
ఇద్దరు వ్యక్తులు కలిసి డేటింగ్ కి వెళ్తే... ఆ డేట్ అధ్యంతం పరస్పరం మెప్పించుకోవాలనో ఒప్పించుకోవాలనో... ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే తాము పరస్పరం అర్ధం చేసుకోవాలి అని అనుకుంటున్న విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టి... డేటింగ్ అలా ఉంచితే జీవితం లో ప్రతీ దశ లోనూ ఎవరో ఒకరిని మెప్పించక తప్పదు.. దాంతో అది తీవ్రమైన ఒత్తిడి కి దారి తీస్తోంది
మరో వైపు ప్రస్తుతం అనేకమంది వ్యక్తిగత జీవితం లో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కన్నా తమని తాము ఎక్స్ ప్రెస్ చేయడానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అయితే అది అంత సులభం గా జరిగేది కాదు.. అందుకే ఒంటరి జీవితాలు కూడా పెరుగుతున్నాయ్ ఈ నేపథ్యంలోనే సోలో డేటింగ్ అనే భావన కూడా పుంజుకుంది.
అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. మి టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో అయితే "ఒంటరి డైనింగ్" (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా "సోలో ట్రావెల్ & డేటింగ్" ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా యువత, ముఖ్యంగా మెట్రో సిటీస్‌లో, వీకెండ్ సోలో డేట్స్ ని ట్రెండ్‌గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో "సెల్ఫ్ కేర్" అనే భావనకు కొత్త దిశ గా దీన్ని పేర్కొoటూన్నారు
సోలో డేటింగ్... ఇలా
ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు, ఒక రొమాంటిక్ పార్ట్నర్ తో వెళ్ళినట్టు మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు న ఏదైనా కాఫీ షాప్ లోనో కల్చరల్ స్పేస్ లోనో కూర్చోవడం, సినిమా, డ్రామా.. వంటివి చూడటం, ప్రకృతి మధ్యలో ట్రెక్కింగ్ చేయడం, లేదా మనసుకు నచ్చిన చోటు ఎక్కడికైనా వెళ్లడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.
సోలో డేటింగ్ ప్రత్యేకత ఏమిటి?
ఇంటెన్షనల్ టైమ్ అలోన్ – యాదృచ్చికంగా ఏదో ఒంటరిగా ఉండటం కాదు, ప్రణాళిక బద్దంగా నాణ్యమైన సమయం మనకోసమే సమయం కేటాయించుకోవడం.ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ – కాంప్రమైజ్ అవకుండా మనకిష్టమైనదే చేయడం.
ప్రెజర్ లెస్ హ్యాపీ నెస్ – ఎవరినీ ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేకుండా, మన మనసు చెప్పింది అనుసరించడం.
సోలో డేటింగ్... ప్రయోజనాలు
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది – ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల పై ఆధారపడడం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది – సామాజిక బాధ్యతల నుండి విరామం లభిస్తుంది.
సెల్ఫ్ అవేర్‌నెస్ పెరుగుతుంది – నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చినది ఏంటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
స్పాంటేనియిటీ పెరుగుతుంది – ఇతరుల కోసం ఎదురు చూడకుండా కొత్త విషయాలు ప్రయత్నించే ధైర్యం వస్తుంది.
సోలో డేటింగ్ కోసం...కొన్ని ఎంపికలు
- పార్క్‌లో పుస్తకంతో పిక్నిక్
- పెయింటింగ్ లేదా పొటరీ క్లాస్
- ఒంటరిగా సినిమా లేదా మ్యూజియం సందర్శన
- మనసుకు నచ్చిన మ్యూజిక్ తో ఒక లాంగ్ డ్రైవ్
- రెస్టారెంట్‌లో ఫ్యాన్సీ డిన్నర్...
అంతర్జాతీయ ట్రెండ్స్
అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. #MeTime, #SoloDate, #SelfLove అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, సోలో డేటింగ్ అనేది లొన్లీగా ఫీల్ అవ్వడం కాదు. అది మనసు నింపుకోవడం, మనల్ని మనమే ప్రేమించడం. ఒంటరి తనం ప్రాప్తించింది అంటే భాధ కలుగుతుంది కానీ ఈ ఒంటరి తనం ప్లాన్ చేసుకుంది అంటే ఏదో సాధించిన ఆనందం ఆవరిస్తుంది అంటున్నారు సైకాలాజిస్ట్స్..
ఎస్. సత్యబాబు