ఉపాధి పేరిట మోసం!
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుహాన ట్రస్టు, సిమ్ గ్రూప్ కంపెనీ పేరిట సంబల్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక వ్యక్తులతో కలిసి ఆదివాసీ, హరిజన యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామని పర్లాకిమిడి కలెక్టరేట్ వద్ద యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో శిబిరం నిర్వహించారు. వారి వద్ద నుంచి రిజిష్ట్రేషన్ ఫీజుగా కొంత సొమ్మును తీసుకుని రెట్టింపు డబ్బులు ఇస్తామని, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని ప్రలోభాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆదర్శ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందజేశారు. వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని స్వచ్ఛంద సంస్థ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదర్శ పోలీసు స్టేషన్‌లో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధి పేరిట మోసం!


