భువనేశ్వర్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు అంచెలంచెలుగా పూర్తవుతున్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఈ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసే సరికి రాష్ట్రంలో సమగ్రంగా 90,000 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, అత్యవసర సేవలలో నిమగ్నమైన వ్యక్తులు మరియు ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కుని వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ల సౌకర్యానికి అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభకు ఏక కాలంలో జరిగిన మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు దాదాపు 94,000 పోస్టల్ బ్యాలెట్‌లను అర్హులైన వ్యక్తులు వినియోగించుకున్నారని సీఈవో తెలిపారు. 85 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అనేక మంది వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకున్నారు. అంతేకాకుండా కొంతమంది ఓటర్లు పీవీసీ మరియు పీబీఎఫ్‌సీ సహాయంతో తమ ఓటును వేశారని సీఈవో తెలిపారు.