శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల సెమినార్
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో రెండురోజులుగా సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలు, డిజిటల్ పేమెంట్స్, వ్యాపారం, నిర్వహణ, సమాజాభివృద్ధిపై సెమినార్ జరుగుతోంది. ఈ రెండు రోజుల సెమినార్‌ను ముఖ్యఅతిథిగా ఉన్నత విద్యా మండలి ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ నారాయణ బెహరా విచ్చేసి ప్రారంభించారు. అతిఽథి పరిచయం, స్వాగత ఉపన్యాసం కనన్‌బాలా పాత్రో వ్యవహరించగా, అతిథులుగా స్టార్టప్, ఇన్నోవేషన్ సెల్ (గ్లోబల్ బిజినెస్ స్కూల్, పరిశోధనకేంద్రం) డాక్టర్ ప్రబీర్ చంద్ర పాఢి, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్ర పట్నాయిక్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మేధావులు, అర్ధశాస్త్ర పరిశోధన బోధకులు, ప్రస్తుత అంతర్జాతీయ బిజినెస్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల భారత వృద్ధి రేటు పెరుగుతుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ నారాయణ బెహరా అన్నారు. కాలంతో పాటు వ్యాపారం, విద్య, గూగుల్‌పే, ఫోన్‌పే, ఇతర సాధానాల వల్ల ప్రజల అవసరాలు సకాలంలో తీరడం కాకుండా సమయ పాలన తగ్గుతుందని అన్నారు. అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల అనేకమంది ప్రజల డబ్బులు సైబర్ వలలో పడి పోగొట్టుకుంటున్నారని అన్నారు. రెండో రోజు సెమినార్‌లో కామర్సు విభాగం (బరంపురం విశ్వవిద్యాలయం) డాక్టర్ మహేశ్వర్ శెఠి, గంజాం జిల్లా సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ రథ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల సెమినార్
శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల సెమినార్


