● బీమా వర్తింపు ఇలా... | - | Sakshi
Sakshi News home page

● బీమా వర్తింపు ఇలా...

Jan 5 2026 8:10 AM | Updated on Jan 5 2026 8:10 AM

● బీమ

● బీమా వర్తింపు ఇలా...

● బీమా వర్తింపు ఇలా... ● వైఎస్సార్‌ పాలనలో రూ.1063.21 కోట్లు...

కడప అగ్రికల్చర్‌: రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులపై మోయలేని భారం మోపింది. ప్రీమియం సొమ్ము చెల్లిస్తేనే పంటల బీమా వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేసింది. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలపై కోట్లాది రూపాయల ప్రీమియం భారం పడింది. మరోవైపు సకాలంలో బీమాను చెల్లించే అవకాశమూ ఇవ్వకుండా అన్నదాతలతో ఆడుకుంటోంది.

● ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా చెల్లించడానికి ఇంతవరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల క్రితం పంటకు ఎంతెంత బీమా చెల్లించాలనే ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం.. ప్రీమియాన్ని ఎప్పుడు చెల్లించాలో చెప్పలేదు. మరో 25 రోజుల్లో రబీ సీజీన్‌ కూడా ముగుస్తుంది. జిల్లావ్యాప్తంగా వేలమంది రైతులు బీమా చెల్లింపునకు ఎదురుచూస్తున్నారు. అసలు ఏ కంపెనీ పేరు మీద డబ్బులు చెల్లించాలో కూడా తెలియక దిగాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు ఏదైనా జరిగితే బాధ్యులెవరని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. సాధారణంగా బీమాను నవంబర్‌ మొదటి వారంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అటువంటిది డిసెంబర్‌ ముగిసినా ఇంతవరకు బీమా చెల్లింపుకు ప్రకటన రాకపోవడం చూస్తే కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందని పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు విమర్శిస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 88,753 హెక్టార్లలో

వివిధ పంటలసాగు...

జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 88,753 హెక్టార్లలో వివిధపంటలు సాగయ్యాయి. ఇందులో శనగ 63,427 హెక్టార్లలో, మినుము 11,199 హెక్టార్లలో, మొక్కజొన్న 4667 హెక్టార్లలో, జొన్న 1726, సజ్జ 645, వరి 2149, పెసర 762 , వేరుశనగ 1046, నువ్వులు 1543, పత్తి 222, ప్రొద్దుతిరుగుడు 301 హెక్టార్లలో సాగయ్యాయి.

మైలవరం ప్రాంతంలో సాగులో ఉన్న శనగపంట

గడువు ముగుస్తున్నా పత్తాలేని రబీపంటల బీమా చెల్లింపు ప్రకటన

నైరాశ్యంలో వేలాది మంది రైతన్నలు

జగన్‌ హయాంలో రైతుల పక్షానప్రభుత్వమే చెల్లించిన వైనం

ఇప్పుడు రైతు సొంతంగా కట్టాలన్నా సహకరించని కూటమి ప్రభుత్వం

అనుమతి రాగానే తెలియజేస్తాం...

రబీ పంటలబీమా చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషయమై ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్నాయి. అనుమతి రాగానే రైతులకు తెలియజేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – బుక్కే చంద్రానాయక్‌,

జిల్లా వ్యవసాయ అధికారి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరం అంటే 2019–20లో కేవలం ఒక్క రుపాయి ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించింది. 2020–21 నుంచి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాపులో నమోదైతే చాలు పంటల బీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. 2019– 20 నుంచి 2022–23 వరకు ఉచిత పంటల బీమా కింద 3,80,475 మంది రైతన్నలకు చెల్లించిన పరిహారం రూ. 1063.21 కోట్లు నేరుగా రైతులు బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఏటా ఖరీప్‌ సీజన్‌ ఆరంభంలోనే బీమా పరిహారం విడుదల చేయడం వల్ల రైతలకు పంటలసాగుకు ఊరట లభించేది.

● బీమా వర్తింపు ఇలా... 1
1/3

● బీమా వర్తింపు ఇలా...

● బీమా వర్తింపు ఇలా... 2
2/3

● బీమా వర్తింపు ఇలా...

● బీమా వర్తింపు ఇలా... 3
3/3

● బీమా వర్తింపు ఇలా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement