యూత్ పాలసీపై సూచనలు ఇవ్వండి
కడప ఎడ్యుకేషన్: డ్రాప్ట్ నేషనల్ యూత్ పాలసీ –2025లోని అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు, యువజన, విద్యా సంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని స్టెప్ సీఈఓ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాప్ట్ నేషనల్‌యూత్ పాలసీకు సంబంధించి వెబ్ పోర్టల్‌లో పరిశీలించి ఆయా అంశాలపై అభిప్రాయాలు, సూచనలను ceostepkdp@gmail.comకు ఈ నెల 10లోపు పంపాలని ఆయన తెలిపారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 8న కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఓపెన్ కేటగిరీలో ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీవో గౌస్‌బాషా తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, ఈత, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఎంపికల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ జిరాక్స్ తో పాటు 2 ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 8న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కాకినాడలో రిపోర్ట్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94402 97692 మొబైల్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మంగళ,బుధవారాల్లో అండర్ –14 పురుషుల టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు జరగనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరుకావాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు కాఫీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5) సర్టిఫికెట్ , బర్త్ ప్లేస్ సర్టిఫికెట్ తో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలకు అండర్– 14 కట్ ఆఫ్ డేట్ 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తెల్లటి దుస్తులతో హాజరుకావాలని సూచించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 10న స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే పురస్కరించుకొని జిల్లాలోని యువతకు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రితవ్య శాఖ, మై భారత్ కేంద్ర (నెహ్రూ యువ కేంద్ర) జిల్లా యువ అధికారి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కడప మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, ప్రశంస పత్రం,మొమెంటో అందజేస్తామన్నారు. జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్లలోపు ఉన్న యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను మెరుగు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 93983 91912 అనే నంబర్లో సంప్రదించాలని కోరారు.
కడప ఎడ్యుకేషన్: గుంటూరులో నిర్వహించిన 48 ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో శ్రీ లంకపల్లి బుల్లయ్య ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును యోగి వేమన యూనివర్సిటీ లలితకళా విభాగం అధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు అందుకున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో గుంటూరులో జరిగిన ఈ సదస్సులో ‘రాజా రాణి ఎర్ర చందనం కొయ్య బొమ్మలపై’ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాన్ని ఉత్తమమైందని ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద మృత్యుంజయరావుకు నగదు, పరిశోధనా పత్రం బహుకరించారు. యూనివర్సిటీ వీసీ బెల్లంకొండ రాజ శేఖర్, ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్, రిజిస్ట్రార్ పుత్తా పద్మ తదితరులు ఆయన్ను అభినందించారు.
కడప అగ్రికల్చర్: రబీ 2025–26 కు సంబంధించి 90,437 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా ఇప్పటివరకు 30,305.29 మెట్రిక్ టన్నులు జిల్లాకి సరఫరా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 16,651.53 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో యూరియా 3,168.63 మెట్రిక్ టన్ను లు, డీఏపీ 2,976.5 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్‌లు 8,598.04 మెట్రిక్ టన్నులు, యం.ఓ.పి. 489.8 మెట్రిక్ టన్నులు, యస్.యస్.పి 1418.56 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు. జిల్లాలోని రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన అన్ని రకములైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులెవరూ ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.


