
‘‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి’’ అనే శ్లోకం అందరికీ తెలుసు. అలాగే ఉత్తమ పురుషుడెవరనే అంశంపై ప్రాచీనకాలంనుంచి ఇటీవలి కాలం వరకూ అనేకానేక కల్పనలు, సిద్ధాంతాలు వచ్చాయి.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయా తు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః.. అని కామందక నీతిశాస్త్రంలో చెప్పారు.
పనిలో యోగిలా, కార్యనిర్వహణలో నిపుణుడిలా, రూపంలో కృష్ణుడిలా, క్షమలో రామునిలా, భోజనంలో తృప్తిగా, సుఖదుఃఖాలలో స్నేహంగా ఉండాలని దాని అర్థం.
అలాగే ‘ఆధునిక పురుషుడు ఎవరు?’ అనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. కొందరు కుటుంబాన్ని ముందుంచుతారు, ఇంకొందరు సంపద కోసం పరుగులు పెడతారు, మరికొందరు ఇతరుల ఆనందం కోసం జీవిస్తారు, మరొకరు ప్రశాంతత కోరుకుంటారు. ఇవన్నీ ఒకే మనిషి వ్యక్తిత్వానికి వేర్వేరు రంగులు.
అలాగే ప్రొవైడర్, హస్ట్లర్, ప్లేబాయ్, ఫిలాసఫర్, రెబెల్, మాంక్ అనే ఆరు వ్యక్తిత్వాలు పాప్ సైకాలజీలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. అలాగని ఇవేం ఊహాజనిత ట్యాగులు కాదు. వీటి వెనుక సైకాలజీ, కల్చరల్ ప్రభావం, పాప్ సైకాలజీ ఉన్నాయి.
The Provider: కుటుంబాన్ని ముందుంచడం, బాధ్యతను విలువగా చూడడం, కష్టపడటం ద్వారా సంతృప్తి పొందడం వీరి లక్షణం. బిగ్ ఫైవ్ పర్సనాలిటీ సిద్ధాంతంలోని Conscientiousness ఎక్కువగా ఉండే వ్యక్తులు ఈ వర్గంలో ఉంటారు. వీరు స్థిరత్వం, సెక్యూరిటీని ముఖ్యంగా చూస్తారు. అయితే తన అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల అప్పుడప్పుడూ బర్నవుట్ అవుతారు. ‘నా జీవితం ఇతరుల కోసమేనా?’ అని బాధపడతారు.
The Hustler: సక్సెసంటే పిచ్చి, నిరంతరం లక్ష్యాల వెంబడి పరుగులు, ఎంట్రప్రెన్యూరియల్ డ్రైవ్ వీరి లక్షణాలు. వీరికి Achievement Motivation ఎక్కువ. ప్రఖ్యాత సైకాలజిస్ట్ Erik Erikson చెప్పిన Industry vs. Inferiority దశను వీరు అత్యంత శక్తివంతంగా అధిగమిస్తారు. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మిస్సవుతుంది. సక్సెస్ ఉన్నా లోపల ఒంటరితనం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.
The Playboy: అందం, ఆనందం, ఆకర్షణ, స్టేటస్, రొమాన్స్ వీరి లక్షణాలు, లక్ష్యాలు. అందుకే గాఢమైన బంధాలకు దూరంగా ఉంటారు. వీరిలో Extraversion స్కోర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే Instant gratification, novelty-seeking బిహేవియర్ కూడా. అయితే బయటకు చార్మింగ్‌గా ఉన్నా, లోపల కమిట్మెంట్ అంటే భయం ఉంటుంది. అందుకే అటాచ్మెంట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంలో శూన్యత అనుభవిస్తారు.
The Philosopher: లోతైన ఆలోచన, సత్యాన్వేషణ, మానసిక/ఆధ్యాత్మిక ఎదుగుదల వీరి లక్షణాలు. Openness to Experience ఎక్కువ. Jungian archetypesలో The Sageకు దగ్గరగా ఉంటారు. అయితే ఆచరణలో కొన్నిసార్లు డిటాచ్డ్‌గా కనిపిస్తారు. సామాజిక, ఆర్థిక వాస్తవాలతో గ్యాప్ ఏర్పడుతుంది.
The Rebel: రెబెల్ అంటే తెలుసుగా. స్వేచ్ఛను అత్యంత విలువైన అంశంగా చూడటం, అందుకోసం నిబంధనలను సవాలు చేయడం వీరి లక్షణాలు. Erikson చెప్పిన Identity vs. Role Confusion దశలో ఎక్కువగా పోరాడి ఉంటారు. వీరు ప్రధానంగా Autonomyని ప్రధానంగా కోరుకుంటారు. అయితే వీరు సమాజనియమాలకు ఖాతరు చేయకపోవడం వల్ల అపార్థం చేసుకుంటారు. కానీ అంతరంగంలో వీరు అత్యంత ప్యాషనేట్.
6. The Monk: డిసిప్లిన్, ఆధ్యాత్మిక దృష్టి, మినిమలిజం, స్వీయ నియంత్రణ వీరి లక్షణాలు. Maslow hierarchyలోని అత్యున్నత స్థాయి స్వీయసాక్షాత్కారాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఆ క్రమంలో భాగంగా సామాజిక సంబంధాలు, భౌతిక జీవన అవసరాల నుండి పూర్తిగా వేరుపడే ప్రమాదం ఉంది. కానీ అంతరంగ శాంతి మాత్రం గరిష్ట స్థాయిలో ఉంటుంది.
జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఇవి డయాగ్నస్టిక్ కేటగిరీలు కావు. కేవలం సామాజిక సాంస్కృతిక ఫ్రేమ్‌వర్కులు మాత్రమే.
ఒక మనిషి ఒక్క టైప్‌లోనే ఉండిపోడు. జీవన దశలు, పరిసరాలు, లక్ష్యాలపై ఆధారపడి వేర్వేరు టైపుల లక్షణాలు బయటపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 20ల్లో ‘హస్ట్లర్’గా, 30ల్లో ‘ప్రొవైడర్’గా, 40ల్లో ‘ఫిలాసఫర్’గా మారవచ్చు.
ఇవి చదివి మిమ్మల్ని మీరు లేబుల్ చేసుకోకండి. వీటిని అద్దంలా ఉపయోగించుకుని మీలో ఏది బలంగా పనిచేస్తుందో తెలుసుకోండి.
మీ టైప్ మీకు శక్తినిస్తుందా లేదా పరిమితం చేస్తుందా? ఈ ఆత్మపరిశీలన మీ ఎదుగుదలకు మొదటి మెట్టు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com