస్యలకు వాడే ఐడ్రాప్స్కి ఇది మేలైన ప్రత్యామ్నాయం అని చాలా మందికి తెలీదు. అందుకే మనకు బాధ కలిగించిన వాటిని గుర్తు చేసుకుంటూ కనీసం వారానికో కుదరకపోతే కనీసం నెలకు ఒకసారైన తనివిదీరా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవాలి. – కమలేష్, క్రైయింగ్ అండ్ లాఫర్స్ క్లబ్ నిర్వాహకులుఆరోగ్యమే.. ఆనందం.. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు. చిన్నపాటి, స్థిరమైన మార్పులు దీర్ఘకాలం పాటు సంతృప్తికరమైన సంతోషకర జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయి. కాలుష్యం విజృంభిస్తోంది. పురుగు మందులు వాయు కాలుష్య కారకాల వల్ల హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. కాలుష్యానికి వీలున్నంత దూరంగా జీవించే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలిక ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. ధ్యానం, యోగా లేదా శ్వాస సంబంధ వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను దినచర్యలో చేర్చాలి. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల అలసటకు అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్లాస్టిక్లు కొన్ని సౌందర్య సాధనాల్లో కనిపించే రసాయనాలు శరీర సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఊబకాయం, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేయని ఆహారాలను గుర్తించి వదిలిపెట్టాలి. చక్కెర, అనారోగ్య కొవ్వులు అధికంగా ఉన్నవి తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో చేర్చాలి. రెగ్యులర్ వైద్య పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రంగా మారకముందే గుర్తించవచ్చు. తద్వారా జీవనశైలి ఆరోగ్య విధానాలపై సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. – డా.సమత తుల్ల, జనరల్ ఫిజిషియన్నవ్వు నలభై విధాల రైటు.. బాహ్యంగా మనం కోరుకున్నది దక్కినప్పుడు సంతోషం వస్తుంది. అయితే ఎప్పుడూ మనం కోరుకున్నది దక్కుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి ఆ మార్గంలో దీర్ఘకాల సంతోషానికి గ్యారెంటీ లేదు. మరో మార్గం మన అంతర్గతంగా పొందేది. పాడటం, నృత్యం చేయడం, ఆడుకోవడం, నవ్వుకోవడం వంటి వాటి వల్ల మనకు అంతర్గత ఆనందం వస్తుంది. దీని ద్వారా సెరటోనిన్, ఆక్సిటోసిన్ వంటి కొన్ని రకాల హ్యాపీ కెమికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. పరిస్థితులు సంతోషం కలిగించకపోయినా నవ్వడం ద్వారా మూడ్‌ని మార్చుకోవచ్చు. ఇక్కడ నవ్వును మనం ఒక వ్యాయామంలా భావించాలి. మరికొందరితో కలిసినప్పుడు సులభంగా నవ్వడం సాధ్యం. సహజంగా పుట్టే నవ్వు వల్ల కలిగే లాభాలకు, నవ్వాలని కోరుకుని నవ్వడం ద్వారా వచ్చే ఆరోగ్య ఫలితాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే మా లాఫ్టర్ యోగా.. ద్వారా వేల సంఖ్యలో సభ్యులు హాయిగా ఆనందంగా నవ్వుతున్నారు. – డాక్టర్ మదన్ కటారియా, లాఫ్టర్ యోగా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు సంతోషం సహజ లక్షణం.. సంతోషం అనేది మన సహజ లక్షణం స్వాభావికం. కానీ రకరకాల ప్రభావాలతో దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. పసిపిల్లాడు.. 400సార్లు నవ్వుతాడు. కాస్త పెద్దయి రెండేళ్ల వయసుచ్చేసరికి 200 సార్లు నవ్వుతాడు. 16ఏళ్లు వచ్చేసరికి 16 సార్లే నవ్వుతాడని అధ్యయనాలు చెబుతున్నాయి. సంతోషం ప్రాణశక్తితో లింక్ అయి ఉంది. పిల్లల్లో ప్రాణశక్తి హైలెవల్లో ఉంటుంది. మన శ్వాస, భావోద్వేగాలకు సంబంధం ఉంది. మనం సంతోషంగా ఉంటే ఒక రకంగా శ్వాసిస్తాం. ఆగ్రహంగా ఉన్నప్పుడు మరో రకంగా శ్వాసిస్తాం. వీటి మధ్య వ్యత్యాసం పసిగడితే కోపం వల్ల కలిగే నష్టం అర్థమవుతుంది. అలాగే రేపేం జరుగుతుందో అనే ఆందోళనతో కాదు. ప్రస్తుతంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలం. దీనికి సుదర్శన క్రియ బాగా దోహదం చేస్తుంది. విజయం కోసం మనం సంతోషాన్ని పణంగా పెడుతున్నాం. కానీ చెదరని చిరునవ్వుతో ఉండటమే నిజమైన విజయం. ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాను, అలా జరిగితే హ్యాపీగా ఉంటాను అనే ఆలోచనలతో ఉండొద్దు. చిన్నారులు ఎందుకు సంతోషంగా ఉంటారు? వారికి సంతోషంగా ఉండడానికి కారణాలు అక్కర్లేదు కాబట్టి.. మన మనసు జరిగినదో, జరగబోయేదో.. దాని గురించే ఆలోచిస్తుంది. ప్రాణాయామ, సుదర్శన క్రియలతో సంతోషాన్ని పెంచుకోవడం వీలవుతుంది. – పండిట్ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుఆనందం.. ఆక్సిజన్.. ఆనందం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. కాబట్టి ఎవరైనా సరే తమ సొంత జీవితాన్ని పరిశీలించి, ‘నా ఆనందం ఏమిటి, నా ఉద్దేశ్యం ఏమిటి, సామాజిక సేవ పట్ల నా ఆలోచన ఏమిటి? విశ్లేషించుకుని తన సొంత ఆనందాన్ని నిర్వచించుకోవాలి. మనం పని, డబ్బు సంపాదించే విధానం శారీరక మానసిక ఆరోగ్యం వీటి గురించే ఆలోచిస్తాం. అయితే మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం పనిలో మరింత మెరుగవుతామని ఉత్పాదకత పెంచగలుగుతామని సృజనాత్మకంగా ఉంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అన్నింటికన్నా ముందు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఒత్తిడి అనేది మన మొదటి సైలెంట్ కిల్లర్, సంతోషంగా ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మంచి మూడ్‌లో ఉంటాం. ఇతరుల మాటలను వింటూ వారిని గౌరవిస్తాం. మంచి సంబంధాలు పెంచుకుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు, పని మెరుగ్గా ఉంటుంది. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. – రాజేష్.కె.పిల్లానియా, ఇండియాస్ హ్యాపీనెస్ ప్రొఫెసర్ -
కాలం మారింది.. నాన్నను మార్చింది
నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న -
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్‌లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్‌రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్‌లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
తాతయ్య చివరి కోరిక కోసం..
‘అమ్మా... ఆ చెట్టును నువ్వొకసారి తాకి రావాలి’ అని కోరాడు ఆమె తాత చనిపోయే ముందు. అమ్మమ్మలు, తాతయ్యల మాటల్ని చాదస్తంగా తీసి పారేసేవారు ఉన్న ఈరోజుల్లో ఆ మనవరాలు తాత చివరి కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. దేశ విభజనకు ముందు తన తాత ఏ చెట్టునైతే పొలంలో తన నీడగా చేసుకున్నాడో ఆ చెట్టును తాకింది.తన పూర్వీకుల స్వగ్రామంలోని మట్టిని మూట గట్టుకుంది. ఇంకా అక్కడే ఉన్న తన వాళ్లను చూసి ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దవాళ్ల గుండెల్లో గాఢంగా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారు జీవించి ఉండగానే నెరవేరిస్తే ఆనందం. మరణించాక నెరవేరిస్తే మనశ్శాంతి.‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చి, ఇంత పేరు గడించినా సినీ కవి గుల్జార్‌కి గుండెలో ఒక కోరిక ఉండిపోయింది. అది పాకిస్తాన్‌లోని తన పూర్వీకుల సొంత ఊరిని చూసి రావాలనేది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అతనికి అనుమతి దొరకలేదు. చనిపోయేలోపు చూస్తానో లేదో అంటాడాయన. దేశ విభజన వల్ల రాత్రికి రాత్రి కుటుంబాలు చెదిరిపోయి కొందరు ఇండియా చేరారు... కొందరు పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఇరు దేశాలలో సెటిల్ అయిన వారి తలపోతల గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. రాకపోకలు జటిలం అయ్యాక ఇక బంధాలు ఫోన్లకు పరిమితం అయ్యాయి. పంజాబీలు అధికంగా ఈ ఎడబాటును భరించారు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల వయసున్న రీనా చిబ్బేర్ అనే ఆమె ‘రావల్పిండిలో మా పూర్వీకుల ఇల్లు చూసి రావడానికి అనుమతి ఇవ్వండి’ అని వేడుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆమె ఎంతో సంబరంగా వెళ్లడం ప్రధాన వార్తాంశం అయ్యింది. అయితే దేశ విభజన సమయంలో జలంధర్‌కు వచ్చి స్థిరపడిన బహదూర్ సింగ్‌కి మాత్రం అలాంటి కోరిక నెరవేరలేదు. 1947లో అతను తన చిన్న తమ్ముణ్ణి తీసుకుని ఇండియా వచ్చేశాడు. నడిమి తమ్ముడు అక్కడే ఉండిపోయాడు. ‘మా తాత చనిపోయే వరకూ కూడా పాకిస్తాన్లో ఉన్న తమ్ముణ్ణి గుర్తు చేసుకుని ఏడ్చేవాడు. ఆ అన్నదమ్ములు మళ్లీ జీవితంలో కలవకుండానే కన్ను మూశారు’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్. ఆమె ఇటీవలే తాత కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌కు దగ్గరగా ఉన్న తమ పల్లెను దర్శించింది.ఆ ఇల్లు... ఆ చెట్టు‘మా తాతది సియోల్‌కోట్ దగ్గర ఉన్న పల్లెటూరు. ఆయన పొలంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ ఇంటిని, చెట్టును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. వాటి గురించి కథలు కథలు చెప్పేవారు. ఆ చెట్టును ఒకసారి తాకి రావాలి. తల్లీ అనేవారు నాతో. జలంధర్ వచ్చేశాక ఆయన తన తమ్ముడికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ 1986లో గాని వాటికి జవాబు రాలేదు. అప్పటికే మా తాత నడిమి తమ్ముడు ఇస్లాంలోకి మారాడు. అయితే మా ఇంటి పేరును ‘గుమర్’ని వదలకుండా తన పేరు గులామ్ ముహమ్మద్ గుమర్ అని పెట్టుకున్నాడు. ఆ ఇంటిని ఆ చెట్టును అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయాక ఆయన కొడుకు కుటుంబం మా జ్ఞాపకాలను పదిలంగా ఉంచిందని అర్థమయ్యాక ఎలాగైనా వెళ్లాలని తాతయ్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను’ అంది కరమ్‌జిత్ కౌర్.ఘన స్వాగతం‘నేను పాకిస్తాన్ వెళుతున్నానంటే మా అత్తగారి కుటుంబం వద్దంటే వద్దంది. నాక్కూడా చాలా భయాలు కలిగాయి. కాని అక్కడ నేను అడుగు పెట్టగానే మా నడిమి తాత కుమారుడు నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నా పెళ్లి కార్డు జాగ్రత్తగా దాచుకుని ఉన్నారు. మా తాత రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అప్పట్లో మా ఇంట్లో వాడిన తిరగలి అలాగే ఉంది. మా పొలంలో రావిచెట్టు సంగతి చెప్పనక్కర్లేదు. కళకళలాడుతోంది. మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యి మర్యాదలు చేశారు. మా వూరి మట్టి తీసుకుని తిరిగి వస్తున్నాను’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్.కష్టసాధ్యమైన తాత కోరికను కొద్దిగా అయినా తీర్చిందీ మనవరాలు. ‘ఒరేయ్... కాశీ చూపించరా’, ‘మా ఊరు చూపించరా’, ‘ఫలానా బంధువు ఇంటికి తీసుకెళ్లరా’ అని పెద్దవాళ్లు కోరితే కాదనవద్దు. ఆ కోరిక లోతు మనకు తెలియదు. చెప్పినా అర్థం కాదు. చేయవలసిందల్లా కోరింది తీర్చడమే.కుటుంబాలు కలిపే సంస్థతాత మరణించాక లండన్‌లో స్థిరపడిన కరమ్‌జిత్‌కు... కఠినమైన వీసా నియమాల వల్ల పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సులువు కాలేదు. అయితే దేశ విభజన సమయంలో విడిపోయిన పంజాబీ కుటుంబాలను తిరిగి కలిపేందుకు ‘జీవే సంఝా పంజాబ్’ పేరుతో ఒక సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నంతో వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేందుకు కరమ్‌జిత్ కౌర్‌కు అనుమతి లభించింది. ‘నేను పాకిస్తాన్‌కు వెళుతున్నానని తెలిసి మా చిన్నతాత కుమారుడు తనని కూడా తీసుకెళ్లమని ఎంతో ఏడ్చారు. కాని ఆయన వయసు రీత్యా వీల్‌చైర్‌లో ఉన్నారు. నీ కోసం మన ఊరి మట్టి తీసుకొస్తానులే పెదనాన్నా అని చెప్పి వచ్చాను’ అంటుందామె భావోద్వేగంతో. -
నాన్న కూచులు
వెనకటి తరంలో పిల్లలకు తండ్రి దగ్గర అంత చనువుండేది కాదు. వారికి ఏం కావాలన్నా అమ్మతో రికమెండ్ చేయించుకోవాల్సిందే. నాన్న వస్తున్నాడంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆపేసి వచ్చి పుస్తకాలు ముందరేసుకుని చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాళ్లు. అయితే ఆ తరం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు అమ్మ కన్నా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. తమకు కావలసిన వాటిని నాన్నతోనే అమ్మకు రికమెండ్ చేయించుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే చేస్తుంటారా?నాన్నలుప్రాక్టికల్చాలా విషయాలలో అమ్మలకన్నా నాన్నలు ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉంటారు.ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. చిన్నారుల చిన్ని జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, సవాళ్లనుప్రాక్టికల్గా ఏ విధంగా చూడాలో వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు. అంతేకాదు, దేనినైనా రెండు వైపుల నుంచి ఏ విధంగా ఆలోచించాలో తండ్రులే పిల్లలకు నేర్పుతారు. నాన్న దగ్గరుంటే నిశ్చింతపిల్లలకు ఏమైనా సమస్య అంటే తోటి పిల్లల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా నాన్నతో చెబుతా’ అని వారికి వార్నింగిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నాన్నే హీరో. సర్వశక్తిమంతుడు. నాన్నకు చెబితే ఏ పని అయినా తేలిగ్గా అయిపోతుందని, దానికి తిరుగుండదని వాళ్ల భావన. అందుకే నాన్న వాళ్లకొక నిశ్చింత.ఆటలు... పాటలుచాలామంది నాన్నలు ... పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు. కొత్త కొత్త ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఆడడంలో మెలకువలు చెప్పి సాయం చేస్తుంటారు. అమ్మలతో పోల్చితే ఆటల విషయంలో ఆంక్షలు తక్కువ. తమని ఒంటరిగా పంపడానికి భయపడుతుంటే స్కూల్లో టీచర్లు ప్లాన్ చేసే టూర్లకు, ఎక్స్కర్షన్లకు అమ్మలకు నచ్చజెప్పి ఒప్పించి మరీ వాళ్లకు కావలసినంత పాకెట్ మనీ ఇచ్చి సాగనంపుతారు. ఆంక్షలు తక్కువఅమ్మతో పోల్చితే నాన్న దగ్గర ఆంక్షలు తక్కువ... ఉదాహరణకు అబ్బబ్బా.. ఆ షూస్ విప్పకుండా అలా లోపలికి వచ్చేస్తావెందుకు... ఛీ.. యూనిఫారమంతా ఇంకు పూసేసుకున్నావు... దీనిని బాగు చేసేదెలా? తీసుకెళ్లిన ఫుడ్డంతా బుద్ధిగా తినకపోయావో.... ఇంకేం లేదు.. ఈ ఎగ్జామ్స్‌లో మార్కులు తక్కువ వస్తే ఊరుకోను... ఇటువంటి ఆంక్షలు నాన్నల దగ్గర ఉండవు.నాన్నంటే ఓ సాహసంపిల్లలకు నాన్నంటే నిజంగా ఓ అడ్వెంచర్. గోడలెక్కడం, చెట్లెక్కడం, గంతులు పెట్టడం... సైకిల్ మీద సవారీలు, కారు, బైకు డ్రైవింగ్ నేర్పించడం... ఇలా కొత్తగా ఏదైనా చెయ్యడం... లాంటివాటికి నో చెప్పక సై అంటారు. తండ్రితో తీపి జ్ఞాపకాలుసెలవులొస్తే బయటికి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, సినిమాలకు, జూలకి తీసుకెళ్లడం, కోరిన చోటుకు తీసుకెళ్లి దిగబెట్టి రావడం... ఇలాంటి జ్ఞాపకాలెన్నో తండ్రులతో బిడ్డలకు ముడిపడి ఉంటాయి. అందువల్ల నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం.నాన్న... నవ్వురస భరితంచాలామంది తండ్రులు పిల్లలతో హాయిగా జోకులు వేస్తుంటారు. లేదంటే చిన్న చిన్న కామెడీ సీన్లు కూడా సృష్టిస్తుంటారు. ఏం చేసినా, పిల్లలు హాయిగా నవ్వుకునేలా చేస్తారు. గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని తమ జోకులు, కామెడీ సీన్లతో తేలిగ్గా మార్చేసి, నవ్వుల పువ్వులు విసురుతారు. రోల్ మోడల్స్పిల్లలందరికీ నాన్నలే వాళ్ల రోల్ మోడల్. జీవితంలో ఎదురయే సమస్యలు, సవాళ్లను తట్టుకుని దృఢంగా ఎదిగే నాన్నలు తమను తాము రోల్‌మోడల్స్‌గా మలచుకుంటారు. పిల్లలతో గాఢానుబంధాన్ని ఏర్పరుచుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా ఎలా నెరవేర్చుకోవాలో పిల్లలకు నేర్పకనే నేర్పుతారు. ఇక్కడ మనం నాన్న గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం... అలా అని అందరి నాన్నలూ అలా ఉండకపోవచ్చు. ఉండాలనీ ఏం లేదు. కాకపోతే పూర్వం కన్నా పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఇప్పటికాలం పిల్లలు నాన్నలతో ఫ్రీగా ఉంటున్నారు. నాన్నలు కూడా గాంభీర్యాన్ని విడిచిపెట్టేశారు. నాన్నలతో గాఢమైన బంధం ఉండే కూతుళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అమ్మలను రోల్మోడల్స్లా తీసుకునే కొడుకులూ ఉన్నారు. తండ్రి వస్తుంటే... చేస్తున్న చిలిపి పనులు ఆపేసి తటాలున తలుపు చాటున దాక్కునే పిల్లలు ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. తండ్రులు కూడా పిల్లలకేసి ఉరిమి చూడటం లేదు. పిల్లల అల్లరిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమతో ్రపోత్సహిస్తున్నారుభారతీయ యోగాకు పెద్దపీట అమెరికా వ్యాప్తంగా దాదాపు 6,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఇవి అమెరికా సంయుక్త దేశాల రెస్టారెంట్ మార్కెట్లో దాదాపు 1 శాతం వాటాను ఆక్రమించడం విశేషం. ఇక మిషెలిన్ గైడ్ రెస్టారెంట్లలో భారతీయ రుచులను కోరుకుంటున్న వారు మూడు శాతంపైనే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారతీయ యోగా... యోగులు, రుషులు మనకందించిన అపూర్వ విజ్ఞానమిది. ఇప్పుడీ విజ్ఞానం విదేశీయులను విస్మయపరుస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యాల సాధనకు దీన్ని మించిన సాధనం లేదని పాశ్చాత్యులు భావిస్తున్నారు. 2023 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మొత్తం యోగా స్టూడియోల సంఖ్య 36,000 పైమాటే!అమెరికాలో లాయర్లో 1.3 శాతం మంది, జర్నలిస్టుల్లో దాదాపు మూడుశాతం మంది భారతీయ సంతతికి చెందినవారే.డాలర్లు కురిపిస్తున్న ఇండియన్ సినిమాలు2015 నుంచి 2023 మధ్య వివిధ బాషలకు చెందిన 96 భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలయ్యాయి. నార్త్కరోలినాప్రాంతంలో ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఈ కారణంగానే ఇక్కడ విడుదలైన ఒక్కో సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తక్కువ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా చూస్తే వీటివిలువ 340 మిలియన్ల అమెరికన్ డాలర్లుస్పెల్ బీ లోనూ మన కూనలదే హవాస్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో భారతీయ సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఆ ఏడాది విజేత బృహత్ సోమ సహా భారతీయ సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఈ పోటీల్లో 2000 నుంచి 2023 వరకూ మొత్తం 34 మంది విజేతలుగా నిలవగా వారిలో 28 మంది మన విద్యార్థులే కావడం మనందరికీ గర్వకారణం. -
అనుకున్న పనులు జరగడం లేదా..?
ఒక్కోసారి ఎంత ప్రయాసపడ్డా తలపెట్టిన పనులు ఒక పట్టాన జరగవు. గ్రహాల సానుకూలత లేనప్పుడు కార్యసిద్ధి కలలో మాటలా అనిపిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో పనులు మందగిస్తాయి. తరచు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చు. 👉ఇంట్లో ఏళ్ల తరబడి వాడకుండా ఉన్న పాత వస్తువులను వదిలించుకోండి. 👉 వీలైనంత వరకు ఇంట్లో రోజూ ఒకేచోట కూర్చుని భోజనం చేయండి. మంచం మీద కూర్చుని భోంచేసే అలవాటు ఉంటే మానుకోండి. 👉 తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోండి. కొత్త పనులు తలపెట్టబోయే ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. గురువులను, గురు సమానులను, సాధు సన్యాసులను ఆదరంగా చూడండి. వీలైతే వారికి భోజనం పెట్టడం, వస్త్రాలను కానుకగా ఇవ్వడం వంటివి చేసి వారి ఆశీస్సులు పోందండి. 👉బియ్యం, గోధుమలు, శనగలు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పిల్లలకు, యాచకులకు, వికలాంగులకు పంచిపెట్టండి. ముఖ్యంగా ఆది, గురు, శుక్రవారాల్లో ఇలా చేయడం మంచిది. 👉ఇంట్లో నిత్యపూజకు పసుపు రంగు పూలను ఉపయోగించండి. అలాగే, దేవాలయాలలో పసుపురంగు పూమాలలను సమర్పించండి.– సాంఖ్యాయన -
ఇంటిమసీ లేకుంటే మంటలు తప్పవు
కవిత, నరేందర్ లకు పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఉద్యోగం. అన్యోన్యంగా ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకుంటారు. వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ మీట్స్, టూర్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు.కానీ నెలకో, రెణ్నెళ్లకోసారి గొడవ గ్యారంటీ. చిన్న మాట పట్టింపులతో మొదలై తిట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్తోంది. వీళ్ల గొడవలు చూసి పిల్లలు భయపడుతున్నారు. కలిసుండి ఇలా రోజూ కొట్టుకునేకంటే విడిపోవడమే బెటరని నిర్ణయించుకున్నారు. మ్యూచువల్ డైవోర్స్ కోసం లాయర్‌ను కూడా సంప్రదించారు. కోర్టుకు వెళ్లకముందు ఒకసారి మేరిటల్ కౌన్సెలింగ్ కు వెళ్లమని ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడని వచ్చారు.కవిత, నరేందర్ లతో కలివిడిగానూ, విడివిడిగానూ మాట్లాడాక వాళ్ల మధ్య physical intimacy (శారీరక సాన్నిహిత్యం) తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. కవిత శాలరీ ఎంతో కూడా నరేందర్ కు తెలియదు. అడిగినా చెప్పదు. ‘‘ఇంటి ఖర్చులకు నా షేర్ నేను ఇస్తున్నా కదా. నా శాలరీ గురించి నీకెందుకు? డామినేట్ చేయాలని చూస్తున్నావా?’’ అంటూ గొడవ పడుతుంది.నరేందర్ శాలరీ ఏం చేస్తున్నాడో కవితకు తెలియదు. శాలరీ అంతా ఏం చేస్తున్నావ్? అని అడిగితే ‘‘నేనేదో చేస్తున్నా నీకెందుకు? నీ శాలరీ గురించి నాకు చెప్పనప్పుడు, నా శాలరీ గురించి అడిగే రైట్ నీకు లేదు’’ అని గొడవపడతాడు.ఇలాంటి గొడవలు వాళ్లకు మామూలే. ఇన్ని గొడవల మధ్యా వాళ్లకున్న సుగుణమేంటంటే... పగలెన్ని గొడవలున్నా రాత్రికి ఒకటైతే అన్ని గొడవలూ సర్దుకుంటాయని బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు. కానీ మేరిటల్ రిలేషన్షిప్ బలపడాలంటే, నిలబడాలంటే ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే చాలదని, ఇంకా చాలా కావాలని వాళ్లకు తెలియదు. అందువల్ల ఆ దిశగా వాళ్లెలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద గొవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విడాకుల ప్రయత్నాలు.జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అనేకమందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా ఉంటుంది. కానీ బంధాలు బలపడాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. వాటిగురించి ఈరోజు తెలుసుకుందాం.Types of IntimacyPhysical Intimacy: చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకకోవడం, హగ్ చేసుకోవడం వంటివి ఫిజికల్ ఇంటిమసీకి ఉదాహరణలు. అయితే కవిత దీన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంది, నరేందర్ కు అది నచ్చదు. ఫిజికల్ ఇంటిమసీ బెడ్రూమ్ కే పరిమితం కావాలనేది అతని ఫిలాసఫీ.Emotional Intimacy: ఆఫీస్ లో ఆరోజు ఏం జరిగింది? పని ఒత్తిడి ఎలా ఉంది? ఏమైనా ఆందోళనగా ఉందా? భయమేస్తుందా? ఇలాంటి ఎమోషనల్ విషయాలను మాట్లాడుకోండం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవిత, నరేందర్ ల మధ్య ఇది శూన్యం.Intellectual Intimacy: చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం, చర్చించుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవితకు ఫిక్షన్ బుక్స్ అంటే ప్రాణం, నరేందర్ కు అసలు బుక్స్ అంటేనే చిరాకు. ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటాడు.Experiential Intimacy: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలిసి పనిచేయడం, సమయాన్ని గడపడం ముఖ్యం. కవిత, నరేందర్ ల మధ్య ఇది ఫర్వాలేదు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు.Spiritual Intimacy: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను పార్టనర్ తో చర్చించడమే స్పిరిచ్యువల్ ఇంటిమసీ. నరేందర్ పరమ భక్తుడు, కవిత ఆర్జీవీ రామూయిజం ఫాలోయర్. ఇది చాలు కదా గొడవలు పడటానికి.ఆత్మీయతకు ఆటంకాలుప్రతి రిలేషన్ లోనూ విభేదాలుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో పార్టనర్ నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఇంటిమసీని దెబ్బతీస్తుంది. మితిమీరిన పని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా దంపతుల మధ్య ఇంటిమసీని దూరం చేస్తుంది. పార్టనర్ తో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఇంటిమసీని పెంపొందించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే అది మీ ఇంటిమసీని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు, కొంతమంది గతానుభవాలు, గాయాల వల్ల పార్టనర్ తో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే fear of intimacy అంటారు. కవితలో ఇది కనిపించింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే అన్ని రకాల ఇంటిమసీలు ఉండేలా చూసుకోవడం అవసరం. కవిత, నరేందర్ లకు వారి ఇంటిమసీల మధ్య విభేదాలు వివరించడంతోపాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఎక్సర్ సైజ్ లు చేయించాను. కొద్ది సెషనల్లోనే వారి మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగింది. వారిప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.ఇలా చేయండి... మీ జీవితంలోనూ సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఫిజికల్ ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, హగ్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీని పెంపొందిస్తాయి. మీ పార్టనర్ చెప్పే మాటలు వినడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం పెంచుకోవడం ఎమోషనల్ ఇంటిమసీని పెంచుతుంది. భోజనం చేస్తున్నప్పుడు లేదా మీ పార్టనర్ తో కలిసి టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ దూరంగా ఉంచండి. ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అనుభవించడం సరదాగా ఉంటుంది. అందుకే మీరిద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీని పెంపొందిస్తుంది.మీకు నమ్మకమున్నా లేకపోయినా పార్టనర్ విశ్వాసాలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ స్పిరిచ్యువల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
అడవి మొక్క
శిశిరానికి ఆకులు రాలుస్తున్న ఒక పెద్ద వేపచెట్టు మొదట్లో గోధుమ రంగు ప్లాస్టిక్ పైపు పెట్టి నీళ్ళు పడుతోంది కరుణ. రెండు చేతులకు చెరొక రెండు డజన్ల గాజులు వేసుకుని, పడమటి ఎండ మొహం మీద పడుతుంటే, చీర తడిసిపోకుండా సర్దుకుంటూ, మొక్కలకు నీళ్ళు పడుతోందామె. ఓ వైపు మొత్తం కొత్త పూల కుండీలు, మరోపక్క కాయగూరల పాదులు, మరోపక్క వేప, మామిడి చెట్లు.. మధ్యలో రెండు చిన్న గదులతో డాబా ఇల్లు.‘విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఈ మూడు జిల్లాల్లో ఇంత అందమైన ఇల్లు మరొకటి లేదు. ఏమంటావ్’ అంటాడు కుమార్ ఆమెతో. ‘అవునవును’ అని భర్త వైపు అంగీకారంగా చూస్తూ నవ్వుతుంది కరుణ.కుమార్ విశాఖపట్నంలో టూరిస్ట్ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉంటాడు. ఉత్తరాంధ్రలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను తన ట్వంటీఫైవ్ సీటర్ వ్యాన్‌లో తీసుకెళ్ళి వస్తూ వుంటాడు. వారంలో నాలుగైదు రోజులు ఉండడు. విశాఖపట్నంలో కాపురం పెట్టేంత స్తోమత లేక కాశీబుగ్గలో పెట్టాడు. భార్య సిటీ మాట ఎత్తకుండా ఇలా ఇంటిని పొగుడుతుంటాడు. ఉన్న దాంట్లో సంసారాన్ని సర్దడానికి, తనని సంతోష పెట్టడానికి భర్త పడే ఆపసోపాలు గుర్తొచ్చి నవ్వుకుంది కరుణ. ఫోన్ చేయాలని బలంగా అనిపించింది. టూర్లో ఉన్నప్పుడు సాధారణంగా చేయదు.. ఏ బిజీలో ఉంటాడోనని. కాని ఇవాళ తప్పేలా లేదు. పొట్ట నిమురుకుంది. నాలుగురోజులుగా అనుమానంగా ఉంటే ఉదయం కిట్ తెచ్చుకుని టెస్ట్ చేసుకుంది. అవును. తమ తోటలోకి దోగాడే చిట్టిపాదాలు రానున్నాయి.భర్తకు ఫోన్ చేసింది. కలవలేదు. అయితే ఆ సమయానికి కుమార్ చాలా ఆందోళనగా ఉన్నాడని ఆమెకు తెలియదు. కాంబాలకొండ అడవుల మధ్యలో గుడారాలలో నైట్ క్యాంపు ముందురోజు రాత్రే ముగిసింది. ఎప్పటిలాగే క్యాంపుకని 25 మంది యువ పర్యాటకులను తీసుకుని వెళ్ళాడు. అందమైన కటికి జలపాతం చేరుకోవడానికి చేసిన ట్రెక్కింగ్, బొర్రాగుహలలో సందడి, అరకు ట్రైబల్ మ్యూజియం.. ఇలా ట్రిప్ మొత్తం సరదాగా పూర్తి చేసుకుని నైట్ క్యాంపుకు వచ్చేశారు. అంతా బాగా సాగింది. ఉదయం 6 గంటలకు తిరుగు ప్రయాణం అని చెప్పాడు కుమార్. తెల్లవారి అందరూ రెడీ అయ్యి వ్యాన్ దగ్గరకు వచ్చేశారు. లెక్క చూసుకుంటే ఒక అమ్మాయి కనపడలేదు. ఆ అమ్మాయి ట్రిప్పుకి కూడా ఒంటరిగా వచ్చింది. బ్యాగు, చెప్పులు, ఫోను అన్నీ ఆమె టెన్టులో వున్నాయి కాని ఆమె అక్కడ లేదు. కుమార్ దగ్గర వున్న లిస్టులో ఆమె పేరు ‘షర్కియా’ అని వుంది. ఇతర వివరాలు ఏమీ ఉండకపోవడంతో ఫోను చేశాడు. ఫోను టెంట్లో నుంచే మోగుతోంది. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఏదైనా వాక్‌కి లేదా ఫొటోల కోసం వెళ్ళిందేమో అని మాట్లాడుకుంటున్నారు. కొందరు ‘షర్కియా గారూ’ అంటూ గాలించడం మొదలు పెట్టారు. ఆమెతో రెండు రోజుల నుండి కలసి ప్రయాణం చేసిన ఇద్దరు యువతులు ముందుకు వచ్చి ‘ఆ అమ్మాయి కాకినాడ నుండి వచ్చాను అని చెప్పింది. ఈ అడవికి చాలాసార్లు వచ్చాను కానీ రాత్రి క్యాంపు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పింది. ఆమెకు ఒక చేయి లేదు. ఉన్నది కృత్రిమ చేయి. గ్లౌసు తీసే వరకు మేము కూడా గమనించలేదు’ అని తెల్సిన సమాచారం ఇచ్చారు. సమయం పదిన్నర అయ్యింది. మిగతా టూరిస్ట్‌లలో విశాఖపట్నం నుండి విమానం ఎక్కాల్సిన వారు వున్నారు. వారికి ఆలస్యం అవుతోంది. కొందరు కాలేజీ పిల్లలు ‘ఇంట్లో రెండు రోజుల ట్రిప్ అని చెప్పి వచ్చాము ఆలస్యం ఐతే ఇబ్బంది అవుతుంది’ అంటూ కుమార్‌తో చెబుతున్నారు.పరిస్థితి కాంప్లికేట్ అవుతోంది అని అర్థం అయింది కుమార్‌కి. తప్పక ఒక నిర్ణయం తీసుకోవాలి. మిస్ అయిన అమ్మాయి కోసం తాను ఆగిపోయి అందరినీ వేరే బస్ మాట్లాడి వారికి క్షమాపణలు చెప్పి విశాఖపట్నం పంపించాడు. అన్నీ పోను మిగిలే పది వేలు.. ఇపుడా డబ్బు కూడా బస్కి ఇచ్చేయాలి. కానీ తప్పదు. పొద్దున పదకొండు కావొస్తోంది. క్యాంపుకు దగ్గరలోనే చెక్‌పోస్టులో ఉన్న ఫారెస్ట్ గార్డ్లకు విషయం తెలిసింది. అమ్మాయి నాలుగు గంటల నుండి కనపడటం లేదు అనగానే వారికి కూడా భయం మొదలు అయింది. వయసులో వున్న ఆడపిల్ల, అడవిలో నుండి టింబర్ డిపోకు వెళ్ళే లారీలు చాలానే ఉంటాయి. ఏ లారీవాడు ఆపి తీసుకెళ్ళి పోయినా చేయగలిగేది ఏమీ లేదు. భయం అంతకంతకూ పెరిగిపోతోంది. అమ్మాయి ఫోనుకి ఎవరైనా ఫోను చేస్తారేమో వివరాలు తెలుస్తాయి అని గార్డ్లు ఆమె ఫోను చేతుల్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ‘పదండి వెతుకుదాం’ అని అడవి దారి పట్టారు. సూర్యుడు మొహం మీద నుండి మాడు మీదకు వచ్చి తాండవం చేయడానికి సిద్ధం ఐపోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. వెతుకుతూనే వున్నారు. పన్నెండు అవుతూ ఉండగా వారంతా ఒక కొండ ఎక్కి దిగేశారు.. సెలయేరు చప్పుడు గట్టిగా దగ్గరగా వినపడుతోంది.. ఆ అమ్మాయి ఏమైనా కిందకి దిగిందేమో అని ఆశగా చూశారు. చుట్టూ ఊబి గుంటలు వుండే సెలయేరు కావడంతో ఎవరూ అటుగా వెళ్లరు. అటువంటిది ఆ సెలయేరుకి అవతలి గట్టు మీద నీలిరంగు దుస్తుల ఆకారం ఉన్నట్టు కనిపించింది. గబగబ దిగి అటువైపుగా అడుగులు వేశారు. దగ్గరకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక ఊబి గుంటలో కాళ్లు దిగబడి కనిపించింది. వీరి అలికిడికి ‘ఇక్కడున్నాను.. ఇక్కడా’ అని అరిచింది. నీటి మధ్యలో బండరాళ్ళు వున్నాయి. పుస్తకం, పెన్ను, కృత్రిమ చేయిని బండరాయి మీద విడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఊబిలో చిక్కుకున్నట్టు పరిసరాలు చూస్తే అర్థం అవుతోంది. ఆ అమ్మాయికి ఏమీ కాలేదని అర్థమైన కుమార్‌కు ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. ‘ఏమ్మా ఇక్కడకి ఎందుకు వచ్చారు.. మీ సరదాలు మా చావుకి వస్తాయమ్మా. చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు.. ఎందుకు ఇక్కడకి వచ్చావు. అసలెలా ఊబిలో ఇరుక్కున్నావు’ అని కోపంగా అడిగేశాడు. ఈలోపు గార్డులు ఆమెను బయటకు లాగారు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉంది. అప్పటికి కుమార్ కోపం తగ్గింది. గట్టిగా తిట్టానా అనుకున్నాడు. ఆ అమ్మాయి కోలుకుని–‘ఈ అడవి నాకు కొత్త కాదు. నేను ఇదే అడవిలో పుట్టి పెరిగాను. మా అమ్మ నాన్న నక్సలైట్స్. నాకు పన్నెండేళ్లు వుండగా నా కళ్ళ ముందే మా అమ్మను చంపేశారు పోలీసులు. మా అమ్మ ఇదిగో ఇదే చోట సమాధి అయ్యింది. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు.. మా నాన్న ఇక్కడకు వస్తాడనే ఆశతో వచ్చాను. కాని ఆయన బతికి ఉన్నాడో లేదో కూడా తెలియడం లేదు’ అంది.గార్డ్లు అలర్ట్ అయ్యారు.‘అమ్మ చనిపోయాక మా నాన్న ఒక విలేఖరి సహాయంతో నన్ను రంపచోడవరంలో ప్రభుత్వ హాస్టలుకు పంపించాడు. ఆ విలేఖరి రెండేళ్ల తర్వాత నన్ను అమ్మేయాలని చూశాడు. వ్యభిచార గృహం నుండి తప్పించుకునే ప్రయత్నంలో నా చేయి కోల్పోయాను. కాకినాడలో మూలికా వైద్యం చేస్తూ బతుకుతున్నాను. చిన్నప్పుడు అడవిలో మా నాన్న నేర్పాడు. తర్వాత ఆసక్తి కొద్ది నేర్చుకున్నాను. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడకు వచ్చాను. ఒక కొత్త రకం మొక్కను గమనిస్తూ పొరబాటున ఊబిలో ఇరుక్కుపోయాను..’కుమార్‌కి ఒక నిమిషం జాలి వేసింది. ఇంతలో చెక్‌పోస్ట్ దగ్గరికి పోలీస్ జీప్ చేరుకున్నట్టు ఫోన్ వచ్చింది. అప్పటికే అమ్మాయి వివరాలు గార్డులు పోలీసులకు చెప్పడంతో ‘ఆమెను స్టేషన్లో దించి మీరు వెళ్లండి’ అన్నారు కుమార్‌తో.‘అదెలా సార్. ఆమెను తిరిగి వైజాగ్‌లో దించడం నా బాధ్యత’ అన్నాడు కుమార్.‘ఏం కుమారూ.. ఈ పిల్లకి నీకు ఏమైనా వుందా ఏంటి? మేము చూసుకుంటాములే. నువ్వు బయలుదేరు’ అన్నాడు ఎస్.ఐ.ఎదురు మాట్లాడితే బతుకుతెరువు దెబ్బ తింటుంది. పోలీసుల హెల్ప్ లేకుండా ఫారెస్ట్‌లో టూరిస్ట్ క్యాంపులు చేయలేడు. ‘ఇదంతా మీరే తెచ్చుకున్నారు. సారీ’ అన్నాడు ఆ అమ్మాయితో స్టేషన్లో దిగబెట్టాక బయలుదేరుతూ.‘పర్వాలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్లండి’ అందా అమ్మాయి. తన దగ్గరున్న చిన్న నేత సంచిని ఇచ్చింది. ‘అడవి విత్తనాలు. ఇంట్లో వేసుకోండి. నా గిఫ్ట్’ అంది. సంచి చెమ్మగా ఉంది.ఆమె వైపే చూస్తూ స్టేషన్ నుంచి బయటపడ్డాడు. తెల్లవారుజామున ఇల్లు చేరుకున్న కుమార్‌కు నిద్ర కళ్లతో తలుపు తీసిన కరుణ జరిగింది విని మత్తు వదిలి కూచుంది.‘ఆ అమ్మాయి?’ అంది.‘ఏం చేస్తారో ఏమో, తెలుసుకోవాలన్నా భయంగా ఉంది’ అన్నాడు కుమార్.అతని టెన్షన్ చూసి చెప్పాలనుకున్న శుభవార్త చెప్పలేదు కరుణ. పొద్దున లేచాక భర్త లగేజీ నుంచి గింజల సంచిని తీసిన కరుణకు వాటిలోని రెండు మూడు గింజలకు చిన్నగా మొలకలు కనిపించాయి. వెంటనే ఇంట్లో ఖాళీగా వున్న కుండీలో పాతింది. రెండు రోజులు గడిచాయి.. మొలకలు వచ్చాయి. ఈలోపు పెద్ద తుఫాను అని ప్రకటన వచ్చింది. నాలుగైదు రోజుల పాటు కుంభ వృష్టి. ఈదురు గాలులకు ఎందరో ఇళ్ళు కోల్పోయారు. కరుణ, కుమార్ ఇంటికే పరిమితం అయ్యారు. తుఫాను ముగిశాక బయటికొచ్చి పరిశీలనగా చూసుకుంటే ఆ బీభత్సానికి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల కొమ్మలు విరిగిపోయి, ఇంట్లో వున్న మామిడి వేపచెట్లు పక్కకి వాలి జీవం కోల్పోయి కనిపించాయి. కరుణ చాలా బాధపడింది. చనిపోయిన మొక్కలను తీసి పక్కన వేస్తుండగా తొట్టిలోని మొలకల్లో నుంచి ఒకటి మాత్రం గట్టిగా తల వొంచకుండా నిలబడి ఉంది. ‘బావా ఇది చూడు .. ఇంత తుఫానునీ తట్టుకుని నిలబడింది అంటే అడవి మొక్క అయ్యుంటుంది. నువ్వు తెచ్చిన విత్తనాలు వేస్తే వచ్చింది’ అంది.కుమార్‌కు షర్కియా గుర్తుకు వచ్చింది. ఇక ఆగలేక స్టేషన్లో తెలిసిన కానిస్టేబుల్‌కు ఫోన్ చేశాడు.‘అన్నా.. ఆ అమ్మాయిని ఏం చేశారు?’ ఆందోళనగా అడిగాడు.‘ఏమైనా చేయడానికి ఆ అమ్మాయేమైనా కుందేలు పిల్లా? నక్సలైట్ కూతురు. నాలుగు సెక్షన్లు చదివి ఎస్సైకే వార్నింగ్ ఇచ్చింది. చాలా ధైర్యం. అలా ఉండాలి ఆడపిల్లంటే’ ‘మరి ఊరెళ్లిపోయిందా?’‘నేనే బస్సెక్కించాను ఆ రోజే’ ‘బతికించావు’ ఫోన్ పెట్టేశాడు.హుషారుగా తోటను బాగు చేసే పనిలో పడ్డాడు కుమార్.కరుణ అతడి దగ్గరకు వచ్చి ‘మనకో కూతురు పుడితే ఎలా ఉండాలనుకుంటావ్ బావా’ అనడిగింది.కుమార్ కుండీలో ఉన్న మొలక వైపు చూపుతూ ‘అదిగో అలా’ అన్నాడు.కరుణ అప్పుడు మెల్లగా అతని చేయి అందుకుని తన కడుపు మీద వేసుకుంటూ నవ్వింది. గొప్ప వెలుతురు నవ్వు అది. -
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
తల్లిదండ్రులు... పొరుగువారు
మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్ ఇష్టపడడు (దివ్య ఖుర్ ఆన్: 4:36) బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి. పోరపొచ్చాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి. అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి. పొరుగున ఉన్న బంధువులు: పొరుగున నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.– అబ్దుల్ రషీద్ -
వివాహ‘బంధం’ తెగతెంపులు!
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది. గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఇండోర్‌లో... 👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి. 👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి. 👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి 👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది. 👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే... ‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు.. ‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
సమస్యల్ని పంచుకుంటున్నాం..అవగాహన పెంచుకుంటున్నాం..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్‌లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్‌లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు. –సాక్షి, హైదరాబాద్ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...ఒత్తిడిని చిత్తు చేస్తూ..ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్‌లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్లైఫ్లో వలంటీర్‌గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్‌గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్‌లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్‌తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది. –సూర్య, మాదాపూర్నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...రిటైర్మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్‌కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం. –రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్అవగాహన పెంచుతున్న సమస్యలు...హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్లైఫ్లో వలంటీర్‌గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్‌ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.–అనూష, బోయినపల్లిజీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్‌కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్‌లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను. –రెబెకామరియా, వన్‌లైఫ్ నిర్వాహకులుఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...వన్లైఫ్లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా. –వెంకటరమణి -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
అంతరాలు పెరిగితే మొదటికే మోసం
హాయ్, హలో ఎలా ఉన్నారు? గుర్తున్నానా? లేదా రెండు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయారా? నిజాయితీగా మీ సమాధానం కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈ రోజు టాపిక్ ఈ గ్యాప్ పైనే.మొన్నా మధ్య మా కౌన్సెలింగ్ సెంటర్ కు ఓ జంట వచ్చారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం క్లయింట్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి అరుణ, సాగర్ అనుకుందాం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగైదు లక్షలు సంసాదిస్తున్నారు. గచ్చిబౌలి లో ఫ్టాట్, మంచి కారు, వీకెండ్ పార్టీలు, మంత్లీ ట్రిప్స్, ఏడాదికోసారి ఇంటర్నేషనల్ టూర్. హ్యాపీ లైఫ్. ఇది అందరికీ కనిపించే విషయం.కానీ లోలోపల అగ్గి రగులుతోంది. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగాయి. దూరం పెరిగింది. గత ఆరునెలలుగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఒక లాయర్ ను సజెస్ట్ చేయమని ఫ్రెండ్ ను అడిగారు. విడాకులకు అప్లయ్ చేశాక కూడా కౌన్సెలింగ్ కు వెళ్లాలని, దానికన్నా ముందే వెళ్లడం మంచిదని నా పేరు సజెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. మొదటి సెషన్ లో వారిద్దరితో విడివిడిగానూ, కలివిడిగానూ మాట్లాడి సమాచారం తీసుకున్నా. వారిద్దరూ విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదని, పెరుగుతున్న దూరమని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా, శారీరికంగా కలుస్తున్నా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా దూరమవుతున్నారని వారి మాటల ద్వారా తెలిసింది. కౌన్సెలింగ్, మేరిటల్ థెరపీ, రిలేషన్షిప్ ఎక్సర్ సైజ్ ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేశాను. దాంతో విడాకుల ఆలోచనకు స్వస్తి పలికి ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటల మధ్య ఏర్పడే వివిధ రకాల అంతరాలు, అదేనండీ గ్యాప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.అంతరాలను అర్థం చేసుకోవడం...పగలెలా ఉన్నా రాత్రికి ఒక్కటైతే చాలు, అన్ని సమస్యలూ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. అది ఆ కాలంలో నడిచిందేమో కానీ, ఈ కాలంలో వర్కవుట్ కాదు. జంట మధ్య శారీరక దూరంతో పాటు, ఎమోషనల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచ్యువల్ గ్యాప్స్ కూడా ఏర్పడవచ్చు. వాటికి సకాలంలో అడ్రస్ చేయకపోతే ఇద్దరి మధ్య కనిపించని అగాధం ఏర్పడుతుంది. అందుకే వాటి గురించి తెలుసుకుని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది.ఎమోషనల్ డిస్టెన్స్...జంటలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, భావోద్వేగాలు పంచుకోవడం తగ్గించినప్పుడు, మానివేసినప్పుడు ఎమోషనల్ గ్యాప్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, అరుణ తన కెరీర్ పడుతున్న స్ట్రెస్ గురించి సాగర్ కు చెప్పినప్పుడు, అది అందరికీ ఉండేదేగా, ప్రత్యేకం ఏముంది? అంటూ కొట్టిపడేశాడు. ఒకటి రెండు సార్లు అలా అనేసరికి తన ఒత్తిళ్ల గురించి చెప్పడం మానేసింది. తన కష్టాల్లో సాగర్ అండగా లేడని బాధపడటం మొదలుపెట్టింది. అది వారిద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ కు కారణమైంది.ఇంటలెక్చువల్ డిస్టెన్స్...తమకు ఎక్సయిట్మెంట్, ఇంటలెక్చువల్ స్టిములేషన్ కలిగించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మానేసినప్పుడు ఇది జరుగుతుంది. అరుణకు యద్దనపూడి నవలలంటే ఇష్టం. సాగర్ నాన్ ఫిక్షన్ చదువుతాడు. అది అతనిష్టం. కానీ ఈ కాలంలో యద్దనపూడి నవలలు చదవడమేంటని అరుణను వెక్కిరిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ఇంటలెక్చువల్ షేరింగ్ పూర్తిగా ఆగిపోయింది. దూరం పెరిగింది.ఎక్స్ పీరియన్షియల్ డిస్టెన్స్... ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండకపోవడమే కాదు, జంట మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చేయనప్పుడు దూరం పెరుతుంది. అరుణ, సాగర్ బిజీ వర్క్ లో పడిపోయారు. కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది. కలిసి వంట చేయడం సంగతి సరేసరి. ఎక్కువ సందర్భాల్లో స్విగ్గీ, జొమాటోలపైనే ఆధారపడుతున్నారు.స్పిరిచ్యువల్ డిస్టెన్స్... భాగస్వాముల నమ్మకాలు, ఆచారాలు ఏకోన్ముఖంగా లేనప్పుడు ఈ దూరం ఏర్పడుతుంది. అరుణకు ఓ గురువంటే అమితమైన భక్తి. సాగర్ నాస్తికుడు. ఆ గురువు మోసగాడని రోజూ విమర్థిస్తుంటాడు. కాలక్రమేణా, అది వారిద్దరి మధ్య నిశ్శబ్దానికి దారితీసింది.ఫిజికల్ డిస్టెన్స్... శారీరక దూరం అంటే సెక్స్ లేకపోవడం అని అర్థం కాదు, కానీ రోజువారీ పనుల్లో స్పర్శ, ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయంగా అరుణ చేతులు పట్టుకోవడం, సున్నితంగా కౌగిలించుకోవడం సాగర్ పూర్తిగా మర్చి పోయాడు. దూరాలను తగ్గించుకోవాలి... అరుణ, సాగర్ లానే మీ మధ్య కూడా ఇలాంటి దూరాలు, అంతరాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ అంతరాలను తగ్గించుకోవడానికి మీరిద్దరూ ప్రయత్నం చేస్తే చాలు. అరుణ, సాగర్ లకు చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు కూడా చెప్తా. మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి. గంటలు గంటలు అవసరం లేదు. కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో మొబైల్ చూడకుండా పార్టనర్ చెప్పేది వినాలి. మీ మీ వ్యక్తిగత అభిరుచులను అలాగే ఉంచుకుంటూ, ఇద్దరికీ ఇష్టమైన ఇంటలెక్చువల్ అంశం కనుక్కోండి, తరచూ దాని గురించి చర్చించుకోండి. మీరిద్దరూ ఎంజాయ్ చేసే వనులకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి. ఇది కలిసి వంట చేయడం, నడవడం లేదా అడ్వంచర్ ట్రిప్ లాంటిది ఏదైనా కావచ్చు.ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరొకరు గౌరవించుకోండి. మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి. శారీరక సాన్నిహిత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. దగ్గరగా కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులు ఫిజికల్ ఇంటిమసీని పెంచుతాయి. కొన్ని జంటలు ఈ పనులన్నీ చేస్తున్నా గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇరువురి మధ్య పరిష్కరించుకోని వైరుధ్యాలు, కనిపించని ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ అందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేకంటే కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లడం మంచిదని గుర్తించండి. విష్ యూ హ్యాపీ లైఫ్.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066Psy.vishesh@gmail.com -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
Anant-Radhika Wedding:ఆకాశ పందిరి.. తారలు తలంబ్రాలు
కుబేరులు వియ్యంకులైతే ఒక కల్యాణం ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగా జరుగుతుంది. దేవతల వంటి అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, శతభక్ష్య పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, స్త్రీల మెడల్లో పచ్చలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు...ముఖేష్ అంబానీ– నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో జూలై 12 రాత్రి జరప నిశ్చయించడంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ అందుకు భారీ వేదికైంది. దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక, ఆదివారం రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ జరుగనున్నాయి.తరలి వచ్చిన అతిథులుఒకవైపు తేలికపాటి చినుకులు పడుతూ ఉంటే అనంత్–రాధికల పెళ్లి కోసం అంబానీ గృహధామం ఎంటిలియాతో పాటు వివాహవేదిక జియో వరల్డ్ కన్వెçన్షన్‌లో అతిథుల తాకిడి మొదలైంది. ‘దుల్హేరాజా’ అనంత్ బారాత్‌ను సర్వాంగ సుందరంగా తయారు చేసిన కారులో కొనసాగింది. సాయంత్రం నుంచే అతిథుల రాక మొదలైంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయర్ మొదలు అమెరికా మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్ వరకు హాలీవుడ్ నటుడు జాన్ సీనా నుంచి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరకూ ఎందరో అరుదెంచారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రియాంకా చో్ప్రా– నిక్ జోన్స్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని, నాటి మేటి ఆటగాడు శ్రీకాంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. దక్షిణాది తారాతోరణంఅనంత్– రాధికల వివాహంలో దక్షిణాది తారలు తళుకులీనారు, మహేష్‌బాబు తన భార్య నమ్రత, కుమార్తె సితారతో హాజరవగా, రామ్‌చరణ్–ఉపాసన జోడీగా వచ్చారు. వెంకటేష్, రాణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ సతీసమేతంగా హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా వచ్చారు. నయనతార–విగ్నేష్ శివన్, సూర్య–జ్యోతిక వేడుకకు తళుకులు అద్దారు. -
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
Muthuswami Dikshitar: ఒక్కసారయినా అక్కడ పాడాలి
ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను. శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది. గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!! గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు. సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు. తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి. కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్‌గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా. రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు. పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్‌గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే? అంగీకరించాలి: టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్‌లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి. పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్‌లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్‌స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం. -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
Happy New Year 2024: వెల్కమ్ పార్టీ
2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు. ► బ్యానర్ ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చూపే ఒక సాధారణ బ్యానర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్‌తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్‌తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే. ► బెలూన్స్ నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్‌ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్ ఆర్చ్‌ని సృష్టించుకోవాలి. రెడీమేడ్‌గా కూడా ఈ ఆర్చ్‌లు దొరుకుతాయి. ఈ బెలూన్స్ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్ మరింత పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ► కొవ్వొత్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్‌లెస్, సెంటెడ్ క్యాండిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ► ఫన్ నెక్లెస్ లు టేబుల్‌పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్‌పైన పరిచే రన్నర్ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది. ► డిస్కో థీమ్ కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్‌తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పే సమయంలో డాన్స్ చేసే వీలుండేలా డిస్కో థీమ్‌ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి. ► పిల్లల కోసం ప్రత్యేకం పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్ బెలూన్లు, రంగురంగుల నాప్కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్‌ను అలంకరించవచ్చు. ► తెల్ల బంగారం తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్‌ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్ ఫ్రింజ్ కర్టెన్లను జోడించే ముందు డోర్ ఫ్రేమ్ పై భాగంలో తెల్లటి బెలూన్లను బ్లో అప్ చేయచ్చు. ► స్ట్రింగ్ లైట్లు బయటి వైపు స్ట్రింగ్ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది. ► పేపర్ ప్లేట్స్ రంగు రంగుల పేపర్ ప్లేట్లను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది. ► రంగు రంగుల టిష్యూ కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్‌ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్‌లో వేలాడదీయాలి. ► టేబుల్ క్లాత్ పింక్ గ్లిటర్ టేబుల్ క్లాత్ పరిచి, దానిపైన బంగారు, స్టార్ మోటిఫ్‌లతో ఉల్లాసభరితమైన థీమ్‌ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్ చేసే టేబుల్ న్యూ ఇయర్ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది. -
మీ బద్ధకం అమ్మకు భారమే
చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్‌లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి? స్కూల్ టైమ్ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్‌ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా? బద్ధ్దకమైన కాలం ఇది చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్ ఆమ్లేట్ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు. ‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్‌లో పెట్టి, ఒక ప్యాకెట్ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు. ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే? అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా. శుభ్రత అందరిదీ శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్రూముల్లో కిచెన్‌లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్‌లు కావాలి. ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. -
పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి
సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూసిన ఘటన .కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోదలకు ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26). ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నమగ్నమైన తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్న తిరుపతిని కుటుంబ సభ్యులు కాగజ్‌గనర్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల వద్ద మృతదేహం పెట్టాల్సి రావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


