Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ap High Court Granted Anticipatory Bail To Pinnelli Ramakrishna Reddy In 3 Cases
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.

Sensational Details Out From Realtor Kuppala Madhu Incident
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !

హైదరాబాద్‌, సాక్షి: రియల్టర్‌ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్‌.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్‌ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్‌ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్‌ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా‌ గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్‌ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్‌ ప్లాన్‌ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్‌ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్‌ కోసం తనతో పాటు చింతల్‌ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్‌(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్‌ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్‌ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్‌ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Thyrocare Technologies Founder A Velumani Success Story
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం

ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్‌పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్‌పట్టి పూదూర్‌లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్‌ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్‌ భర్త సక్సెస్ స్టోరీ

World Hunger Day 2024: Theme And History Significance Awareness
'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?

'ఆకలి' దీనికి ఎవరూ అతీతులు కారు. ఆకలి వేస్తే రాజైనా.. అల్లాడిపోవాల్సిందే. ఆకలి విలువ తెలిసిన వ్యక్తి సాటి వాడిని ఆకలితో బాధపడేలా చేయడు. కనీసం ఓ బ్రెడ్‌ లేదా గుప్పెడు అన్నం అయిన ఇచ్చి ఆదుకునే యత్నం చేస్తాడు. ముఖ్యంగా మనదేశంలో ఆకలితో అల్లాడిపోతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అంతేగాదు అధికారిక లెక్క ప్రకారం.. ఆకలి (Hunger) బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకలిని అంతం చేసేలా పేదరికం నిర్మూలనకు నడుంకట్టేందుకు ఈ ఆకలి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినోత్సవం ప్రాముఖ్యత ? విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.2011లో, ఆకలి, పేదరికాన్ని అంతం చేయడానికి ‘ది హంగర్‌ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’గా (World Hunger Day) ప్రకటించింది. ఈ రోజునఆహార భద్రతను ప్రోత్సహించే కమ్యూనిటీలను బలోపేతం చేయడం, పరిష్కారాలను కనుగొనడం వంటివి చేస్తుంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌ని ఏర్పాటు చేసి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అధికారులు. ఆకలితో అల్లాడుతున్న వారికి సాయం అందేలా ఏం చేయాలనే అనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా 811 మిలియన్ల మంది ఆకలి బాధతలో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ ఏడాది థీమ్‌! "అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం" దీన్ని ఇతి వృత్తంగా తీసుకుని మహిళలు, తమ కుటుంబాలు సమాజాలు ఆహారభద్రతను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నొక్కి చెబుతోంది. యూఎన్‌ ప్రకారం బిలియన్‌ కంటే ఎక్కువ మంది మహిళలు, కౌమరదశలో ఉన్న బాలికలు పోషకాహార లోపాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి తల్లులు, వారి పిల్లలు ఇరువురికి దారుణమైన పరిస్థితులున ఎదుర్కొనేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని సృష్టించొచ్చు. ప్రాముఖ్యత ..ఈ రోజున ప్రతి ఒక్కరిని కార్యచరణకు పిలుపునిచ్చేలా..ఆహార భద్రతను ప్రోత్సహించే సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆహార భద్రతను ప్రోత్సహించే విధానాల కోసం కృషి చేయడం. తినే ఆహారానికి సంబంధించిన సరైన ప్రణాళికలు, ఆకలిని అంతం చేసేలా కృషి చేయడం తదితర కార్యక్రమాలను చేపడతారు. అందరూ కలిసి ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని పొందేలా సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేలా చేయడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. చేయాల్సినవి..వ్యవసాయ అభివృద్ధి: రైతులు అవసరమైన వనరుల, సరైన శిక్షణ అందేలా చేయడంవిద్య: పేదరికం నిర్మూలించేలా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంఆరోగ్య సంరక్షణ: ఆకలి సంబంధితన అనారోగ్యాలను తగ్గుముఖం పట్టేలా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంఆర్థిక సాధికారత: పేద ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, వస్థాపకతకు మద్దతు ఇవ్వడం.(చదవండి: వరల్డ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్‌ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం)

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates.. 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్‌ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైఎస్సార్‌సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

NKR21: Vijayashanthi Play Key Role In Nandamuri Kalyan Ram‌‌ Latest Movie
టైటిల్‌ దాచి కొత్త సినిమా ఆప్‌డేట్‌ ఇచ్చిన కల్యాణ్‌ రామ్‌

సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి మరోసారి తెరపై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత పలువురు దర్శకులు తమ సినిమాల్లో నటించమని కోరినా..విజయశాంతి ఒప్పుకోలేదు. అంతేకాదు మళ్లీ తెరపై కనించబోదనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్‌ నటి మరోసారి తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు ఎన్టీఆర్‌ జయంతి(మే 28). ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇస్తూ ఓ చిన్న గ్లింప్స్‌ విడుదల చేశారు. టైటిల్‌తో పాటు కల్యాణ్‌ రామ్‌ గెటప్‌ని రివీల్‌ చేయకుండా ఈ గ్లింప్స్‌ని కట్‌ చేశారు. అయితే ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్లేమ్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చి ఇదొక మాస్‌ యాక్షన్‌ సినిమా అని పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా సోహైల్‌ ఖాన్‌ నటించగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌కు తల్లిగా నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

Liquor Policy Scam MLC Kavitha Bail Petition Hearing Updates
కవిత లిక్కర్‌ కేసు: నేడు ఈడీ, సీబీఐ కౌంటర్‌ వాదనలు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..కవితను అరెస్ట్‌ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్‌లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత

Lakshmi Parvathi Pay Tribute To NTR 101 Birth Anniversary
జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!

Delhi-Varanasi IndiGo Plane Receives Bomb Threat Latest News
ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు

ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్‌ మీద బాంబ్‌ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024

It was my fathers dream to become a cricketer: Rishabh Pant
క్రికెట‌ర్ కావాల‌న్న‌ది మా నాన్న క‌ల‌.. చాలా సంతోషంగా ఉంది: పంత్‌

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ త‌న రీ ఎంట్రీలో స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత తిరిగి మైదానంలో అడ‌గుపెట్టిన రిష‌బ్‌.. ఐపీఎల్‌-2024లో అద‌రగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు సార‌థ్యం వహించిన‌ పంత్‌.. ఆ జ‌ట్టు త‌ర‌పున లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు.ఈ ఏడాది సీజ‌న్‌లో ఓవ‌రాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడిన‌ పంత్‌.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పున‌రాగ‌మ‌నంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పంత్‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 భార‌త జ‌ట్టులో సైతం సెల‌క్ట‌ర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్ప‌టికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైన‌మెట్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు సన్న‌ద్దమవుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిష‌బ్ పాల్గోనున్నాడు. ఈ షోలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను పంత్ పంచుకున్నాడు. త‌న‌ను క్రికెట‌ర్‌గా చూడాల‌న్న త‌న తండ్రి క‌ల‌ను నేర‌వేర్చినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న క‌ల‌ను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్‌ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మ‌కు మాత్రం చాలా కోపం వ‌చ్చింది అంటూ న‌వ్వుతూ" పంత్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement