ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉడతా ఉడతా ఊచ్.. రొట్టెముక్క దొరికిందోచ్...
చిరు పొట్టలో ఆకలేసిందో ఏమో చిటారుకొమ్మలన్నీ తిరిగింది.. చిటపటమంటూనే అటూ..ఇటూ చూసింది... ఈ చెట్టు నుంచి.. ఆ చెట్టుకు తోకాడిస్తూ జంపులు చేసింది.. చివరగా ఓ చోట రొట్టె ముక్క దొరికింది.. ఇంకేముంది.. ఇదిగో ఇలా పటపట మంటూ కొరుకుతూ సంతోషంతో ఆరగించింది.. కడప నగరంలోని మరియాపురం ప్రాంతంలో ఓ బాదం చెట్టు పై
ఉడత విన్యాసమిది.
బందూక్ చేతబట్టి.. బందోబస్తు విధుల్లో తిరిగే పోలీసులకు కాసింత ఆటవిడుపు లభించింది...స్టేషన్‌లో రికార్డులు రాస్తూనో.. కాదంటే కేసులు కడుతూనో రోజంతా బిజీగా గడిపే పోలీసు అధికారులకు కాస్త రిలాక్సేషన్ దొరికింది.. ఉరుకులు పరుగుల జీవితానికి విరామమిచ్చి.. మైదానంలో దిగి ఉత్సాహంగా ఆటలాడారు.. ఖాకీ యూనిఫాం పక్కనబెట్టి ఉల్లాసంగా గడిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోలీస్ క్రీడలు ఆదివారం రెండో రోజు ఉత్సాహభరితంగా కొనసాగాయి. కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి. అథ్లెటిక్స్ విభాగంలో పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్ త్రో పోటీల్లో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. –కడప అర్బన్
– ఫొటోలు.. మహమ్మద్ రఫీ, ఫొటోగ్రాఫర్, కడప
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...


