సమాజ శ్రేయస్సులో విద్యార్థుల పాత్రకీలకం
● జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి
రాయగడ: సమాజ శ్రేయస్సులో విద్యార్తుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గాయత్రీనగర్‌లోని సరస్వతి శిశువిద్యామందిరం 33వ వార్షికోత్సావాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే సమాజ శ్రేయస్సు గురించి అవగాహన కల్పించుకోవాలన్నారు. చదువుతో పాటు వారికి సమాజ హితం గురించి ఉపాధ్యాయులు నేర్పించాలని అన్నారు. అవగాహన లోపంతో చాలామంది పక్కదారిపట్టి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రాథమిక దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్య పరచాలని ఉద్బోంధించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి పౌరులని అన్నారు. బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. విద్యాలయం కమిటీ అధ్యక్షులు మంగీలాల్ జైన్, కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహాంతి, విద్యాలయం ప్రధానోపాధ్యాయులు మనోరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
అడవులను సంరక్షించాలి
రాయగడ: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో అటవీ, పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో అడవుల్లో కొనసాగుతున్న అగ్ని ప్రమాదాల గురించి వివరించారు. అవగాహన రహితంతో అడవులను కాల్చివేస్తున్నారని దీనివల్ల పచ్చదనం అంతరించడంతోపాటు విలువైన వృక్ష సంపదను మనమంతా కోల్పొతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ తరహా అగ్నిప్రమాదాలను నివారించేందుకు అధికారులు అధిక శ్రద్ధతీసుకోవాలని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ అన్నా సాహేబ్ అహూలే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. జిల్లాలోని మునిగుడ, కళ్యాణసింగుపూర్, రాయగడ సమితుల్లో అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను సంరక్షించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. అటవీ శాఖ, పోలీస్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా అడవుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేపట్టాల్సిన చైతన్య కార్యక్రమాలపై చర్చించారు.
సమాజ శ్రేయస్సులో విద్యార్థుల పాత్రకీలకం


