
కాకినాడ, సాక్షి: జిల్లా రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంపర(పూర్వపు తూర్పుగోదావరి) మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. కాంగ్రెస్ తరఫున రెండు సార్లు సంపర ఎమ్మెల్యే గా గెలిచారాయన. బుల్లబ్బాయి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జన్మించిన అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి.. తొలుత వ్యాపార రంగం, అక్కడి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాసంస్థల ద్వారా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీఎస్సార్టీసీకి రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్‌గానూ అనిశెట్టి పని చేశారు. ఆయనకు భార్య రత్నం, ఒక కొడుకు ఉన్నారు.