
30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి
జయపురం:
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు కొరాపుట్ జిల్లాకు వచ్చేవి. కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు మామిడి తోటలు వేశారు. అంతగా విక్రయం కాకపోవటంతో రైతులు నష్టపోతూ వచ్చారు. రైతుల నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసి వారికి మద్దతు ధర లభించేందుకు మిషన్ శక్తి మహిళా సమితి, సివైఎస్‌డి సహకారంతో డొంగర రాణి కృషి ఉత్పాదన కంపెనీ లిమిటెడ్ ముందంజ వేశాయి. జిల్లాలో దసమంతపూర్ సమితిలో సివైఎస్‌డి సహకారంతో డొంగర రాణి కృషి ఉత్పాదన కంపెనీ లిమిటెడ్ వారు దసమంతపూర్ సమితి ప్రాంతాల్లో మామిడి ఉత్పత్తులను సేకరించి వాటిని ఛత్తిష్‌గఢ్, కటక్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. గత రెండు రోజుల్లో దసమంతపూర్ సమితి పటామాలిగుడ, కర్తాస్, జానిగుడ, కావుగుడ, పాట్‌ఖండ్, అడముండ ప్రాంతాల నుంచి 30 టన్నుల మామిడి పండ్లను ఛత్తిష్‌గఢ్, కటక్‌కు పంపినట్లు కంపెనీ సీఈఓ యజ్ఞదత్త మహరాణ వెల్లడించారు. జిల్లాలో జయపురం, బొరిగుమ్మ, కక్కిరిగుమ్మ తదితర ప్రాంతాల్లో ఈ ఏడాది మామిడి పంట బాగా పండిందని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామని మహరాణ తెలిపారు.