
సోషల్ మీడియా
‘నాన్నా... కొత్త బుల్లెట్ కొన్నాను. ఎలా ఉంది?’ తండ్రిని అడిగాడు కొడుకు. ‘చాలా బాగుందిరా’ అన్నాడు నాన్న. ‘ఇది నా కోసం కాదు నీ కోసం’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి కళ్లు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. పద్నాలుగు సంవత్సరాల క్రితం కేరళలోని కొచ్చికి చెందిన అశ్విన్ తండ్రి బుల్లెట్ కొనాలని బలంగా అనుకున్నాడు. అయితే ఆర్థిక కష్టాలు కూడా అంతే బలంగా ఉండడంతో బుల్లెట్ బండి కొనలేకపోయాడు.
పద్నాలుగు సంవత్సరాల తరువాత తండ్రి కోరికను నిజం చేశాడు చేతికి అందివచ్చిన కొడుకు అశ్విన్. అశ్విన్ తన తండ్రికి బ్రాండ్–న్యూ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీ అందించడం, తల్లిదండ్రులు ఆ బండిని చూసి మురిసిపోవడం... ఇలాంటి దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎంత చేసినా తక్కువే’ ‘ఈ తరం పిల్లలు ఆశ్విన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!