కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీనివాసనుకి, గొదాదేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారామ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి హారతి, వ్రత పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి వ్రతాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పర్యాటకుల ప్రాణాలు
కాపాడిన లైఫ్ గార్డులు
భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల కారణంగా యువకుడు మునిగిపోయాడు. తీరంలో పహరా నిర్వహిస్తున్న 4 మంది లైఫ్‌గార్డ్‌లు ఈ ప్రాణాపాయ పరిస్థితి గమనించి సముద్రంలోకి దూకి యువకుడిని రక్షించారు.
బిసంకటక్‌లో బీఎస్పీ
కార్యకర్తల సమావేశం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో బహుజన్ సమాజ్ పార్టీ మంగళవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, సీనియర్ నాయకుడు జితు జకసికలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని బలొపేతానికి కార్యకర్తలు సహకరించాలని ఈ సందర్భంగా నాయక్ అన్నారు. సమితీ వార్లగా సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను చైతన్య పరచాలని అన్నారు. భవిష్యత్‌లో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు. కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిమతాన్ని తెలుసుకుని అందుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తే దానికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొందరు పార్టీలో చేరారు. వారికి సాదరంగా నాయకులు ఆహ్వానించారు. బిసంకటక్‌కు చెందిన గౌరీప్రసాద్ పాత్రో తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
విద్యుద్ఘాతంతో లారీ డ్రైవర్ మృతి
రాయగడ: విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలోని చంద్రపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడు ప్రశాంత జెన్న (39)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్కోకి వెళితే.. చంద్రపూర్ సమితి పరిధిలోని బంధిరి నుంచి చంద్రపూర్ వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో లారీ డ్రైవరు ప్రశాంత్ మెటల్ లోడ్ ను తీసుకువస్తున్న సమయంలో లోడ్‌ను డాలా ఎత్తి అన్‌లోడింగ్ చేస్తున్న సమయంలో పైనఉన్న విద్యుత్ తీగలు లారీకి తాకడంతో విద్యుత్ ఘాతం ఏర్పడింది. దీంతో సంఘటన స్థలంలోనే ప్రశాంత్ మృతి చెందాడు. మృతునిది జిల్లాలోని గుణుపూర్ పరిధి జల్తార్ గ్రామం.
కలెక్టరేట్‌లో గుడ్ గవర్నెన్స్‌పై వర్క్‌షాప్
పర్లాకిమిడి: స్థానిక లెక్టరేట్‌లో జిల్లాస్థాయి గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు సందర్భంగా ఓస్వాన్ హాలులో ‘ప్రశాసన్ గావ్ కి ఔర్’ అనే వర్క్‌షాపు జరిగింది. ఈ కర్మశాలలో ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అధ్యక్షత వహించారు. జిల్లాలోని అన్ని మండలస్థాయిలో ఆరోగ్యం, విద్య, శిశువికాస్, సాధరణ ప్రజా వినతులను వినడం, వాటి పరిష్కారం దిశగా అధికారులు ముందుకు సాగటంపై ఏడీఎం మఝి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గుడ్ గవర్నన్స్ ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మిధాలీ మధుస్మితా పాఢి, కష్యప్ బెహరా సహా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు


