చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రముఖులు | Sakshi
Sakshi News home page

చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రముఖులు

Published Tue, May 28 2024 10:55 AM

-

భువనేశ్వర్‌: రాష్ట్రంలో చిట్ట చివరి దశ నాలుగో విడత పోలింగ్‌కు ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో పోటీ చేస్తున్న కాంగ్రెసు అభ్యర్థుల కోసం అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. వీరివురు వరుసగా ఈనెల 29, 30 తేదీల్లో ఒడిశాలో పర్యటించి జూన్‌ 1న రాష్ట్రంలో 4వ దశ జంట ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఒడిశా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ అజయ్‌ కుమార్‌ మీడియాకు తెలియజేశారు. ఈనెల 29 ఉదయం 11 గంటలకు బాలాసోర్‌లో జరిగే ఎన్నికల ర్యాలీలో మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు, భద్రక్‌ జిల్లాలోని చాంద్‌బాలిలో మరో ర్యాలీలో ఏఐసీసీ చీఫ్‌ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈనెల 30న భద్రక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సిములియాలోని సన్నొమహిత్‌పూర్‌లో జరిగే ఎన్నికల సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగించనున్నారు. మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌, జగత్‌సింగ్‌పూర్‌, కేంద్రాపడా జాజ్‌పూర్‌ లోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement