వామ్మో.. మైనర్ల డ్రైవింగ్‌! జర జాగ్రత్త!! | Sakshi
Sakshi News home page

వామ్మో.. మైనర్ల డ్రైవింగ్‌! జర జాగ్రత్త!!

Published Tue, May 28 2024 8:50 AM

-

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పోలీస్‌ శాఖ విస్తృత ప్రచారం జనం చెవికెక్కడం లేదు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌ చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఎక్కడా మార్పు కనిపించటం లేదు.

పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా వినడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగదని జనం అభిప్రాయపడుతున్నారు.సోమవారం కరీంనగర్‌లో వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిస్తూ ‘సాక్షి’ కంటపడగా క్లిక్‌ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement