మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు

Published Tue, May 28 2024 10:55 AM

మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు

భువనేశ్వర్‌: రాష్ట్రంపై రీమల్‌ తుఫాన్‌ ప్రభావం చూపకపోవడంతో మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరోసారి పెరుగుతాయని స్థానిక భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రాంతీయ కార్యాలయం ముందస్తు సమాచారం సోమవారం జారీ చేసింది. ఐఎండీ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్‌ మనోరమ మహంతి తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రమంతటా పగటిపూట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో వడగాలుల పరిస్థితులు త్వరలో తిరిగి వచ్చే అవకాశం లేదు. అలాగే రాష్ట్రంలో ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. వచ్చే వారంలో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. నయాగడ్‌ జిల్లా రాంపూర్‌లో గరిష్టంగా 92.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్రాపడా జిల్లాలోని రాజ్‌నగర్‌లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈనెల 31 వరకు వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement