● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

● రైత

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

కడప సిటీ/చక్రాయపేట: కరువు నేలపై జలకళ తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారు. కాలేటి వాగుతోపాటు మరో రెండు చిన్న రిజర్వాయర్లకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చక్రాయపేట మండలంలోని ఆయా ప్రాంతాలు నిత్యం కరువు కోరల్లో చిక్కి తండ్లాడుతుంటాయి.. వేసిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులే ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి రైతులను ఆదుకునేందుకు అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో కాలేటి వాగు నిర్మించడంతోపాటు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా తరలించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 90 శాతం పనులు కూడా చేసింది. ఆపై కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులు ఆగిపోయాయి. పనులు కొనసాగించి ఉంటే 2025 డిసెంబరు చివరి నాటికే పనులు పూర్తయి 133 చెరువులు నింపేందుకు అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు సర్కారు అన్ని విషయాల్లోనూ కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. పనులు ప్రారంభించి అన్నదాతలను ఆదుకోవాల్సిందిపోయి అనేక సాకులు పెట్టి జరిగిన పనులపై విజిలెన్స్‌ అంటూ కొత్త రాగం అందుకుంది. అంతేనా మొత్తం పనిమీద 25 శాతం పూర్తి కాలేదన్న నెపంతో కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రీ టెండరు పిలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులు నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ దుష్ట పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.

రూ. 4300 కోట్లతో పనులకు శ్రీకారం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చక్రాయపేట మండలం తక్కళ్లపల్లె సమీపంలో 1.2 టీఎంసీల సామర్థ్యంతో కాలేటి వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. వేంపల్లె మండలం పామలూరు గ్రామ సమీపంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ కాలువపై 56 కి.మీ వద్ద నుంచి దాదాపు 125 కిలోమీటర్ల మేర పైపులైను ద్వారా కాలేటి వాగును నింపేందుకు ప్రణాళికలు చేపట్టింది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా వెలిగల్లు ప్రాజెక్టుకు పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రెండు విభాగాలుగా పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని జంగమదేవరపల్లె వద్దకు 800 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఈ పథకం వల్ల దాదాపు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని 133 చెరువులకు నీళ్లు అందించి భూగర్భ జలాలు పెంచడం కూడా లక్ష్యంగా అనుకున్నారు. ఈ మేరకు రూ. 4300 కోట్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కేటాయించింది.

90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి

కాలేటి వాగు నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిస్తే రిజర్వాయర్‌ స్పిల్‌వే, గేట్లు, ఎర్త్‌బండ్‌ పనులు ఈ ప్రభుత్వం రాకముందే ఓ కొలిక్కి వచ్చాయి. పనులు యథావిధిగా జరిగి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కాలేటి వాగుకు నీరు అంది రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరేది.

కరువు నేలపై జల సిరులు పారించాలని.. కాడి పట్టిన రైతింట సిరులపంటలొలకాలని.. జననేత వైఎస్‌ జగన్‌ పరితపించారు.. సీఎం హోదాలో కాలేటి వాగుకు శ్రీకారం చుట్టారు... భూమాత ఒడిలో గలగలల సవ్వళ్లు వింటూ ఆనందించాలని కరవు రైతులు కలలుగన్నారు.. అధికారం మారాక.. సీఎంగా చంద్రబాబు కొలువుదీరాక రైతు కల కల్లలైంది. పనులు పూర్తి చేయడం బాబు మనసుకు భారమైంది.. సీమ భూముల్లో నీళ్లు పారడం ఆయనకు నచ్చనట్లుంది.. అంతే కాలేటి వాగు కదలనంది. ‘కాలేటి వాగు చూస్తే..కడుపు మండుతోందా బాబూ..’ అంటూ రైతు లోకం ఎలుగెత్తి ప్రశ్నిస్తోంది.

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులు నిలిపివేత

133 చెరువులకు నీరు అందని వైనం

ప్రాజెక్టు పనులు 90 శాతంవైఎస్సార్‌ సీపీ హయాంలో పూర్తి

విజిలెన్స్‌ తనిఖీపేరుతో కాలయాపన చేస్తున్న బాబు సర్కారు

ప్రస్తుతం 25 శాతం పనులు జరగలేదని రీ టెండరుకు యత్నం

ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఆది నుంచి వ్యవసాయమంటే పట్టదు.. రైతులంటేనే గిట్టదు. ఇక వైఎస్సార్‌ జిల్లా ప్రజలన్నా.. రైతులన్నా ఆయనకు చిన్నచూపే. కాలేటి వాగు నిర్మాణ పనులు ఆపడమే ఇందుకు తాజా ఉదాహరణ. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ సాగునీటి ప్రాజెక్టు పనులను ముందుకు సాగించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచి నిధులు కేటాయిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టెండరునే రద్దు చేసి కాలయాపన చేస్తూ ముందుకు సాగుతోందని మండిపడుతున్నారు.

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం 1
1/3

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం 2
2/3

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం 3
3/3

● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement