కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి | Stone Quarry Collapses In Mizoram Several Deceased | Sakshi
Sakshi News home page

మిజోరంలో కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి

May 28 2024 11:23 AM | Updated on May 28 2024 11:30 AM

Stone Quarry Collapses In Mizoram Several Deceased

ఐజ్వాల్‌: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్‌ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్‌ ఆపరేషన్‌కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.

 

మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్‌ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్‌ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో రెమాల్‌ తుపాన్‌ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement